Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి ప్లాన్ చేస్తున్నారా? ఈ తేదీలు నోట్ చేసుకున్నారా? ఈరోజు వీటికి బుక్ చేసుకోవచ్చు!

ఆగస్టు 2026లో తిరుమల వెళ్లే భక్తుల కోసం టీటీడీ రూ.300 దర్శనం, వసతి గదులు మరియు ఇతర సేవలకు సంబంధించిన కోటా విడుదల తేదీలను ప్రకటించింది. మే 23 నుండి 25 మధ్య జరిగే ఈ బుకింగ్ ప్రక్రియలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఆఫ్‌లైన్ గదుల నిబంధనలు ఏంటి? పూర్తి వివరాలు ఈ కథనంలో..

Published on: May 23, 2026, 08:36:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? ఆగస్టులో స్వామివారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే భక్తుల కోసం టీటీడీ ఆన్లైన్ కోటాను రిలీజ్ చేయబోతోంది. దర్శన టికెట్లతో పాటు వసతి గదుల బుకింగ్, ప్రత్యేక సేవల వివరాలను అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి ప్లాన్ చేస్తున్నారా? ఈ తేదీలు నోట్ చేసుకున్నారా? (gemini ai)
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి ప్లాన్ చేస్తున్నారా? ఈ తేదీలు నోట్ చేసుకున్నారా? (gemini ai)

ఈరోజు అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు

మే 23 అనగా ఈరోజు ఆగస్టు కోటాకు సంబంధించి కొన్ని సేవలను టీటీడీ అందుబాటులోకి తీసుకు వస్తుంది. టీటీడీ అధికారిక వెబ్సైట్ (https://ttdevasthanams.ap.gov.in/home/dashboard) ద్వారా అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

ఈరోజు అంగప్రదక్షిణ టోకెన్ల విడుదల సమయం: ఉదయం 10 గంటలకు.

ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటా విడుదల సమయం: ఉదయం 11 గంటలకు.

వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న భక్తులకు ఉచిత ప్రత్యేక దర్శన కోటా మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతుంది.

దివ్యానుగ్రహ విశేష హోమ దర్శనం

తిరుమల వెళ్లాలనుకునే వారు, దర్శనం కోసం టికెట్లు దొరకని వారు, శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ విశేష హోమం ద్వారా దర్శనానికి వెళ్లొచ్చు. అలిపిరి దగ్గర ఉన్న గోప్రదక్షిణ శాల దగ్గర ఈ హోమం నిర్వహిస్తారు. ఈ టికెట్ ధర ఇద్దరికీ కలిపి రూ.1600. హోమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కల్పిస్తారు. ప్రతి నెల 25వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు?

భక్తుల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 25వ తేదీన ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలో వసతి గదుల కోటాను కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. భక్తులు బుక్ చేసుకోవాలనుకుంటే అధికారిక వెబ్సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలి.

ఆఫ్లైన్లో గదులు దొరకనట్లయితే, కొండపై ఉన్న సి.ఆర్.ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో గదులను పొందవచ్చు. రూ.50, రూ.100, రూ.1000ల్లో గదులు అందుబాటులో ఉంటాయి. అయితే గదుల కోసం ఉదయం 5 గంటల నుంచి 11 గంటల లోపు వెళ్తే గది దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేవలం 24 గంటలకే మాత్రమే గదిని కేటాయించడం జరుగుతుంది.

రూమ్ నిబంధనలు:

ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తప్పక ఉండాలి.

ఒంటరిగా వచ్చే వారికి గది ఇవ్వరు.

21 ఏళ్ల లోపు వయసు ఉన్నవారికి గదులు కేటాయించరు.

పెళ్లి కాని జంటలకు కూడా వసతి సౌకర్యాన్ని అందించరు.

వెంకటేశ్వర శ్లోకం

వినా వెంకటేశం న నాథో, న నాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి

హరే వెంకటేశా ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ

ఈ శ్లోకానికి అర్థం: వెంకటేశ్వర స్వామి తప్ప నాకు వేరే దిక్కులేదు. ఎప్పుడూ ఆ వెంకటేశ్వర స్వామినే స్మరిస్తున్నాను. ఓ వెంకటేశ్వరా! నాపై అనుగ్రహం చూపించు. నాకు శుభాలను కలిగించు.

ఓం నమో వెంకటేశాయ!

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More