Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఈ 7 వస్తువులను పొరపాటున కూడా పెట్టకండి!

వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఇంట్లో ఇబ్బందులు, గొడవలు కూడా ఉండవు. సానుకూల వాతావరణంతో సంతోషంగా ఉండొచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా బలపడతాయి. అయితే, వాస్తు ప్రకారం బాత్రూంలో కొన్నిటిని పెట్టడం మంచిది కాదు.

Published on: Oct 24, 2025, 13:30:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఇంట్లో ఇబ్బందులు, గొడవలు కూడా ఉండవు. సానుకూల వాతావరణంతో సంతోషంగా ఉండొచ్చు.

వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో వీటిని పొరపాటున కూడా పెట్టకండి
వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో వీటిని పొరపాటున కూడా పెట్టకండి

కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా బలపడతాయి. అయితే, వాస్తు ప్రకారం బాత్రూంలో కొన్నిటిని పెట్టడం మంచిది కాదు. మరి వాస్తు ప్రకారం బాత్రూంలో ఎటువంటి వాటిని పెట్టకూడదు, ఎలాంటి తప్పులు చేయకూడదు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో వీటిని పొరపాటున కూడా పెట్టకండి

1.పగిలిపోయిన అద్దాలు:

వాస్తు ప్రకారం బాత్రూంలో పగిలిపోయిన అద్దాలు వంటివి పెట్టడం మంచిది కాదు. చాలామంది గాజు తలుపులు వంటివి పగిలిపోయినప్పుడు బాత్రూంలో వదిలేస్తూ ఉంటారు. అలా చేయడం వలన ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. సానుకూల శక్తికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి పొరపాటు జరగకుండా చూసుకోండి.

2.ఖాళీ బకెట్:

వాస్తు శాస్త్రం ప్రకారం ఖాళీ బకెట్‌ను కూడా బాత్రూంలో ఉంచడం మంచిది కాదు. అలా ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడు బకెట్‌ను ఖాళీగా ఉంచకండి. కొంచెం నీళ్లు వదిలేసినా సరిపోతుంది. లేదంటే ప్రతికూల శక్తితో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

3.బాత్రూంలో మొక్కలు పెట్టకండి:

ఈ మధ్యకాలంలో చాలామంది ఇండోర్ ప్లాంట్స్‌ను పెంచుతున్నారు. కానీ బాత్రూంలో మొక్కలు పెట్టడం మంచిది కాదు. బాత్రూంలో మొక్కలు ఉంటే ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎండిపోయిన మొక్కలు వంటివి కూడా బాత్రూంలో పెట్టడం మంచిది కాదు. కనుక ఈ తప్పును చేయకుండా చూసుకోండి.

4.తడి బట్టలు, పొడి బట్టలు:

బాత్రూంలో తడి బట్టలు, పొడి బట్టలు పెట్టడం కూడా మంచిది కాదు. బాత్రూం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. తడి బట్టల నుంచి దుర్వాసన వస్తుంది. అలాగే బాత్రూంలో ఉన్న బట్టలను అప్పటికప్పుడు తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. లేదంటే ప్రతికూల శక్తితో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

5.టాయిలెట్ సీట్ ఈ దిశలో ఉండకూడదు:

చాలామంది టాయిలెట్ సీట్లను తూర్పు లేదా ఈశాన్యం వైపు ఉండేలా చూస్తారు. అదే తప్పు. ఆ దిశల్లో ఉండకూడదు. టాయిలెట్ సీట్లను వాయవ్య లేదా దక్షిణ దిశలో ఉంచాలి.

6.చెక్క ఫర్నిచర్ పెట్టకండి:

బాత్రూంలో చెక్క ఫర్నిచర్ పెట్టడం మంచిది కాదు. చెక్క షేల్ఫ్స్, టేబుల్స్ వంటి వాటిని పెడితే ప్రతికూల శక్తితో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సానుకూల శక్తి దూరం అవుతుంది.

7.చిరిగిపోయిన ఫోటోలు:

బాత్రూం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. కొంతమంది పెయింటింగ్స్, ఫోటోలు వంటివి పెడుతూ ఉంటారు. అవి పాడైపోయినవి అయితే వెంటనే తొలగించండి. చిరిగిపోయినవి ఉంటే ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More