తిరుమలకు వెళ్లే చాలా మందికి తెలియని విషయం.. శ్రీవారి దర్శనం కంటే ముందే ఇక్కడకు వెళ్లాలి!

తిరుపతిలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు మీరు తప్పక సందర్శించవలసిన ఆలయం ఒకటి ఉంది. శ్రీవారి ఆలయం కంటే పురాతనమైనది. చాలా మందికి ఈ విషయం తెలియదు.

Published on: May 24, 2026, 08:26:10 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమలకు వెళ్లేవారు చాలా మంది నేరుగా శ్రీవారి దర్శనం చేసుకుంటారు. కానీ స్వామివారి ఆలయం చుట్టూ అనేక ఇతర శక్తివంతమైన ఆలయాలు ఉన్నాయి. వాటికి చాలా చరిత్ర ఉంది. ఆ ఆలయాలన్నీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కథలతో ముడిపడి ఉన్నాయి. అటువంటి ఆలయాలలో ఒకటి వరాహస్వామి ఆలయం.

తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం

భూ వరాహస్వామి ఆలయం అని కూడా పిలిచే శ్రీ వరాహస్వామి ఆలయం తిరుమల కొండపై ఉంది. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిక్కున, స్వామి పుష్కరిణికి వాయవ్య మూలలో ఉంటుంది. ఈ ఆలయం వెంకటేశ్వర ఆలయం కంటే పురాతనమైనది.

హిరణ్యాక్షుడనే రాక్షసుడి నుండి భూమిని రక్షించిన తరువాత వరాహ స్వామి (విష్ణువు అవతారం) ఈ కొండపై కొలువుదీరారు. ఈ కారణంగానే తిరుమల కొండలను 'ఆది వరాహ క్షేత్రం' అని పిలుస్తారు. కలియుగం ప్రారంభంలో వరాహ స్వామి తిరుమల కొండపై తన భూమిని విష్ణువు మరొక రూపమైన వెంకటేశ్వరునికి ఇచ్చారు. దీంతో ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు శ్రీవారు.

తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 ఏళ్లు అవ్వగా, అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతమై ఉండేది. వేంకటేశ్వరుడికి వరాహ స్వామి భూమి ఇచ్చాడు. దానికి బదులుగా వరాహస్వామికి శ్రీవారు ఒక వరం ఇచ్చాడు. వేంకటేశ్వర స్వామి తన పూజ కంటే ముందుగా మొదటి గంట, పూజ, నైవేద్యం వరాహ స్వామికి సమర్పించాలని వరం ఇచ్చారు. ఈ కారణంగా వెంకటేశ్వర స్వామికి పూజ, నైవేద్యం సమర్పించే ముందు వరాహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.

అందుకే భక్తులు వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహ స్వామి దర్శనం చేసుకోవాలని చెబుతారు. తిరుమలలో వరాహ దర్శనం చేసుకోకుండా మీ తిరుమల యాత్ర పూర్తి కాదని అంటుంటారు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు.

ఇంకా చరిత్ర ప్రకారం వరాహ స్వామి ఆలయాన్ని క్రీ.శ. 1535లో పెద్దా తిరుమలాచార్యులు పునరుద్ధరించారు. ఈ ఆలయం టీటీడీలో ఒక భాగం, దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. ఇంతకు ముందే చెప్పినట్లుగా వేంకటేశ్వర స్వామిని పూజించే ముందు వరాహ స్వామికి అన్ని నైవేద్యాలు సమర్పించి, గంటలు మోగిస్తారు. అంతేకాకుండా రోజువారీ క్రతువులు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి, రథ సప్తమి రోజులలో వార్షిక బ్రహ్మోత్సవాలు, చక్రసనామం కార్యక్రమాన్ని జరుపుతారు.

తనకోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు రావాలని శ్రీనివాసుడు చెప్పాడని నమ్మకం. లేని పక్షంలో తిరుమల యాత్ర అసంపూర్ణం అవడమే కాకుండా శ్రీవారి దర్శన ఫలం కూడా దక్కదని వరాహస్వామికి వరం ఇచ్చాడు. ఆనాటి నుంచి మెుదటి దర్శనం శ్రీ వరాహస్వామిదే.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More