దేశంలోనే మొట్టమొదటి.. పురాతన శాస్త్రాల ఆధారిత ‘దోష నివారణ’ యాప్!
5000 ఏళ్ల పురాతన బృహత్ పరాశర హోర శాస్త్రం ఆధారంగా “దోష నివారణ” యాప్ ను హైదరాబాద్‌కు చెందిన ఆజా ఆస్ట్రోటెక్ సంస్థ రూపొందించింది. పరాశర మహర్షి రచించిన ప్రాచీన వేద జ్యోతిష్య సూత్రాలను విశ్లేషించి, వాటిని ఆధునిక సాఫ్ట్‌వేర్ ఇంజిన్‌గా సంస్థ రూపొందించింది.
హైదరాబాద్: AI యుగంలోనూ సమస్త మానవాళికి ఉపయోగపడేలా ఓ అద్బుతమైన యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటిదాకా వచ్చిన అనేక అప్లికేషన్లు కేవలం టెక్నాలజీ మీద ఆధారపడగా.. తొలిసారిగా AI తో పాటు, పురాతన శాస్త్రాల ఆధారంగా పనిచేసే సరికొత్త యాప్ విడుదలైంది. దేశంలోనే మొట్టమొదటి సారిగా.. ఒక్క అప్లికేషన్ తో, మనిషిని వేధిస్తున్న అనేక అవరోధాలను గుర్తించడమే కాదు, తక్షణ పరిష్కారాలు అందించడం ఆ యాప్ ప్రత్యేకత. ఈ యాప్ ను రూపొందించింది ఎవరో కాదు.. మన హైదరాబాదీలే.

హైదరాబాద్‌కు చెందిన ఆజా ఆస్ట్రోటెక్ కంపెనీ 5000 ఏళ్ల పురాతన బృహత్ పరాశర హోర శాస్త్రం ఆధారంగా “దోష నివారణ” యాప్‌ను ప్రారంభించింది. సమస్యలు మరియు దోషాలను గుర్తించి, బృహత్ పరాశర హోర శాస్త్రం సూత్రాల ప్రకారం సమర్థవంతమైన పరిష్కార మార్గాలను అందించే వేద ఆధారిత అప్లికేషన్ ఇది.
హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ బడిగా శ్రీకాంత్, రిటైర్డ్ జిల్లా జడ్జి హేమంత్ కుమార్ దింత్యాల, అలాగే టీ-హబ్ మాజీ సీఈఓ శ్రీనివాస్ రావు మహంకాళి కలిసి ఈ యాప్‌ను ఆవిష్కరించారు. ఇది పూర్తిగా బృహత్ పరాశర హోర శాస్త్రం ప్రాథమిక సూత్రాలపై రూపొందించిన ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్ అని కంపెనీ సీఈఓ ఫణిరాజ్ జలిగామా తెలిపారు .

“ప్రస్తుత అప్లికేషన్లు ఎక్కువగా AI పద్దతుల ఆధారంగా రూపొందుతున్నాయి. కానీ మా సాఫ్ట్‌వేర్ వ్యవస్థ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కేవలం సాంకేతికతతో అంచనా వేసే AIకి బదులుగా, పరాశర మహర్షి రచించిన ప్రాచీన వేద జ్యోతిష్య సూత్రాలను విశ్లేషించి, వాటిని ఆధునిక సాఫ్ట్‌వేర్ ఇంజిన్‌గా రూపొందించాం” అని చెప్పారు.
యోగాలు, దోషాలు, సరైన పరిహారాలు
ఈ అప్లికేషన్ వినియోగదారుడి జనన సమయానికి సంబంధించిన గ్రహస్థితులను విశ్లేషించి “కాస్మిక్ బ్లూప్రింట్”ను రూపొందిస్తుంది. యోగాలు, దోషాలు, సరైన పరిహారాలు, వ్యక్తిగత రిపోర్టులు మరియు ముహూర్త సేవలను అందించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ వ్యవస్థ వివాహాలు, గృహప్రవేశాలు, కొత్త ఉద్యోగంలో చేరడం వంటి ముఖ్య సందర్భాలతో పాటు సి-సెక్షన్ ప్రసవాలు లేదా ప్రణాళికాబద్ధ శస్త్రచికిత్సల కోసం కూడా శుభ ముహూర్తాలను సూచించగలదు.
భారతీయ ప్రవాసులకు సులభంగా అందుబాటులో ఉండేలా ఈ యాప్‌ను ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రారంభించినట్లు ఫణిరాజ్ తెలిపారు. జూన్ నెలలో మరో 11 భారతీయ భాషల్లో కూడా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ అప్లికేషన్ మీ స్మార్ట్ ఫోన్ లో ఉంటే, ప్రతి ఇంట్లో ఒక నిపుణుడైన జ్యోతిష్యుడు ఉన్నట్టే అని యాప్ రూపకర్తలు తెలిపారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


