...
...
Next Story

అజ ఏకాదశి ఎప్పుడు? సెప్టెంబర్ 6న, 7న? ఈ విధంగా పూజ చేస్తే విష్ణువు అనుగ్రహం లభిస్తుంది!

అజ ఏకాదశి భక్తిశ్రద్ధలతో శ్రీమహావిష్ణువును ఆరాధించే పవిత్రమైన ఏకాదశిగా భావిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తే పాపాలు తొలగి, కష్టాలు మరియు పేదరికం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలితం అజ ఏకాదశి వ్రతం ద్వారా లభిస్తుందని విశ్వాసం.

Published on: Sep 5, 2026, 16:00:45 IST
Advertisement

ఏకాదశి తిథికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి ఏటా 24 ఏకాదశులు, అంటే నెలకు రెండు ఏకాదశులు వస్తాయి. ఏకాదశి నాడు విష్ణువును ఆరాధిస్తూ ఉపవాసం ఉంటే విశేషమైన ఫలితాలను పొందవచ్చు.

అజ ఏకాదశి ఎప్పుడు? సెప్టెంబర్ 6న, 7న? ఈ విధంగా పూజ చేస్తే విష్ణువు అనుగ్రహం లభిస్తుంది! (AI)
అజ ఏకాదశి ఎప్పుడు? సెప్టెంబర్ 6న, 7న? ఈ విధంగా పూజ చేస్తే విష్ణువు అనుగ్రహం లభిస్తుంది! (AI)

శ్రావణ మాసంలో కృష్ణ పక్ష ఏకాదశిని అజ ఏకాదశి అని అంటారు. ఆ రోజు విష్ణువుకి అంకితం చేయబడింది. ఆ రోజు ఉపవాసం ఉండి విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే పాపాలు తొలగిపోతాయి. కష్టాలు, పేదరికం నుంచి కూడా బయటపడడానికి వీలవుతుంది. అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలితం అజ ఏకాదశి వ్రతం ద్వారా లభిస్తుంది. అజ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటుగా పూజా విధానం గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం.

2026లో అజ ఏకాదశి ఎప్పుడు వచ్చింది?

ఈ ఏడాది అజ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఏకాదశి ప్రారంభం, ఏకాదశి తిథి ముగింపు వివరాలు తెలుసుకుందాం.

ఏకాదశి తిథి సెప్టెంబర్ 6 సాయంత్రం 7:29కి ప్రారంభమవుతుంది. ఏకాదశి తిథి సెప్టెంబర్ 7 సాయంత్రం 5:03తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం సెప్టెంబర్ 7, సోమవారం నాడు అజ ఏకాదశి జరుపుకోవాలి. ఆ రోజు విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించి ఉపవాసం ఉంటే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు.

ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి?

ద్వాదశి తిథిలో సరైన సమయంలో ఏకాదశి ఉపవాసాన్ని విరమించాలి. సెప్టెంబర్ 8, మంగళవారం నాడు ఉపవాసాన్ని విరమించాలి. ఉదయం 06:02 నుంచి 08:33 మధ్యలో విరమించొచ్చు. ద్వాదశి తిథి మధ్యాహ్నం 02:42తో ముగుస్తుంది.

అజ ఏకాదశి పూజా విధానం

అజ ఏకాదశి రోజు ఎలా పూజ చేసుకోవాలనే విషయానికి వస్తే, ముందు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.

కుదిరితే ఆ రోజు పసుపు రంగు దుస్తులను ధరించడం మంచిది. ఆ తర్వాత విష్ణుమూర్తిని పూజించాలి. ఉపవాస దీక్షను స్వీకరించాలి.

పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని, పసుపు రంగు వస్త్రాన్ని పరిచి, విష్ణు చిత్రపటం లేదా విగ్రహాన్ని ఆ వస్త్రంపై పెట్టి, విష్ణువు ముందు నెయ్యితో దీపారాధన చేయాలి. ఆ తర్వాత విష్ణువుకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించాలి.

అజ ఏకాదశి వ్రత కథను విని లేదా చదివితే మంచి ఫలితాలను చూడొచ్చు. “ఓం నమో భగవతే వాసుదేవాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆ విష్ణు అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు.

చివరిగా దీపం లేదా కర్పూరంతో విష్ణువుకు హారతి ఇచ్చి పూజను ముగించండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe