ఆర్థిక సమస్యల నుండి బయట పడడానికి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ రత్నాన్ని ధరించండి.. ఇక మీ ఇంట కాసుల పంటే!
ప్రతి రత్నం వెనుక ఒక గ్రహం ఉంటుంది. ఆ గ్రహ ప్రభావంతో దుష్ప్రభావాలనుంచి బయటపడవచ్చు, సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ రత్నం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మరి ఇక ఏ రత్నాన్ని ధరించాలి? లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలామంది రత్నాలను ధరిస్తారు. జ్యోతిష్యం ప్రకారం తగిన రత్నాన్ని ధరించడం వలన జీవితంలో చాలా మార్పులను చూడవచ్చు. ప్రతి రత్నం వెనుక ఒక గ్రహం ఉంటుంది. ఆ గ్రహ ప్రభావంతో దుష్ప్రభావాలనుంచి బయటపడవచ్చు, సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ రత్నం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం.

లక్ష్మీదేవి రత్నం
ఈ రత్నాన్ని ధరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ రత్నాన్ని ధరిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు. ఈ క్రిస్టల్ చాలా రకాల సమస్యల నుంచి సులువుగా బయటపడేస్తుంది. మరి ఇక ఏ రత్నాన్ని ధరించాలి? లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా సమస్యలను తొలగించే శక్తివంతమైన రత్నం
ఈ క్రిస్టల్‌ను “క్వార్ట్జ్” లేదా “స్పటిక” అని అంటారు. దీనిని ధరించడం వలన అప్పులు తీరిపోతాయి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అయితే ఈ రత్నాన్ని ధరించేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. వాటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీదేవికి ఈ రత్నం అంటే ఎంతో ఇష్టం.
కొన్ని రత్నాలకు ఎంతో ప్రత్యేకత ఉందని రత్న శాస్త్రం చెబుతోంది. అయితే క్రిస్టల్ లేదా క్వార్ట్జ్‌ను ధరించడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి. లక్ష్మీ అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అయితే ఎప్పుడైనా దీనిని ధరించే ముందు జ్యోతిష్యుని సలహా తీసుకుని, ఆ తర్వాత మాత్రమే ధరించాలి.
ఏ రాశుల వారు ధరించవచ్చు?
ఈ రత్నాన్ని కర్కాటక రాశి, మిథున రాశి, వృషభ రాశి, తులా రాశి వారు ధరిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు. జాతకంలో శుక్ర దోషాలు ఉంటే, ఈ రత్నాన్ని ధరిస్తే ఆ దోషాల నుంచి సులువుగా బయటపడవచ్చు.
స్పటికాన్ని ఎలా ధరించాలి?
- స్పటికాన్ని ధరించేటప్పుడు ముందుగా శుభ్రంగా గంగాజలంతో శుద్ధి చేసి, ఆ తర్వాత లక్ష్మీదేవి ముందు సమర్పించాలి.
- “శ్రీ సూక్తం” చదివి ఈ రత్నాన్ని ధరించవచ్చు. లేకపోతే “ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః” అనే మంత్రాన్ని 11 సార్లు చదివి ఈ రత్నాన్ని ధరించండి.
- మెడలో వేసుకోవచ్చు లేదా ఉంగరంగా చేతికి వేసుకోవచ్చు.
- ఈ రత్నాన్ని శుక్రవారం లేదా బుధవారం ధరిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.
స్పటికాన్ని ధరిస్తే ఈ లాభాలు కలుగుతాయి:
ఈ రత్నాన్ని ధరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అప్పుల్లో కూరుకుపోయిన వారు ఈ రత్నాన్ని ధరిస్తే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.
జాతకంలో శుక్రుడు స్థానాన్ని బలపరచడానికి కూడా ఈ రత్నం సహాయపడుతుంది. ఈ రత్నాన్ని ధరిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. సానుకూల శక్తి ప్రవహిస్తుంది. సంతోషంగా, సమతుల్యమైన జీవితాన్ని గడపవచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


