దీపావళి పండుగ అంటే అందరికీ ఇష్టమే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ సంతోషంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ప్రతీ ఏటా అశ్వయుజ మాసం బహుళ అమావాస్య నాడు దీపావళి అమావాస్యను జరుపుకుంటాము. ఎంతో వైభవంగా, ఘనంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి నాడు లక్ష్మీదేవిని, గణపతిని కూడా ఆరాధిస్తారు.
దీపావళి 2025

{{^htLoading}} {{/htLoading}}
అలాగే దీపావళి నాడు పిండి వంటలు, టపాసులు ఇలా సంతోషంగా దీపావళిని అందరితో కలిసి జరుపుకుంటారు. లక్ష్మీదేవి ఐశ్వర్యం, సిరి, సంపదలకు ప్రతీక. ఇక ఈ దీపావళి నాడు మీ స్నేహితులకు, బంధువులకు విషెస్ చెప్పాలంటే ఈ విషెస్ ని షేర్ చేసేసుకోండి.
దీపావళి 2025 విషెస్ & కోట్స్
లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలని, జీవితంలో వెలుగు పూలు వికసించాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!
దీపావళి నాడు దీపాలు మీ వెంట వెలుగుల్ని నింపాలని, అష్టైశ్వర్యాలని తీసుకు రావాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!
చీకటిని తొలగించి పండుగ మీకు కొత్త వెలుగుల్ని తీసుకు రావాలని, మీ కలలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ దీపావళి!
సిరి సంపదలకు తల్లి లక్ష్మీదేవి కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు!
ఆ లక్ష్మీదేవి కృపాకటాక్షాలు మీ ఇంటిపై కురవాలని, జీవితంలో సుఖశాంతులు ఉండాలని ఆశిస్తూ దీపావళి శుభాకాంక్షలు!
కారు చీకట్లను దీపాల కాంతులు తరిమేసినట్లు, మీ కష్టాలను ఈ దీపావళి పండుగ తరిమేయాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ దీపావళి!
{{^htLoading}} {{/htLoading}}
దీపకాంతిలా మీ చుట్టూ సంతోషము ఉండాలి, కష్టాలన్నీ కరిగిపోవాలి, జీవితంలో ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ దీపావళి!
చీకటిపై వెలుగు విజయమే దీపావళి పండుగ. దుష్టశక్తుల్ని పారద్రోలి కొత్త జీవితానికి స్వాగతం పలికే వెలుగుల రోజు దీపావళి.. హ్యాపీ దీపావళి!
లక్ష్మీకాంతులతో సిరి మీ ఇంటికి చేరి, వెలుగు సంపదలు మీ ఇంట కురవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ దీపావళి..
{{^htLoading}} {{/htLoading}}
దీపావళి పండుగ మీ ఇంటికి సంతోషం, సంపాదన తీసుకురావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ దీపావళి..
ఈ దీపావళి పండుగ మీ జీవితానికి ప్రేమ, సంతోషం, ఆనందం, శ్రేయస్సు కలిగించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ దీపావళి..
ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉండాలని, కోరికలన్నీ నెరవేరాలని, ఈ దీపావళికే వెయ్యి సంతోషాలను మీరు పొందాలని కోరుకుంటున్నాను. హ్యాపీ దీపావళి!
దీపావళి నాడు మీ ఇంటి గుమ్మం దగ్గర దీపాన్ని వెలిగించండి. జీవితంలో సంతోషం, శ్రేయస్సును ఆహ్వానించండి.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}