కార్తీక మాసం శుక్లపక్ష రెండో రోజు అంటే దీపావళి పండుగ జరుపుకున్న రెండు రోజులకు అన్నాచెల్లెళ్ల పండుగను కూడా జరుపుకుంటారు. ఉత్తరాది రాష్ట్రాలలో దీనిని భాయ్ దూజ్ గా జరుపుకుంటారు. రాఖీ పండగలాగే అన్నాచెల్లెళ్ల పండుగను ఎంతో ఉత్సాహంగా, వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది.

సోదరీమణులు సోదరులను ఇంటికి పిలిచి, కడుపునిండా వివిధ రకాల ఆహార పదార్థాలతో భోజనం పెడతారు. మరి ఈసారి అన్నాచెల్లెళ్ల పండుగ ఎప్పుడు వచ్చింది, పాటించాల్సిన నియమాలు, ప్రాముఖ్యతతో పాటు పూర్తి వివరాలను తెలుసుకుందాం.
భగిని హస్త భోజనం
“భగిని ” అంటే సోదరి అని అర్థం. ఆమె పెట్టే భోజనాన్ని “భగిని హస్త భోజనం” అని అంటారు. దీపావళి పండుగను ఐదు రోజులు జరుపుకుంటారు. అందులో భగినీ హస్త భోజనం కూడా ఒకటి. సోదరుడు, సోదరి చేతి భోజనం తిన్నట్లయితే అపమృత్యు భయాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ పండుగ జరుపుకోవడం వలన కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది.
బాంధవ్యాలు బలంగా ఉంటాయి. భారతీయ కుటుంబ వ్యవస్థ దృఢంగా మారడానికి కూడా ఈ పండుగ జరుపుకోవడం ఎంతో ముఖ్యం. భోజనానికి సోదరి ఇంటికి సోదరుడు వెళ్లేటప్పుడు చీర సారెలతో వెళ్లి, ఆమె చేతి భోజనాన్ని తింటారు.
అన్నాచెల్లెళ్ల పండుగ లేదా భగినీ హస్త భోజనం తేదీ, శుభ సమయం
ఈ సంవత్సరం అన్నాచెల్లెళ్ల పండుగ అక్టోబర్ 23న వచ్చింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శుభ సమయం. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా శుభ సమయమే. ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని చాలా మంది ఇంకా అనుసరిస్తున్నారు. సోదరి ఇంటికి అన్నదమ్ములు భోజనానికి వెళ్లడం ఆనవాయితీ.
అన్నాచెల్లెళ్ల పండుగ ప్రాముఖ్యత
అన్నాచెల్లెళ్ల పండుగ లేదా భగినీ హస్త భోజనం ప్రాముఖ్యత గురించి చూస్తే.. ఈ పండుగ రోజు సోదరీమణులు సోదరులకు తిలకం పెట్టి, కొబ్బరికాయను ఇస్తారు. ఆ తర్వాత సోదరుడు సోదరికి సంతోషం, శ్రేయస్సు కోసం పూజ చేస్తాడు. ఎలాంటి సందర్భం వచ్చినా తోడుగా ఉంటామని సోదరుడు వాగ్దానం చేస్తాడు.
పాటించాల్సిన నియమాలు
{{/usCountry}}అన్నాచెల్లెళ్ల పండుగ లేదా భగినీ హస్త భోజనం ప్రాముఖ్యత గురించి చూస్తే.. ఈ పండుగ రోజు సోదరీమణులు సోదరులకు తిలకం పెట్టి, కొబ్బరికాయను ఇస్తారు. ఆ తర్వాత సోదరుడు సోదరికి సంతోషం, శ్రేయస్సు కోసం పూజ చేస్తాడు. ఎలాంటి సందర్భం వచ్చినా తోడుగా ఉంటామని సోదరుడు వాగ్దానం చేస్తాడు.
పాటించాల్సిన నియమాలు
{{/usCountry}}ఈరోజు ఉదయాన్నే సోదరీమణులు నిద్రలేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలి. కొత్త దుస్తులు ధరించాలి. తన ఇంటికి వచ్చిన సోదరుడికి తిలకం పెట్టి ప్లేట్లో కుంకుమ, చందనం, పసుపు, తమలపాకులు, అక్షింతలు, మిఠాయిలు పెట్టాలి. సోదరుడిని కూర్చోపెట్టి ఉంగరం వేలితో తిలకం పెట్టాలి. తిలకంపై అక్షింతలు దిద్ది, సోదరుడికి స్వీట్లు పెట్టాలి. ఆ తర్వాత హారతి ఇవ్వాలి.