138 రోజుల తర్వాత మీన రాశిలో శని ప్రత్యక్ష సంచారం, 4 రాశుల జీవితంలో డబ్బు, విజయాలు, ఉద్యోగాలతో పాటు ఎన్నో!

శని ఎప్పటికప్పుడు రాశిని, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. నిర్దిష్ట కాలం తర్వాత గ్రహాలు వాటి రాశి మార్పు చెందుతూ ఉంటాయి. ఆ సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. శని ప్రత్యక్ష సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితంలో ప్రభావం చూపించిన కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు.

Published on: Nov 01, 2025 9:52 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాలు రాశి మార్పు చెందినప్పుడు 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కర్మలకు, న్యాయానికి అధిపతి అయినటువంటి శని ఎప్పటికప్పుడు తన రాశిని, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. ఒక నిర్దిష్ట కాలం తర్వాత గ్రహాలు వాటి రాశి మార్పు చెందుతూ ఉంటాయి. ఆ సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి.

శని సంచారంలో మార్పు
శని సంచారంలో మార్పు

శని ప్రత్యక్ష సంచారం

నవంబర్ 28న తిరోగమనం నుంచి ప్రత్యక్ష సంచారంలోకి మారతాడు. దీంతో ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. వచ్చే ఏడాది అంటే జూన్ 2027 వరకు మీన రాశిలోనే శని సంచారం జరుగుతుంది. శని తన స్థానాన్ని మార్చినప్పుడు శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు ఎదురవుతాయి. మరి ఇక శని ప్రత్యక్ష సంచారం ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది? ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.

శని ప్రత్యక్ష సంచారం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం

శని ప్రత్యక్ష సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితంలో ప్రభావం చూపించిన కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఈ రాశుల వారికి సంతోషం ఎక్కువగా ఉంటుంది. కెరీర్‌లో పురోగతిని చూస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక లాభాలను పొందుతారు.

1.మేష రాశి:

మేష రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం అనేక లాభాలను తీసుకు వస్తుంది. కెరీర్ పరంగా ఊహించని మార్పులను చూస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. పెట్టుబడి పెడితే మంచి రాబడిని పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం.

2.కుంభ రాశి:

కుంభ రాశికి అధిపతి శని. రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం బాగా కలిసి వస్తుంది. వ్యాపారులకు ఎక్కువ లాభాలు వస్తాయి. పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడిని పొందుతారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.

3.తులా రాశి:

తులా రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం ఊహించని లాభాలను తీసుకు వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు విజయాలను అందుకుంటారు. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. ఈ సమయంలో పెట్టుబడి పెడితే అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలా తులా రాశి వారికి కూడా ఎన్నో లాభాలు కలుగుతాయి.

4.మీన రాశి:

మీన రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. కెరీర్‌లో ఊహించని మార్పులు ఉంటాయి. పెట్టుబడి పెడితే బాగా రాబడి వస్తుంది. శని దేవుని ఆశీస్సులతో మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More