Diwali 2025 Wishes: దీపావళి 2025 విషెస్ & కోట్స్.. ఇలా మీ బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పేయండి!
ప్రతీ ఏటా అశ్వయుజ మాసం బహుళ అమావాస్య నాడు దీపావళి అమావాస్యను జరుపుకుంటాము. ఎంతో వైభవంగా, ఘనంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి నాడు లక్ష్మీదేవిని, గణపతిని కూడా ఆరాధిస్తారు. ఇక ఈ దీపావళి నాడు మీ స్నేహితులకు, బంధువులకు విషెస్ చెప్పాలంటే ఈ విషెస్ ని షేర్ చేసేసుకోండి.
దీపావళి పండుగ అంటే అందరికీ ఇష్టమే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ సంతోషంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ప్రతీ ఏటా అశ్వయుజ మాసం బహుళ అమావాస్య నాడు దీపావళి అమావాస్యను జరుపుకుంటాము. ఎంతో వైభవంగా, ఘనంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి నాడు లక్ష్మీదేవిని, గణపతిని కూడా ఆరాధిస్తారు.

దీపావళి 2025
అలాగే దీపావళి నాడు పిండి వంటలు, టపాసులు ఇలా సంతోషంగా దీపావళిని అందరితో కలిసి జరుపుకుంటారు. లక్ష్మీదేవి ఐశ్వర్యం, సిరి, సంపదలకు ప్రతీక. ఇక ఈ దీపావళి నాడు మీ స్నేహితులకు, బంధువులకు విషెస్ చెప్పాలంటే ఈ విషెస్ ని షేర్ చేసేసుకోండి.
దీపావళి 2025 విషెస్ & కోట్స్
లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలని, జీవితంలో వెలుగు పూలు వికసించాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!
దీపావళి నాడు దీపాలు మీ వెంట వెలుగుల్ని నింపాలని, అష్టైశ్వర్యాలని తీసుకు రావాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!
చీకటిని తొలగించి పండుగ మీకు కొత్త వెలుగుల్ని తీసుకు రావాలని, మీ కలలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ దీపావళి!
సిరి సంపదలకు తల్లి లక్ష్మీదేవి కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు!
ఆ లక్ష్మీదేవి కృపాకటాక్షాలు మీ ఇంటిపై కురవాలని, జీవితంలో సుఖశాంతులు ఉండాలని ఆశిస్తూ దీపావళి శుభాకాంక్షలు!
కారు చీకట్లను దీపాల కాంతులు తరిమేసినట్లు, మీ కష్టాలను ఈ దీపావళి పండుగ తరిమేయాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ దీపావళి!

దీపకాంతిలా మీ చుట్టూ సంతోషము ఉండాలి, కష్టాలన్నీ కరిగిపోవాలి, జీవితంలో ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ దీపావళి!
చీకటిపై వెలుగు విజయమే దీపావళి పండుగ. దుష్టశక్తుల్ని పారద్రోలి కొత్త జీవితానికి స్వాగతం పలికే వెలుగుల రోజు దీపావళి.. హ్యాపీ దీపావళి!
లక్ష్మీకాంతులతో సిరి మీ ఇంటికి చేరి, వెలుగు సంపదలు మీ ఇంట కురవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ దీపావళి..
దీపావళి పండుగ మీ ఇంటికి సంతోషం, సంపాదన తీసుకురావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ దీపావళి..
ఈ దీపావళి పండుగ మీ జీవితానికి ప్రేమ, సంతోషం, ఆనందం, శ్రేయస్సు కలిగించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ దీపావళి..
ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉండాలని, కోరికలన్నీ నెరవేరాలని, ఈ దీపావళికే వెయ్యి సంతోషాలను మీరు పొందాలని కోరుకుంటున్నాను. హ్యాపీ దీపావళి!
దీపావళి నాడు మీ ఇంటి గుమ్మం దగ్గర దీపాన్ని వెలిగించండి. జీవితంలో సంతోషం, శ్రేయస్సును ఆహ్వానించండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


