ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేచిన తర్వాత కొన్ని పనులను మొదలు పెడుతూ ఉంటారు. అయితే, ఉదయం లేచిన వెంటనే ఈ ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే మనసులో ఉత్సాహం పెరుగుతుంది. సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది. అలాగే, ఉదయం పూట కొన్ని పనులను చేయడం వలన ఎన్నో విధాలుగా లాభాలను పొందవచ్చు.

ఉదయం పూట మన దినచర్య ఏ విధంగా మొదలవుతుందనే దానిపైనే మన రోజంతా కూడా ఆధారపడి ఉంటుంది. మనం ఉదయం లేచిన తర్వాత చేసే పనులతో మన మానసిక స్థితి, శక్తి ఆధారపడి ఉంటాయి. ఉదయం చిరునవ్వుతో, ప్రశాంతంగా రోజును మొదలుపెట్టినట్లయితే రోజంతా కూడా పూర్తి ఏకాగ్రతతో పనులను జాగ్రత్తగా పూర్తి చేసుకోవచ్చు. అదే ఉదయాన్నే కాస్త చిరాకుగా, కోపంతో రోజును మొదలుపెడితే ఒత్తిడి, ఆందోళనతో రోజంతా సతమతం అవ్వాల్సి ఉంటుంది.
మన సంప్రదాయాలు, జ్యోతిష్య శాస్త్రంలో ఉదయం పూట ఆచరించాల్సిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. వీటిని మీరు ఫాలో అవుతున్నారా? మరి, ఉదయం లేవగానే వీటిని కనుక ఫాలో అయినట్లయితే అద్భుతమైన లాభాలను పొందవచ్చు. ఆ మార్గాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం లేచిన తర్వాత వెంటనే చేయాల్సిన ఐదు ముఖ్యమైన పనులు.. వీటితో సానుకూల శక్తి రెట్టింపు
1. ఇష్టదైవాన్ని స్మరించుకోండి
ఉదయం నిద్రలేవగానే ఇష్టదైవాన్ని స్మరించుకోండి. ఇది చాలా ముఖ్యమైన పని. ఇది మనసులో భక్తిభావాన్ని నింపుతుంది. ఈ రోజంతా ప్రతికూలత చేరకుండా మీకు రక్షణను అందిస్తుంది. మనసులోని కోరికలను, కృతజ్ఞతా భావాన్ని దేవుడికి అర్పిస్తూ ప్రార్థన చేస్తే రోజంతా హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉండొచ్చు.
2. తల్లి భూదేవికి నమస్కారం చేయండి
ఉదయం లేచాక భూదేవికి నమస్కారం చేసుకోండి. మంచం దిగిన తర్వాత భూమిని తాకి నమస్కరించి క్షమాపణ కోరుకోండి. దీంతో తల్లి అనుగ్రహం లభిస్తుంది. భూదేవి పట్ల కృతజ్ఞతలు చాటుతుంది కూడా.
3. అరచేతి దర్శనం
{{/usCountry}}ఉదయం లేచాక భూదేవికి నమస్కారం చేసుకోండి. మంచం దిగిన తర్వాత భూమిని తాకి నమస్కరించి క్షమాపణ కోరుకోండి. దీంతో తల్లి అనుగ్రహం లభిస్తుంది. భూదేవి పట్ల కృతజ్ఞతలు చాటుతుంది కూడా.
3. అరచేతి దర్శనం
{{/usCountry}}ఉదయం లేవగానే అరచేతిని చూసుకోవాలి. పిల్లలకు కూడా ఈ అలవాటును నేర్పండి. రెండు అరచేతులను ఉదయం లేవగానే చూసుకోవడం శతాబ్దాలుగా వస్తున్న ఆచారం అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
అరచేతుల అగ్రభాగంలో సంపదలకు అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి ఉంటుంది. మధ్యలో సరస్వతి, మూలభాగంలో విష్ణువు కొలువై ఉంటారు. అందుకనే ఉదయం లేవగానే అరచేతులను చూసుకోవాలి. ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కూడా కలుగుతాయి.
4. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి
ఉదయం లేచిన తర్వాత స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. అలా చేయడం వలన సూర్యుని అనుగ్రహం కలుగుతుంది. రాగి చెంబులో నీళ్లు పోసి, ఎర్రటి పుష్పాలు కూడా వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే నూతన ఉత్సాహం కలుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలు కూడా లభిస్తాయి. అలాగే, “ఓం సూర్యాయ నమః” మంత్రాన్ని కూడా జపించండి.
5. ధ్యానం, ప్రశాంతత
ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే కాసేపు ధ్యానం చేయండి. దీని వలన ప్రశాంతత రెట్టింపు అవుతుంది. వ్యాయామం చేయడం వలన మనసు, శరీరం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. ఏ విధమైన ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా కాసేపు సమయాన్ని గడుపుతూ ధ్యానం వైపు దృష్టి పెడితే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఆనందంగా ఉండొచ్చు.
ఉదయం లేవగానే ఈ పనులను మీరు ముందుగా చక్కగా పూర్తి చేసినట్లయితే అద్భుతమైన లాభాలను పొందవచ్చు. రోజంతా కూడా హాయిగా, సంతోషంగా ఉండొచ్చు.