గురు ప్రదోష వ్రతం 2026: శివుడి అనుగ్రహంతో పాటు గురు గ్రహం కటాక్షం కోసం ఈ 5 పరిహారాలు పాటించండి!
అక్టోబర్ 8, 2026న గురు ప్రదోష వ్రతం జరుపుకోనున్నారు. త్రయోదశి తిథి గురువారం రావడంతో దీనిని గురు ప్రదోషం అని పిలుస్తారు. శివుడిని ఆరాధించడంతో పాటు గురు గ్రహానికి సంబంధించిన పరిహారాలను పాటించడం ద్వారా శుభఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య విశ్వాసం.
ప్రదోష వ్రతం నాడు పరమేశ్వరుడిని భక్తితో ఆరాధించడం వలన ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. గురు ప్రదోష వ్రతం పరమశివుడికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. త్రయోదశి గురువారం రావడం చాలా విశేషం. త్రయోదశి గురువారం వచ్చిన రోజునే గురు ప్రదోషం అని అంటారు. ఈ ఏడాది అక్టోబర్ 8న గురు ప్రదోష వ్రతం వచ్చింది.

జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం గురువారం దేవతల గురువైన బృహస్పతికి సంబంధించిన రోజు. కనుక గురు ప్రదోషం రోజున శివుని పూజించడంతో పాటు గురు గ్రహానికి సంబంధించిన పరిహారాలను పాటించడం వలన కూడా అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. మరి గురు ప్రదోష వ్రతం రోజు ఎలాంటి పరిహారాలను పాటించాలి? గురు గ్రహం అనుగ్రహం కలగాలంటే గురువారం ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గురు గ్రహం అనుగ్రహం
గురువు అనుగ్రహం ఉంటే మంచిది. గురు అనుగ్రహం ఉంటే చాలా మంచిది. గురు గ్రహాన్ని గురుత్వం, ధర్మం, సంతానం, జ్ఞానం, అదృష్టానికి కారకుడిగా చెప్తారు. జాతకంలో గురు గ్రహం బలంగా ఉండాలంటే ఈ పరిహారాలు పాటించడం మంచిది.
1.పసుపు రంగు వస్తువులను దానం చేయండి
గురు ప్రదోష వ్రతం నాడు గురు గ్రహానికి సంబంధించిన ఈ పరిహారాన్ని పాటిస్తే మంచి ఫలితాలను చూడొచ్చు. గురు ప్రదోషం నాడు శనగపప్పు, పసుపు, పసుపు రంగు వస్త్రాలు లేదా పసుపు రంగులో ఉండే పండ్లను దానం చేస్తే మంచి ఫలితాన్ని చూడొచ్చు.
2.పరమశివుడికి అభిషేకం చేయండి
గురు ప్రదోష వ్రతం నాడు శివుడికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు. అలాగే బిల్వపత్రాలను సమర్పించండి. “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని కూడా జపిస్తే మంచిది.
3.విష్ణువుని ఆరాధించండి
గురు ప్రదోష వ్రతం రోజు విష్ణువుని కూడా ఆరాధించడం మంచిది. ఉదయాన్నే విష్ణుమూర్తిని పూజించి, దీపం వెలిగించి, పసుపు రంగు పుష్పాలను సమర్పిస్తే అద్భుతమైన మార్పులను చూడొచ్చు.
4.గురు మంత్రం
“ఓం బ్రీం బృహస్పతయే నమః” అనే మంత్రాన్ని చదవండి. ఈ మంత్రాన్ని జపించడం వలన గురు అనుగ్రహం కలుగుతుంది. ప్రశాంతమైన, పరిశుభ్రమైన ప్రదేశంలో మంత్ర జపం చేస్తే చక్కటి ఫలితాన్ని చూడొచ్చు.
5.గురువులు, పెద్దల ఆశీర్వాదం
గురుత్వ తత్వానికి ప్రతీక గురు గ్రహం కనుక, ప్రదోష వ్రతం రోజు తల్లిదండ్రులు, గురువులు, పెద్దల యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి. అవసరమైన విద్యార్థులకు పుస్తకాలను అందించండి. చదువుకు ఉపయోగపడే సామాగ్రిని కూడా అవసరమైన వారికి ఇవ్వడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు.
చాలా మందికి గురువారానికి, గురు ప్రదోషానికి ఉన్న సంబంధం తెలియదు. ప్రదోష వ్రతం శివుడి ఆరాధనకు పవిత్రమైన రోజు. త్రయోదశి తిథి ఏ వారంలో వస్తుందనే దాని ఆధారంగా ప్రదోషానికి పేర్లు వస్తాయి. గురువారం వస్తే గురు ప్రదోష వ్రతం అని అంటారు. ఆ రోజు శివుడిని పూజించేటప్పుడు ఎంతో పాటుగా గురు గ్రహానికి సంబంధించిన ఈ పరిహారాలను పాటిస్తే చక్కటి మార్పులను చూడొచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


