పుట్టిన తిథిని బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? ఏ తిథికి ఏ ప్రత్యేకత ఉందో చూడండి!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలే కాదు, మనం పుట్టిన తిథి కూడా మన స్వభావాన్ని, భవిష్యత్తును నిర్ణయిస్తుంది. హిందూ క్యాలెండర్‌లోని 15 తిథులలో మీరు ఏ రోజు జన్మించారో, ఆ రోజు మీ వ్యక్తిత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Apr 13, 2026 2:01 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, ఒక వ్యక్తి స్వభావం, భవిష్యత్తు గ్రహాల కదలిక ఆధారంగా ఉంటుంది. అంతేకాకుండా, పుట్టిన తేదీ ప్రకారం కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. హిందూ క్యాలెండర్ ప్రకారం నెలలో 30 రోజులు ఉంటాయి. తిథుల ప్రకారం చూసినట్లయితే మొత్తం 15 తిథులు ఉంటాయి. ఏ తిథి ఆధారంగా కూడా అనేక విషయాలను చెప్పవచ్చు. మరి మీరు పుట్టిన తిథి ప్రకారం మీరు ఎలాంటి వారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పూర్తి వివరాలు ఇదిగో.

పుట్టిన తిథిని బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? (pinterest)
పుట్టిన తిథిని బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? (pinterest)

మీ పుట్టిన తిథి ప్రకారం మీరు ఎలాంటి వారో తెలుసుకోండి:

పాడ్యమి:

పాడ్యమి నాడు పుట్టిన వారు ఎక్కువగా సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అయితే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. ఎక్కువ ప్రతికూల ఆలోచనలు ఉంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

విదియ:

విదియ నాడు పుట్టిన వారు చాలా ధైర్యవంతులు. ఎంతో శక్తి కలిగి ఉంటారు. శుభ్రత విషయంలో కాస్త అశ్రద్ధగా ఉంటారు.

తదియ:

తదియ నాడు పుట్టిన వారు మానసికంగా ప్రశాంతంగా ఉండలేరు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, విశ్రాంతి తీసుకోరు. కాస్త కోపంతో ఉండడం వల్ల గొడవలు జరుగుతాయి. దీని ప్రభావం ఆర్థిక పరిస్థితిపై కూడా పడుతుంది.

చవితి:

చవితి నాడు పుట్టిన వారు అందరితో ఇట్టే కలిసిపోతారు. ప్రేమతో ఉంటారు. మంచి సంతానంతో జీవిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. వీరు చాలా పాపులర్ అవుతారు.

పంచమి:

పంచమి నాడు పుట్టిన వారు తల్లిదండ్రులకు చాలా విలువ ఇస్తారు. ఓర్పు, సేవా గుణం ఎక్కువగా ఉంటుంది. జీవితాన్ని సంతోషంగా గడుపుతారు.

షష్ఠి:

షష్ఠి నాడు పుట్టిన వారు ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. వివిధ దేశాలు తిరుగుతారు. ఆహార ప్రియులు కూడా.

సప్తమి:

సప్తమి నాడు పుట్టిన వారు చాలా బ్రైట్‌గా ఉంటారు. అదృష్టవంతులు. సమాజంలో గౌరవం, మర్యాదలు సంపాదిస్తారు.

అష్టమి:

అష్టమి నాడు పుట్టిన వారు అందరితో ప్రేమగా ఉంటారు. ఏ పని అయినా పర్ఫెక్ట్‌గా పూర్తి చేయడానికి ఇష్టపడతారు. నిజాయితీగా ఉంటారు.

నవమి:

నవమి నాడు పుట్టిన వారు విజ్ఞానవంతులు. దైవభక్తి ఎక్కువ. కుటుంబానికి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. అందర్నీ బాగా చూసుకుంటారు.

దశమి:

దశమి నాడు పుట్టిన వారు ప్రభుత్వ సంబంధిత లాభాలను పొందుతారు. స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు. ఉన్నదాంట్లో సంతోషంగా జీవించడం తెలుసు.

ఏకాదశి:

ఏకాదశి నాడు పుట్టిన వారు భక్తి పరులు. జీవితం సంతోషంగా, సమతుల్యంగా ఉంటుంది. వీరి వ్యక్తిత్వం అందర్నీ ఆకట్టుకుంటుంది.

ద్వాదశి:

ద్వాదశి నాడు పుట్టిన వారు తెలివైన వారు. ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. దేశ విదేశాలు చూడాలనుకుంటారు.

త్రయోదశి:

త్రయోదశి నాడు పుట్టిన వారు కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు.

చతుర్దశి:

చతుర్దశి నాడు పుట్టిన వారు నిజాయితీగా మాట్లాడుతారు. ధైర్యంగా ఉంటారు. సమాజంలో గౌరవం పొందుతారు. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు.

పౌర్ణమి:

పౌర్ణమి నాడు పుట్టిన వారు తెలివైన వారు. సంతోషంగా జీవిస్తారు. మంచి ఆహారాన్ని ఇష్టపడతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

అమావాస్య:

అమావాస్య నాడు పుట్టిన వారు ధైర్యవంతులు. పనులను రహస్యంగా పూర్తి చేస్తారు. అప్పుడప్పుడు కాస్త చిరాకు చూపిస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More