Vasantha Panchami: వసంత పంచమి ఎప్పుడు వచ్చింది? తేదీ, శుభ సమయంతో పాటు సరస్వతీ అనుగ్రహాన్ని ఎలా పొందాలో తెలుసుకోండి
మాఘ మాసంలో వసంత పంచమిని జరుపుతారు. ఆ రోజు సరస్వతి దేవి ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. అక్షరాభ్యాసం కూడా చాలా మంది చేయించుకుంటూ ఉంటారు. 2026లో వసంత పంచమి ఎప్పుడు వచ్చింది? వసంత పంచమి తేదీ, శుభ సమయంతో పాటుగా ఆ రోజు ఏం చేయాలో ఇప్పుడే తెలుసుకుందాం.
వసంత పంచమి 2026: వసంత పంచమి నాడు సరస్వతి దేవిని ఆరాధిస్తే సరస్వతి దేవి అనుగ్రహం కలుగుతుందని, ఆమె అనుగ్రహంతో విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారని నమ్ముతారు. మాఘ మాసంలో వసంత పంచమిని జరుపుతారు. ఆ రోజు సరస్వతి దేవి ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. అక్షరాభ్యాసం కూడా చాలా మంది చేయించుకుంటూ ఉంటారు. 2026లో వసంత పంచమి ఎప్పుడు వచ్చింది? వసంత పంచమి తేదీ, శుభ సమయంతో పాటుగా ఆ రోజు ఏం చేయాలో ఇప్పుడే తెలుసుకుందాం.

వసంత పంచమి 2026:
ప్రతి ఏటా మాఘ మాసంలో వచ్చే శుక్ల పక్ష పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం వసంత పంచమి ఎప్పుడు వచ్చిందంటే.. పంచమి తిథి జనవరి 23 ఉదయం 2:28కి మొదలై, 24 ఉదయం 1:46తో ముగుస్తుంది. ఉదయ తిధి ప్రకారం చూసుకోవాలి. కనుక వసంత పంచమి జనవరి 23న జరుపుకోవాలి.
వసంత పంచమి పూజా ముహూర్తం:
2026లో వచ్చే వసంత పంచమి నాడు పూజించడానికి కొంచెం సమయం మాత్రమే ఉంటుంది. అయితే వసంత పంచమి నాడు ఉదయం 7:15 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఐదు గంటల వ్యవధి ఉంది కాబట్టి ఆ సమయంలో సరస్వతి దేవిని ఆరాధించవచ్చు.
ముఖ్యంగా విద్యార్థులు సరస్వతి పూజను చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. సరస్వతి దేవి మ్యూజిక్, ఆర్ట్స్, విద్య వంటి వాటికి దేవత. సరస్వతి దేవిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి. అలాగే విద్యలో కూడా ముందు ఉండొచ్చు, జ్ఞానం కలుగుతుంది.
వసంత పంచమి నాడు పసుపు రంగు ధరిస్తే మంచిది
వసంత పంచమినాడు పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుంది. పసుపు రంగు దుస్తులు ధరించి సరస్వతి దేవిని ఆరాధించడం వలన ఆమె అనుగ్రహాన్ని పొందవచ్చు.
అలాగే పసుపు రంగులో ఉండే స్వీట్లు, పసుపు రంగులో ఉండే పువ్వులను కూడా వసంత పంచమి నాడు సరస్వతి దేవికి సమర్పించండి. వసంత పంచమి నుంచి హోలీ పనులను కూడా మొదలు పెడతారు. హోలీ పండుగ వసంత పంచమి తర్వాత 40 రోజులకు వస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


