హిందూ సనాతన ధర్మంలో దీపావళి ఐదు రోజుల వేడుకలకు ధనతేరస్‌తో ఘనంగా తెరలేస్తుంది. ఈ పర్వదినాన్ని సుఖ-సమృద్ధికి, అపారమైన వైభవానికి ప్రతీకగా భావిస్తారు. ఆయుర్వేద దేవుడైన ధన్వంతరితో పాటు సంపదకు అధిపతి అయిన కుబేరుడు, విఘ్నేశ్వర స్వామి, మహాలక్ష్మిని ఈ రోజు ప్రత్యేకంగా ఆరాధిస్తారు.

ధన త్రయోదశి నాడు పూజలు చేయడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు ఆచరిస్తే జీవితంలో ఆర్థిక కొరత అనేదే తలెత్తదు. ఇవి ఇంట్లోకి సానుకూల శక్తిని, అక్షయ సంపదను ఆహ్వానిస్తాయి. మరి ఈసార ధనతేరస్ ఎప్పుడొచ్చింది? ఎలాంటి నివారణోపాయాలు పాటించాలో వివరంగా తెలుసుకుందాం.
ధనత్రయోదశి ఎప్పుడు వచ్చింది? ముహూర్తం విశేషాలు
పంచాంగం ప్రకారం, ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణ పక్ష త్రయోదశి తిథి నాడు ధన త్రయోదశి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది నవంబర్ 6న ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే త్రయోదశి తిథి, నవంబర్ 7 ఉదయం 10:47 గంటల వరకు కొనసాగుతుంది.
ధన త్రయోదశి పూజను ప్రధానంగా సాయంత్రం ప్రదోష కాలంలో నిర్వహించడం ఆనవాయితీ. నవంబర్ 7వ తేదీ ఉదయానికే తిథి ముగిసిపోతున్నందున, ఈ ఏడాది నవంబర్ 6, 2026 (శుక్రవారం) నాడే ధన త్రయోదశి పండుగను జరుపుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు.
ఆర్థిక వృద్ధిని తెచ్చే 4 ముఖ్యమైన పరిహారాలు
1. సూర్యాస్తమయం తర్వాత 13 దీపాలు వెలిగించడం:
సాంప్రదాయాల ప్రకారం, ఆ రోజున సూర్యాస్తమయం అయ్యాక సరిగ్గా 13 దీపాలను వెలిగించి, వాటి వద్ద 13 గవ్వలను ఉంచాలి. ఇందులో మొదటి దీపాన్ని మృత్యుదేవత యమరాజ ప్రసన్నత కోసం ఇంటి దక్షిణ దిశలో ఉంచడం ప్రత్యేకత. అర్ధరాత్రి వేళ ఈ గవ్వలను ఇంట్లోని ఏదైనా శుభ్రమైన మూలన భద్రపరిస్తే ధన సంబంధిత సమస్యలు ఇట్టే తొలగిపోతాయి.
2. వీటిని ఇలా ఉంచండి:
పూజా సమయంలో ఎంతో పవిత్రమైన ఈ మూటను సిద్ధం చేసుకోవాలి. ఒక ఎర్రటి వస్త్రంలో ఏడు గవ్వలు, మూడు గోమతి చక్రాలు, పసుపు కొమ్ము, అక్షతలు, ఒక రూపాయి కాసు కట్టి పూజించాలి. పూజ ముగిసిన తర్వాత దీనిని మీ లాకర్ లేదా డబ్బు దాచుకునే స్థలంలో ఉంచితే ఏడాది పొడవునా సిరుల కొరత ఉండదు.
3. కుబేర యంత్ర ప్రతిష్టాపన:
{{/usCountry}}పూజా సమయంలో ఎంతో పవిత్రమైన ఈ మూటను సిద్ధం చేసుకోవాలి. ఒక ఎర్రటి వస్త్రంలో ఏడు గవ్వలు, మూడు గోమతి చక్రాలు, పసుపు కొమ్ము, అక్షతలు, ఒక రూపాయి కాసు కట్టి పూజించాలి. పూజ ముగిసిన తర్వాత దీనిని మీ లాకర్ లేదా డబ్బు దాచుకునే స్థలంలో ఉంచితే ఏడాది పొడవునా సిరుల కొరత ఉండదు.
3. కుబేర యంత్ర ప్రతిష్టాపన:
{{/usCountry}}కుబేరుడి అనుగ్రహం కోసం ధనతేరస్ రోజున ఉత్తర దిశలో కుబేర యంత్రాన్ని ప్రతిష్టించడం చాలా మంచిది. ప్రతిష్టించే సమయంలో 'ఓం యక్షాయ కుబేరాయ నమః' అనే మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించడం ద్వారా సిరులు వర్షిస్తాయని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
4. కర్పూరం, లవంగాల పరిహారం:
లాకర్లు, పూజా గదిని శుభ్రం చేసిన తర్వాత కర్పూరంలో కొద్దిగా లవంగాలు వేసి వెలిగించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి పూర్తిగా నశించిపోతుంది. ఇది ఇంట్లో సుఖసంతోమలతో పాటు అద్భుతమైన సానుకూల వాతావరణాన్ని, సిరుల ప్రవాహాన్ని తీసుకొస్తుంది.