ఉదయం లేవగానే ఈ 5 పనులు చేయండి.. రోజంతా సానుకూల శక్తి, మనశ్శాంతి మీ సొంతం!
ఉదయం నిద్రలేచిన వెంటనే చేసే పనులు మన మానసిక స్థితి, ఉత్సాహంపై ప్రభావం చూపుతాయి. సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఉదయం పాటించాల్సిన ఐదు ముఖ్యమైన పద్ధతులను ఈ కథనం వివరిస్తుంది.
ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేచిన తర్వాత కొన్ని పనులను మొదలు పెడుతూ ఉంటారు. అయితే, ఉదయం లేచిన వెంటనే ఈ ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే మనసులో ఉత్సాహం పెరుగుతుంది. సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది. అలాగే, ఉదయం పూట కొన్ని పనులను చేయడం వలన ఎన్నో విధాలుగా లాభాలను పొందవచ్చు.

ఉదయం పూట మన దినచర్య ఏ విధంగా మొదలవుతుందనే దానిపైనే మన రోజంతా కూడా ఆధారపడి ఉంటుంది. మనం ఉదయం లేచిన తర్వాత చేసే పనులతో మన మానసిక స్థితి, శక్తి ఆధారపడి ఉంటాయి. ఉదయం చిరునవ్వుతో, ప్రశాంతంగా రోజును మొదలుపెట్టినట్లయితే రోజంతా కూడా పూర్తి ఏకాగ్రతతో పనులను జాగ్రత్తగా పూర్తి చేసుకోవచ్చు. అదే ఉదయాన్నే కాస్త చిరాకుగా, కోపంతో రోజును మొదలుపెడితే ఒత్తిడి, ఆందోళనతో రోజంతా సతమతం అవ్వాల్సి ఉంటుంది.
మన సంప్రదాయాలు, జ్యోతిష్య శాస్త్రంలో ఉదయం పూట ఆచరించాల్సిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. వీటిని మీరు ఫాలో అవుతున్నారా? మరి, ఉదయం లేవగానే వీటిని కనుక ఫాలో అయినట్లయితే అద్భుతమైన లాభాలను పొందవచ్చు. ఆ మార్గాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం లేచిన తర్వాత వెంటనే చేయాల్సిన ఐదు ముఖ్యమైన పనులు.. వీటితో సానుకూల శక్తి రెట్టింపు
1. ఇష్టదైవాన్ని స్మరించుకోండి
ఉదయం నిద్రలేవగానే ఇష్టదైవాన్ని స్మరించుకోండి. ఇది చాలా ముఖ్యమైన పని. ఇది మనసులో భక్తిభావాన్ని నింపుతుంది. ఈ రోజంతా ప్రతికూలత చేరకుండా మీకు రక్షణను అందిస్తుంది. మనసులోని కోరికలను, కృతజ్ఞతా భావాన్ని దేవుడికి అర్పిస్తూ ప్రార్థన చేస్తే రోజంతా హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉండొచ్చు.
2. తల్లి భూదేవికి నమస్కారం చేయండి
ఉదయం లేచాక భూదేవికి నమస్కారం చేసుకోండి. మంచం దిగిన తర్వాత భూమిని తాకి నమస్కరించి క్షమాపణ కోరుకోండి. దీంతో తల్లి అనుగ్రహం లభిస్తుంది. భూదేవి పట్ల కృతజ్ఞతలు చాటుతుంది కూడా.
3. అరచేతి దర్శనం
ఉదయం లేవగానే అరచేతిని చూసుకోవాలి. పిల్లలకు కూడా ఈ అలవాటును నేర్పండి. రెండు అరచేతులను ఉదయం లేవగానే చూసుకోవడం శతాబ్దాలుగా వస్తున్న ఆచారం అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
అరచేతుల అగ్రభాగంలో సంపదలకు అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి ఉంటుంది. మధ్యలో సరస్వతి, మూలభాగంలో విష్ణువు కొలువై ఉంటారు. అందుకనే ఉదయం లేవగానే అరచేతులను చూసుకోవాలి. ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కూడా కలుగుతాయి.
4. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి
ఉదయం లేచిన తర్వాత స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. అలా చేయడం వలన సూర్యుని అనుగ్రహం కలుగుతుంది. రాగి చెంబులో నీళ్లు పోసి, ఎర్రటి పుష్పాలు కూడా వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే నూతన ఉత్సాహం కలుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలు కూడా లభిస్తాయి. అలాగే, “ఓం సూర్యాయ నమః” మంత్రాన్ని కూడా జపించండి.
5. ధ్యానం, ప్రశాంతత
ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే కాసేపు ధ్యానం చేయండి. దీని వలన ప్రశాంతత రెట్టింపు అవుతుంది. వ్యాయామం చేయడం వలన మనసు, శరీరం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. ఏ విధమైన ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా కాసేపు సమయాన్ని గడుపుతూ ధ్యానం వైపు దృష్టి పెడితే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఆనందంగా ఉండొచ్చు.
ఉదయం లేవగానే ఈ పనులను మీరు ముందుగా చక్కగా పూర్తి చేసినట్లయితే అద్భుతమైన లాభాలను పొందవచ్చు. రోజంతా కూడా హాయిగా, సంతోషంగా ఉండొచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


