నవ పంచమ రాజయోగం 2026 : కెరీర్, ఆదాయపరంగా గోల్డెన్ పీరియడ్ - త్వరలోనే ఈ రాశులకు ఊహించని అదృష్టం..!
Navpancham Rajyog 2026 : ఈ ఏడాది జూలైలో అత్యంత అరుదైన 'నవపంచమ రాజయోగం' ఏర్పడనుంది. బృహస్పతి, నెప్ట్యూన్ గ్రహాల కలయికతో ఏర్పడే ఈ యోగంతో మేషం, మిథునం, కన్య వంటి రాశుల వారికి కెరీర్, ఆదాయం పరంగా గోల్డెన్ పీరియడ్ ప్రారంభం కానుంది.
Navpancham Rajyog 2026 : జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల గమనం…. వాటి మధ్య ఏర్పడే కోణాలు మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ క్రమంలోనే 2026 జూలైలో ఒక అరుదైన, అత్యంత శక్తివంతమైన 'నవపంచం దృష్టి రాజయోగం' రూపుదిద్దుకోబోతోంది. జూలై 20, 2026 నుంచి ఈ యోగ ప్రభావం ప్రారంభమవుతుందని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు. ముఖ్యంగా కెరీర్, ఆర్థిక స్థితి, కుటుంబ సంబంధాలలో సానుకూల మార్పులను ఆశించే వారికి ఇది ఒక వరం లాంటిదని చెప్పవచ్చు.

నవపంచ యోగం అంటే ఏమిటి?
జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం…. రెండు గ్రహాలు ఒకదానికొకటి 120 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు 'నవపంచం' యోగం ఏర్పడుతుంది. ఈసారి జ్ఞానానికి, సంపదకు కారకుడైన బృహస్పతి (గురుడు)…. ఆలోచనలకు, సృజనాత్మకతకు ప్రతీక అయిన నెప్ట్యూన్ గ్రహాల మధ్య ఈ దృష్టి యోగం కుదురుతోంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని విధంగా అదృష్టం వరించనుంది.
ఈ రాశుల వారికి తిరుగుండదు…
మేష రాశి : ఈ కాలం అత్యంత అద్భుతంగా ఉండబోతోంది. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తి కావడమే కాకుండా, ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి బంధం మరింత బలపడుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరగడమే కాకుండా, ఆర్థికంగా స్థిరపడతారు.
మిథున రాశి : మిథున రాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనే మీ కల నెరవేరుతుంది. వృత్తి పరంగా నిపుణులకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. సమాజంలో మీకు దక్కే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే, ఆస్తికి సంబంధించిన చట్టపరమైన వ్యవహారాల్లో కొంత ఓపిక వహించడం మంచిది.
కన్యా రాశి : కన్యా రాశి వారి వ్యక్తిత్వంలో గొప్ప మార్పు వస్తుంది. మీ మాట తీరుతో ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు. వ్యాపారవేత్తలకు భారీ లాభాలు చేకూరుతాయి, దీనివల్ల మీ బ్యాంకు బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగుతుంది. ఆదాయ వనరులు పెరగడంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. మొండితనాన్ని వీడి, పరిస్థితులకు అనుగుణంగా మారితే మరిన్ని విజయాలు సొంతమవుతాయి.
వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశుల వారు కూడా ఈ రాజయోగం వల్ల గణనీయమైన ప్రయోజనాలను పొందుతారని జ్యోతిష్య గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం మీద జూలై 20 తర్వాత ఈ రాశుల వారి జీవితాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి.
గమనిక : ఈ కథనంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనదని మేము ధ్రువకరించలేం. మరింత సమాచారం కోసం…. సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించి నిర్ధారించుకోవటం ఉత్తమం.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

