ధన త్రయోదశి 2026: నవంబర్ 6న బంగారం కొంటున్నారా? పూజా ముహూర్తాలు, శుభ సమయాలు ఇవే!
దీపావళి ఐదు రోజుల వేడుకలకు ధన త్రయోదశితో శ్రీకారం చుడతారు. ఈ ఏడాది నవంబర్ 6, 2026న ధన త్రయోదశి జరుపుకోనున్నారు. ఈ రోజున బంగారం, వెండి, కొత్త పాత్రలు కొనుగోలు చేయడం శుభప్రదమని హిందూ సంప్రదాయంలో నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సిరిసంపదలు పెరిగి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు.
తెలుగు లోగిళ్లలో దీపావళి సంబరాలకు ధన త్రయోదశితో అధికారికంగా తెరలేస్తుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాస కృష్ణ పక్ష త్రయోదశి రోజున ఈ పర్వదినాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. దీపావళికి ముందు వచ్చే ఈ ఐదు రోజుల పండుగలో ధన త్రయోదశికి ప్రత్యేక స్థానం ఉంది.

ఈ పవిత్ర దినాన బంగారం, వెండి లేదా కొత్త పాత్రలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంప్రదాయం వెనుక ఉన్న మతపరమైన విశ్వాసాల ప్రకారం, ఈ రోజు విలువైన లోహాలను కొంటే సిరి సంపదలు పదమూడు రెట్లు వృద్ధి చెందుతాయని నమ్ముతారు.
సత్యయుగం నుంచి వస్తున్న ఈ ఆచారం ప్రకారం, బంగారం అత్యంత పవిత్రమైన లోహంగా భావిస్తారు. దీనిని గడప దాటించి ఇంట్లోకి తీసుకురావడం వల్ల సకల ప్రతికూల శక్తులు తొలగిపోయి, సానుకూల వాతావరణం నెలకొంటుంది. అలాగే సంపదలకు అధిదేవత అయిన మహాలక్ష్మి, కుబేరుడితో పాటు ఆయుర్వేద జనకుడు ధన్వంతరి భగవానుడిని ఈ రోజు ప్రత్యేకంగా పూజిస్తారు. సముద్ర మధనం సమయంలో ధన్వంతరి అమృత కలశంతో ఉద్భవించిన రోజు కావడంతో దీనిని 'ధన్వంతరి జయంతి' అని కూడా పిలుస్తారు.
ధన త్రయోదశి పూజా ముహుర్తం మరియు సమయాలు
ఈ ఏడాది ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి తిథి నవంబర్ 6వ తేదీ ఉదయం 10:30 నిమిషాలకు ప్రారంభమై, మరుసటి రోజు నవంబర్ 7 ఉదయం 10:47 నిమిషాల వరకు కొనసాగుతుంది. ధనతేరస్ పూజకు సాయంత్రం వేళ వచ్చే ప్రదోష కాలమే అత్యంత శ్రేయస్కరమని పండితులు స్పష్టం చేస్తున్నారు.
సాయంత్రపు ప్రధాన పూజా ముహుర్తం: నవంబర్ 6వ తేదీ సాయంత్రం 6:02 నిమిషాల నుంచి రాత్రి 7:57 నిమిషాల వరకు ఉంటుంది.
పగటిపూట పూజా సమయం: ఉదయం 8:16 నిమిషాల నుంచి ఉదయం 9:48 నిమిషాల మధ్య జరుపుకోవచ్చు.
బంగారం, వెండి కొనుగోళ్లకు శుభ ముహుర్తాలు
నవంబర్ 6, 2026 నాడు ఉదయం 10:30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6:37 గంటల వరకు ఎప్పుడైనా కొనుగోళ్లు జరపవచ్చు. అయితే మరింత విశేషమైన ఫలితాలు ఇచ్చే ప్రత్యేక ముహుర్తాలు ఇలా ఉన్నాయి:
అభిజిత్ ముహుర్తం: మధ్యాహ్నం 11:48 నిమిషాల నుంచి 12:56 నిమిషాల వరకు.
ప్రదోష కాల కొనుగోలు సమయం: సాయంత్రం 5:49 నిమిషాల నుంచి రాత్రి 8:23 నిమిషాల వరకు.
వృషభ లగ్న కాలం: సాయంత్రం 6:19 నిమిషాల నుంచి రాత్రి 8:17 నిమిషాల వరకు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.
ధన త్రయోదశి రోజు ఏం కొనుగోలు చేయాలి?
ధన త్రయోదశి పర్వదినాన కేవలం బంగారం, వెండి ఆభరణాలే కాకుండా ఇత్తడి పాత్రలు, చీపురు, ఉప్పు, లక్ష్మీ-గణేశుల ప్రతిమలు, స్థలాలు లేదా నూతన గృహాలను కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదమని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజు కొనే ఏ వస్తువైనా ఇంట్లో అదృష్టాన్ని మోసుకొస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


