చాలామంది ఆంజనేయ దండకం చదువుతూ ఉంటారు. నిజానికి ఆంజనేయ దండకం చదవడం వలన అనేక లాభాలు కలుగుతాయి. “శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం” అంటూ మొదలయ్యే ఆంజనేయ దండకం భక్తులకు నిజానికి ఒక రక్షణ కవచం లాంటిదని చెప్పొచ్చు. ఈ దండకాన్ని ప్రతిరోజూ చదువుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఈ ఆంజనేయ దండకాన్ని చదివితే ఏమవుతుంది? ప్రయోజనాలు, ఆధ్యాత్మిక రహస్యాల గురించి ఇప్పుడే తెలుసుకుందాం.
ఆంజనేయ దండకం

మన హిందూ ధర్మంలో హనుమంతుడికి సంబంధించి చాలా స్తోత్రాలు ఉన్నాయి. కానీ ఎక్కువమంది ఆంజనేయ దండకాన్ని చదువుతూ ఉంటారు. దీనికి ఎక్కువ ప్రాచుర్యం ఉంది. ఆపదలో ఉన్నప్పుడు, భయం వేసినప్పుడు చాలామంది “శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం” అని ఆంజనేయ దండకాన్ని చదువుతూ ఉంటారు.
దండకం అంటే ఒక చందస్సులో సాగే స్తోత్రం. ఆంజనేయ దండకంలో హనుమాన్ వీరత్వాన్ని, శౌర్యాన్ని, భక్తిని వర్ణించడం జరిగింది. దీనిని చదవడం వలన పుణ్యమే కాదు, సమస్యల నుంచి విముక్తి కూడా కలుగుతుంది. మరి ఇక ఆంజనేయ దండకాన్ని చదివితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
ఆంజనేయ దండకాన్ని పఠిస్తే ఈ విశేషమైన ప్రయోజనాలను పొందవచ్చు:
1.గ్రహ దోషాల నివారణ:
శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్న వారు ఆంజనేయ దండకాన్ని చదువుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఏలినాటి శని, అర్ధాష్టమ శనితో సతమతమవుతున్నట్లయితే ఈ దండకాన్ని పఠించండి. శనిదేవుడు కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే కుజదోషం ఉన్నవారు కూడా ఆంజనేయ దండకాన్ని పారాయణ చేయండి. వివాహ సంబంధిత ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి.
2.భయం తొలగి ధైర్యం కలుగుతుంది:
చాలా మంది రాత్రిపూట ఎక్కువగా భయపడుతూ ఉంటారు. పీడకలలు, చీకటి అంటే భయం ఉన్నవారు ఆంజనేయ దండకాన్ని చదువుకుంటే ఆ భయాలన్నిటికీ చెక్ పెట్టవచ్చు. ఆంజనేయుని మనం “శతకంఠము”, “పంచముఖ హనుమంతా” అని కొలుస్తూ ఉంటాము. ఈ దండకాన్ని చదివితే గుండె ధైర్యం పెరుగుతుంది. శత్రుభయం తొలగిపోతుంది. మానసిక బలహీనతలను కూడా పోగొట్టుకోవడానికి వీలవుతుంది.
3.ప్రతికూల శక్తుల నుంచి బయటపడవచ్చు:
ఈ దండకాన్ని చదవడం వలన ప్రతికూల శక్తుల నుంచి కూడా బయటపడవచ్చు. దిష్టి తగిలినా ఆంజనేయ దండకాన్ని చదువుకోండి. భూత, ప్రేత, పిశాచ బాధలు ఈ దండకాన్ని చదవడం వలన దరిచేరవు.
4.అనారోగ్య సమస్యలు ఉండవు:
{{/usCountry}}ఈ దండకాన్ని చదవడం వలన ప్రతికూల శక్తుల నుంచి కూడా బయటపడవచ్చు. దిష్టి తగిలినా ఆంజనేయ దండకాన్ని చదువుకోండి. భూత, ప్రేత, పిశాచ బాధలు ఈ దండకాన్ని చదవడం వలన దరిచేరవు.
4.అనారోగ్య సమస్యలు ఉండవు:
{{/usCountry}}హనుమాన్ చాలీసా అలాగే ఆంజనేయ దండకాన్ని చదివితే కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు, మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న వారు దీనిని పఠిస్తే సానుకూల తరంగాలు మీలో ఏర్పడతాయి. అలాగే ఆంజనేయ దండకం చదవడం వలన ఏకాగ్రతను పెంచుకోవచ్చు. బుద్ధిబలం కూడా పెరుగుతుంది.
5.కష్టాలు తొలగిపోతాయి:
రామాయణంలో అసాధ్యమైన పనులను కూడా హనుమంతుడు సుసాధ్యం చేశాడు. హనుమాన్‌కు సంబంధించిన ఈ దండకాన్ని చదవడం వలన కార్యసిద్ధి కలుగుతుంది. పూర్తికాని పనులన్నింటిని కూడా చక్కగా పూర్తి చేసుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలను పొందవచ్చు. ఇలా మొత్తం మీద ఆంజనేయ దండకంతో శుభ ఫలితాలను పొందడానికి వీలవుతుంది.
ఆంజనేయ దండకాన్ని ఎలా చదువుకోవాలి?
- ఆంజనేయ దండకాన్ని రోజూ ఉదయం స్నానం చేసి, దీపం పెట్టి చదువుకోండి.
- అలా కుదరనట్లయితే మంగళవారం లేదా శనివారం అయినా చదువుకోండి.
- చదివేటప్పుడు హనుమంతుడిని మనసులో ధ్యానించండి.
- ఏకాగ్రతతో పఠిస్తే మంచి ఫలితాలను చూస్తారు.
- హనుమంతుని అనుగ్రహాన్ని పొందడానికి తమలపాకులను హనుమంతుడికి సమర్పించండి.
- అరటి పండ్లను నివేదన చేయండి.
- ఇలా సులువైన మార్గంలో హనుమంతుని పూజిస్తే హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కలిగి, బాధలన్నీ కూడా తొలగిపోతాయి.