ఈరోజు గురు ప్రదోష వ్రతం.. ఈ సమయంలో శివారాధన చేస్తే విశేష పుణ్యఫలం!

హిందూ సంప్రదాయంలో ప్రదోష వ్రతానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ప్రతి నెల శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో రెండుసార్లు ప్రదోష వ్రతం వస్తుంది. గురువారంతో కలిసి వచ్చే ప్రదోషాన్ని గురు ప్రదోష వ్రతంగా పిలుస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 8న గురు ప్రదోష వ్రతం రానుంది. 

Published on: Oct 8, 2026, 08:00:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రదోష వ్రతాలలో గురువారంతో కూడిన ప్రదోషానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర దినాన పరమశివుడిని ఎలా పూజించాలి, దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటో ఇక్కడ పూర్తి వివరంగా తెలుసుకోండి.

ఈరోజు గురు ప్రదోష వ్రతం.. ఈ సమయంలో శివారాధన చేస్తే విశేష పుణ్యఫలం! (AI)
ఈరోజు గురు ప్రదోష వ్రతం.. ఈ సమయంలో శివారాధన చేస్తే విశేష పుణ్యఫలం! (AI)

హిందూ సంప్రదాయంలో ప్రదోష వ్రతానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ప్రతి నెలలోనూ శుక్ల పక్షం, కృష్ణ పక్షం చొప్పున రెండు సార్లు ప్రదోష వ్రతాలు వస్తాయి. సాధారణంగా గురువారంతో కూడిన ప్రదోష రోజున శివుడు గంగా నదిలో నివసిస్తాడని నమ్ముతారు. ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తుల జీవితంలోని సమస్త కష్టాలు తొలగిపోయి, శత్రు నాశనం జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీన గురు ప్రదోష వ్రతం రానుంది.

గురు ప్రదోష వ్రత ప్రాముఖ్యత

త్రయోదశి తిథి రోజున ఈ వ్రతాన్ని ఆచరించే వారి జీవితంలో ఎలాంటి అశాంతి, కలహాలు ఉండవని శివచాలీసాలో కూడా పేర్కొనబడింది. శివ మహాపురాణం ప్రకారం, ఒకవేళ ఎవరైనా పూర్తి స్థాయిలో వ్రతం చేయలేని పక్షంలో, కేవలం ప్రదోష కాలంలో శివుడికి నీళ్లు, 5 బిల్వ పత్రాలు (మారేడు దళాలు) సమర్పిస్తే చాలు.. సంపూర్ణ ప్రదోష వ్రత ఫలం లభిస్తుంది.

అక్టోబర్ 8వ తేదీన రాత్రి 10:15 నిమిషాల వరకు త్రయోదశి తిథి వ్యాపించి ఉంది. రోజంతా ఈ తిథి యొక్క ప్రభావం ఉండటం వల్ల అక్టోబర్‌ 8నే ఈ వ్రతాన్ని ఆచరించడం ఉత్తమం.

ప్రదోష కాల పూజా విధానం

"సాయంకాలం తర్వాత, రాత్రి ప్రారంభం కావడానికి ముందటి సమయాన్నే 'ప్రదోష కాలం' అంటారు. ఈ సమయంలోనే భోళా శంకరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి."

ఉపవాసం, స్నానం: ప్రదోష వ్రతం ఆచరించే వారు త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి.

మండప ఏర్పాటు: పూజా స్థలాన్ని శుద్ధ జలంతో కడిగి అక్కడ ఒక మండపాన్ని ఏర్పాటు చేయాలి. ఐదు రకాల పువ్వులతో పద్మ ఆకారాన్ని తీర్చిదిద్ది, దానిపై కుశ ఆసనం వేసి తూర్పు ముఖంగా కూర్చోవాలి.

పూజా సామగ్రి: మహేశ్వరుడిని మనసారాధ్యం చేసుకుంటూ.. బిల్వ పత్రాలు, అక్షతలు, దీపం, దూపం, గంగాజలంతో మహాశివుడిని పూజించాలి. ఈ వ్రతం ఆచరించే వారు రోజంతా ఉప్పు లేని ఆహారాన్ని తీసుకోవడం లేదా ఉపవాసం ఉండటం మంచిది.

ప్రదోష వ్రతం ఎందుకు ఆచరించాలి?

త్రియోదశి తిథి నాడు ప్రదోష కాలంలో కైలాస పర్వతంపై ఉన్న తన రజత భవనంలో శివయ్య నృత్యం చేస్తాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఆ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

ఈ వ్రత మహత్యాన్ని తొలుత శివుడు స్వయంగా మాతా సతీదేవికి వివరించగా.. ఆ తర్వాత మహర్షి వేదవ్యాసుడు సూతుడికి, ఆయన ద్వారా ఋషులందరికీ తెలిసింది. కలియుగంలో ధర్మం క్షీణించి పాపాలు పెరిగే కొద్దీ వాటి నుంచి రక్షించే దివ్యౌషధమే ఈ ప్రదోష వ్రతం అని స్కంద పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వ్రతం ఆచరించిన వారికి నూరు గోవులను దానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More