Shani Transit 2026 : రేవతి నక్షత్రంలోకి శని - మే 17 నుంచి మీ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..?

Shani transit Revati Nakshatra May 2026 : మే 17న శని దేవుడు అత్యంత సున్నితమైన రేవతి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారం వల్ల మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జీవితాల్లో కర్మ, భావోద్వేగ మార్పులు రానున్నాయి. 

Published on: May 11, 2026, 04:28:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Shani transit Revati Nakshatra May 2026 : జ్యోతిష్య శాస్త్రంలో కర్మ ఫల ప్రదాతగా పిలువబడే శని దేవుడు… మే 17న రేవతి నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇది రాశిచక్రంలో అత్యంత భావోద్వేగ, సున్నితమైన ప్రాంతంగా పరిగణించబడుతుంది, . ఈ సంచారం బాహ్య మార్పుల కంటే అంతర్గత మథనాన్ని ఎక్కువగా కలిగిస్తుంది. ముఖ్యంగా గతంలో పెండింగ్‌లో ఉన్న భావోద్వేగ అధ్యాయాలను మూసివేసి…. కొత్త పరిణతిని నేర్పే కాలం ఇది.

రేవతి నక్షత్రంలోకి శని సంచారం (Pinterest)
రేవతి నక్షత్రంలోకి శని సంచారం (Pinterest)

నుమ్రోవాణికి చెందిన సిద్ధార్థ్ ఎస్ కుమార్ విశ్లేషణ ప్రకారం.. ఈ దశలో శని మందగమనాన్ని, క్రమశిక్షణను కోరుకుంటాడు. ఏల్నాటి శని, శని ధైయా లేదా శని మహాదశ నడుస్తున్న వారు ఈ ప్రభావాన్ని మరింత స్పష్టంగా అనుభవిస్తారు.

రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?

  1. మేష రాశి : మీరు ఒక్కసారిగా లోకానికి దూరమైనట్లు (Disconnect) అనిపించవచ్చు. అతిగా ఆలోచించడం వల్ల నిద్రలేమి సమస్యలు రావచ్చు. స్క్రీన్ సమయాన్ని తగ్గించి, ధ్యానానికి ప్రాధాన్యత ఇవ్వండి.
  2. వృషభ రాశి : మీ స్నేహ సంబంధాల్లో మార్పులు వస్తాయి. పాత బంధాలు దూరమై, కొత్త, అర్థవంతమైన పరిచయాలు ఏర్పడతాయి. కెరీర్ మార్గంపై పునరాలోచన చేస్తారు.
  3. మిథున రాశి : వృత్తిపరంగా ఒత్తిడి పెరిగినట్లు అనిపించినా, హఠాత్తుగా కెరీర్ నిర్ణయాలు తీసుకోవద్దు. వాదనలకు దూరంగా ఉంటూ వ్యవస్థీకృతంగా ఉండటం మేలు చేస్తుంది.
  4. కర్కాటక రాశి : పాత నమ్మకాలు మారుతాయి. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. జర్నలింగ్ లేదా ఆధ్యాత్మిక పఠనం మీకు మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది.
  5. సింహ రాశి : దాచిన భయాలు, ఆర్థిక అభద్రత బయటకు రావచ్చు. మీ అహం ప్రకారం స్పందించకుండా, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ముఖ్యం.
  6. కన్యా రాశి : సంబంధాలలో కమ్యూనికేషన్ లోపం తలెత్తవచ్చు. ఏకపక్ష ప్రయత్నాలు ఆపి, వాస్తవిక దృక్పథంతో బంధాలను అంచనా వేయండి.
  7. తులా రాశి : భావోద్వేగ ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. సరైన నిద్ర, సమతుల్య ఆహారం మరియు భావోద్వేగ సరిహద్దులు చాలా అవసరం.
  8. వృశ్చిక రాశి : మీరు ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. పాత గాయాలు తిరగదోడవచ్చు, కానీ వాటిని సృజనాత్మక పనుల్లోకి మళ్లించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
  9. ధనుస్సు రాశి : కుటుంబ విషయాలు, ఇంటి భద్రత చుట్టూ ఆలోచనలు తిరుగుతాయి. గతానికి సంబంధించిన భావోద్వేగ చెత్తను క్లియర్ చేయడానికి ఇది సరైన సమయం.
  10. మకర రాశి : మీ మాట తీరు కఠినంగా మారవచ్చు. అపార్థాలు రాకుండా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి. అంతర్గత చిరాకును అదుపులో ఉంచుకోవాలి.
  11. కుంభ రాశి : ఆర్థిక అభద్రత లేదా డబ్బు గురించిన ఆందోళనలు వేధిస్తాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండి, పొదుపుపై దృష్టి సారించడం అవసరం.
  12. మీన రాశి : శని మీ రాశిలోనే ఉండటం వల్ల మీ స్వీయ వ్యక్తిత్వాన్ని పునర్నిర్మిస్తారు. మానసిక అలసట అనిపించినా, ఇది మిమ్మల్ని మరింత పరిణతి చెందిన వ్యక్తిగా మారుస్తుంది.

కొన్ని సూచనలు:

  • ఈ సమయంలో ఏ నిర్ణయమైనా తొందరపడి తీసుకోకండి.
  • రోజువారీ దినచర్యలో పక్కా నియమాలు పాటించండి.
  • భావోద్వేగ సమతుల్యత కోసం ధ్యానం లేదా యోగా ఉత్తమ మార్గాలు.
  • శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి.

గమనిక: ఈ సమాచారం గ్రహాల కదలికల ఆధారంగా ఇచ్చిన సాధారణ అంచనాలు మాత్రమే. వ్యక్తిగత జాతక వివరాల కోసం నిపుణులను సంప్రదించడం మంచిది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More