నవంబర్‌లో జరిగే గ్రహ సంచారాలతో 4 రాశుల వారు వెంటనే ధనవంతులు అవుతారు!
నవంబర్ నెలలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవబోతున్నాయి. కొన్ని గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. దీంతో శుభ యోగాలు ఏర్పడతాయి. కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు. మరి ఏ రాశుల వారికి నవంబర్ నెల బాగా కలిసి వస్తుంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతినెలా కూడా కొన్ని గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. ఈ గ్రహాల సంచారంలో మార్పు ఉండడంతో ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. నవంబర్ నెలలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవబోతున్నాయి. నవంబర్ నెలలో చూసినట్లయితే కొన్ని గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. దీంతో శుభ యోగాలు ఏర్పడతాయి. కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు. మరి ఏ రాశుల వారికి నవంబర్ నెల బాగా కలిసి వస్తుంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం.

నవంబర్ నెలలో గ్రహాల సంచారంలో మార్పు:
ప్రతి నెలా కూడా కొన్ని గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. దీంతో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. మనం నవంబర్ నెలలో చూసినట్లయితే కొన్ని గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. దీంతో శుభ యోగాలు కలుగుతాయి. నవంబర్ నెలలో సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు, అలాగే శని ప్రత్యక్ష సంచారం చేస్తాడు. శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు, కుజుడు సొంత రాశి అయిన వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో నవంబర్ నెలలో కొన్ని రాజయోగాలు ఏర్పడతాయి.
మాలవ్య యోగం, హంస రాజయోగం, రుచక రాజయోగం, ఆదిత్య కుజ రాజయోగం వంటివి ఏర్పడతాయి. ఈ యోగాలు నాలుగు రాశుల వారికి ఎక్కువ లాభాలను తీసుకు రానున్నాయి. మరి ఏ రాశుల వారు గ్రహాల సంచారంలో మార్పుతో శుభ ఫలితాలను పొందుతారు? ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం.
నవంబర్ నెలలో అద్భుతమైన రాజయోగాలు.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం:
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ సమయంలో అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. నవంబర్ నెలలో ఈ రాశి వారు ఆర్థిక లాభాలను పొందుతారు. వ్యాపారులకు కూడా ఎక్కువ లాభాలు ఉంటాయి. ప్రశాంతత ఉంటుంది, సంతోషంగా ఉంటారు. ధైర్యం పెరుగుతుంది, అనుకున్న పనులను పూర్తి చేస్తారు.
2.తులా రాశి:
తులా రాశి వారికి నవంబర్ నెల బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఎక్కువ ఆర్థిక లాభాలను పొందుతారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. పాత ఇన్వెస్ట్మెంట్ల నుంచి ఎక్కువ లాభాలు పొందడానికి కూడా ఇదే శుభ సమయం. కెరీర్‌లో ఊహించని మార్పులు ఉంటాయి. కొత్త వ్యాపారాలను మొదలుపెట్టడానికి కూడా ఇది మంచి సమయం.
3.వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థిక లాభాలను పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్ వస్తుంది. క్రియేటివిటీ పెరుగుతుంది, అదృష్టం కూడా కలిసి వస్తుంది. భవిష్యత్తులో ఊహించని మార్పులు చూస్తారు.
4.మకర రాశి:
మకర రాశి వారికి నవంబర్ నెల బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. సమస్యలు పరిష్కారం అవుతాయి, ప్రశాంతత ఉంటుంది. రివార్డ్స్ పొందుతారు, కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ సమయం కలిసి రాబోతోంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


