హిందూ సంప్రదాయంలో ఏకాదశి వ్రతానికి విశేష స్థానం ఉంది. శ్రీమహావిష్ణువుకు అంకితమైన ఈ రోజున భక్తితో పూజిస్తే కోరిన ఫలాలు దక్కుతాయని, జీవితంలో ఆనందం, శ్రేయస్సు నిలుస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి నెలా రెండు చొప్పున ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. వాటిలో ఒకటి కృష్ణ పక్షంలో, మరొకటి శుక్ల పక్షంలో వస్తాయి. 2026 డిసెంబర్ నెలలో రెండు కీలక ఏకాదశులు వచ్చాయి.

వాటిలో మొదటిది ఉత్పన్న ఏకాదశి కాగా, రెండోది మోక్షదా ఏకాదశి. ఈ రెండు ఏకాదశి వ్రతాలను జరపడం శుభప్రదంగా భావిస్తారు. మోక్షదా ఏకాదశి వ్రతం పుణ్యఫలం, మోక్షానికి మార్గం చూపుతుందని నమ్ముతారు. ఈసారి ఈ రెండు ఏకాదశుల వేళ పలు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాలు, ఇళ్లలో విష్ణు సహస్రనామ పారాయణాలు, ఉపవాసాలు, తులసి పూజలు నిర్వహిస్తారు. పంచాంగ నియమాలు, సూర్యోదయ సమయాలను బట్టి తిథి, పారణ ముహూర్తాల్లో ప్రాంతాల వారీగా స్వల్ప మార్పులు కనిపిస్తాయి.
ఉత్పన్న ఏకాదశి: తేదీ, శుభ యోగాలు, వ్రత విరమణ సమయం
పంచాంగం ప్రకారం కార్తీక కృష్ణ పక్ష ఏకాదశి తిథి డిసెంబర్ 3, 2026 రాత్రి 11:03 గంటలకు మొదలవుతుంది. డిసెంబర్ 4, 2026 రాత్రి 11:44 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ తిథి ప్రకారం డిసెంబర్ 4 శుక్రవారం నాడు ఉత్పన్న ఏకాదశి వ్రతం ఆచరిస్తారు.
ఉత్పన్న ఏకాదశి రోజున సౌభాగ్య, శోభన యోగాలు ఏర్పడుతున్నాయి. శుక్రవారం కావడంతో లక్ష్మీనారాయణుడి అనుగ్రహం పొందడానికి ఇది అనుకూలమైన రోజు. ఆ రోజు చిత్త, స్వాతి నక్షత్రాల కలయిక వ్రత ప్రాధాన్యాన్ని మరింత పెంచుతోంది. ఈ యోగాల్లో వ్రతం చేస్తే జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుందని, ఆర్థిక బలం చేకూరుతుందని, మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. పూజకు మధ్యాహ్నం 12:24 నుంచి 12:58 వరకు శుభ సమయం ఉంది. ఉత్పన్న ఏకాదశి వ్రత విరమణ డిసెంబర్ 5, 2026న చేయాయ్చు. ముహూర్తం ఉదయం 6:59 నుంచి 9:04 వరకు ఉంటుంది.
మోక్షదా ఏకాదశి: తేదీ, భద్ర కాలం, వ్రత విరమణ సమయం
మార్గశిర శుక్ల పక్ష ఏకాదశి తిథి డిసెంబర్ 19, 2026 రాత్రి 10:09 గంటలకు ప్రారంభమవుతుంది. డిసెంబర్ 20, 2026 రాత్రి 8:14 గంటలకు ముగుస్తుంది. డిసెంబర్ 20 ఆదివారం నాడు మోక్షదా ఏకాదశి వ్రతం నిర్వహిస్తారు. పూజకు మధ్యాహ్నం 12:32 నుంచి 1:05 వరకు మంచి సమయం ఉంది.
{{/usCountry}}మార్గశిర శుక్ల పక్ష ఏకాదశి తిథి డిసెంబర్ 19, 2026 రాత్రి 10:09 గంటలకు ప్రారంభమవుతుంది. డిసెంబర్ 20, 2026 రాత్రి 8:14 గంటలకు ముగుస్తుంది. డిసెంబర్ 20 ఆదివారం నాడు మోక్షదా ఏకాదశి వ్రతం నిర్వహిస్తారు. పూజకు మధ్యాహ్నం 12:32 నుంచి 1:05 వరకు మంచి సమయం ఉంది.
{{/usCountry}}మోక్షదా ఏకాదశి రోజున రవి యోగం, సర్వార్థ సిద్ధ యోగాలు ఏర్పడుతున్నాయి. వేద జ్యోతిష్యంలో సర్వార్థ సిద్ధ, రవి యోగాలను ఎంతో శుభప్రదమైనవిగా పరిగణిస్తారు. ఈ యోగాల్లో చేసే పనులకు మంచి ఫలితం వస్తుందని విశ్వసిస్తారు. అయితే ఆ రోజు భద్ర ప్రభావం కూడా ఉంది. పంచాంగం ప్రకారం మోక్షదా ఏకాదశి రోజున ఉదయం 8:41 నుంచి మధ్యాహ్నం 3:44 వరకు భద్ర ఉంటుంది. మోక్షదా ఏకాదశి వ్రత పారణ డిసెంబర్ 21, 2026న చేస్తారు. పారణ ముహూర్తం ఉదయం 7:10 నుంచి 9:13 వరకు ఉంటుంది. శుభ యోగాలు, ముహూర్తాలను గమనిస్తూ భక్తిశ్రద్ధలతో ఏకాదశి వ్రతాలు ఆచరిస్తే ఇంట్లో ఆనందం, ఆధ్యాత్మిక శ్రేయస్సు నిలుస్తాయని భక్తులు భావిస్తారు.
Also Read 11 दिसंबर से 6 राशियों का शुरू होगा गुड टाइम, 138 दिन बाद शनि बदलेंगे चालAlso Read 2 दिसंबर से 5 राशियों का बदलेगा समय, बुध गोचर से होगा खूब प्रॉफिटAlso Read खाटू श्यामजी मंदिर में बदला सुबह और शाम की आरती का समय, यहां करें चेकABOUT THE AUTHOR
పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు