ఈ ఏడాది అన్నాచెల్లెళ్ల పండుగ లేదా భగిని హస్త భోజనం ఎప్పుడు వచ్చింది? తేదీ, శుభ సమయం, ప్రాముఖ్యతతో పాటు నియమాలు ఇవే!

రాఖీ పండగలాగే అన్నాచెల్లెళ్ల పండుగను ఎంతో ఉత్సాహంగా, వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. సోదరీమణులు సోదరులను ఇంటికి పిలిచి, కడుపునిండా వివిధ రకాల ఆహార పదార్థాలతో భోజనం పెడతారు. మరి ఈసారి అన్నాచెల్లెళ్ల పండుగ ఎప్పుడు వచ్చింది, పాటించాల్సిన నియమాలు, ప్రాముఖ్యతతో పాటు పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Published on: Oct 21, 2025, 13:30:17 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక మాసం శుక్లపక్ష రెండో రోజు అంటే దీపావళి పండుగ జరుపుకున్న రెండు రోజులకు అన్నాచెల్లెళ్ల పండుగను కూడా జరుపుకుంటారు. ఉత్తరాది రాష్ట్రాలలో దీనిని భాయ్ దూజ్ గా జరుపుకుంటారు. రాఖీ పండగలాగే అన్నాచెల్లెళ్ల పండుగను ఎంతో ఉత్సాహంగా, వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది.

ఈ ఏడాది అన్నాచెల్లెళ్ల పండుగ లేదా భగిని హస్త భోజనం ఎప్పుడు వచ్చింది? (pinterest)
ఈ ఏడాది అన్నాచెల్లెళ్ల పండుగ లేదా భగిని హస్త భోజనం ఎప్పుడు వచ్చింది? (pinterest)

సోదరీమణులు సోదరులను ఇంటికి పిలిచి, కడుపునిండా వివిధ రకాల ఆహార పదార్థాలతో భోజనం పెడతారు. మరి ఈసారి అన్నాచెల్లెళ్ల పండుగ ఎప్పుడు వచ్చింది, పాటించాల్సిన నియమాలు, ప్రాముఖ్యతతో పాటు పూర్తి వివరాలను తెలుసుకుందాం.

భగిని హస్త భోజనం

“భగిని ” అంటే సోదరి అని అర్థం. ఆమె పెట్టే భోజనాన్ని “భగిని హస్త భోజనం” అని అంటారు. దీపావళి పండుగను ఐదు రోజులు జరుపుకుంటారు. అందులో భగినీ హస్త భోజనం కూడా ఒకటి. సోదరుడు, సోదరి చేతి భోజనం తిన్నట్లయితే అపమృత్యు భయాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ పండుగ జరుపుకోవడం వలన కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది.

బాంధవ్యాలు బలంగా ఉంటాయి. భారతీయ కుటుంబ వ్యవస్థ దృఢంగా మారడానికి కూడా ఈ పండుగ జరుపుకోవడం ఎంతో ముఖ్యం. భోజనానికి సోదరి ఇంటికి సోదరుడు వెళ్లేటప్పుడు చీర సారెలతో వెళ్లి, ఆమె చేతి భోజనాన్ని తింటారు.

అన్నాచెల్లెళ్ల పండుగ లేదా భగినీ హస్త భోజనం తేదీ, శుభ సమయం

ఈ సంవత్సరం అన్నాచెల్లెళ్ల పండుగ అక్టోబర్ 23న వచ్చింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శుభ సమయం. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా శుభ సమయమే. ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని చాలా మంది ఇంకా అనుసరిస్తున్నారు. సోదరి ఇంటికి అన్నదమ్ములు భోజనానికి వెళ్లడం ఆనవాయితీ.

అన్నాచెల్లెళ్ల పండుగ ప్రాముఖ్యత

అన్నాచెల్లెళ్ల పండుగ లేదా భగినీ హస్త భోజనం ప్రాముఖ్యత గురించి చూస్తే.. ఈ పండుగ రోజు సోదరీమణులు సోదరులకు తిలకం పెట్టి, కొబ్బరికాయను ఇస్తారు. ఆ తర్వాత సోదరుడు సోదరికి సంతోషం, శ్రేయస్సు కోసం పూజ చేస్తాడు. ఎలాంటి సందర్భం వచ్చినా తోడుగా ఉంటామని సోదరుడు వాగ్దానం చేస్తాడు.

పాటించాల్సిన నియమాలు

ఈరోజు ఉదయాన్నే సోదరీమణులు నిద్రలేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలి. కొత్త దుస్తులు ధరించాలి. తన ఇంటికి వచ్చిన సోదరుడికి తిలకం పెట్టి ప్లేట్లో కుంకుమ, చందనం, పసుపు, తమలపాకులు, అక్షింతలు, మిఠాయిలు పెట్టాలి. సోదరుడిని కూర్చోపెట్టి ఉంగరం వేలితో తిలకం పెట్టాలి. తిలకంపై అక్షింతలు దిద్ది, సోదరుడికి స్వీట్లు పెట్టాలి. ఆ తర్వాత హారతి ఇవ్వాలి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More