Gita Jayanthi 2025: ఈ ఏడాది గీతా జయంతి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయం, పూజా విధానంతో పాటు పరిహారాలు తెలుసుకోండి!
భగవద్గీత పుట్టిన రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా గీతా జయంతిని జరుపుకుంటారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి కృష్ణుడు గీతను ఉపదేశించడం జరిగింది. పంచాంగం ప్రకారం చూసినట్లయితే ప్రతి ఏడాది మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు గీతా జయంతిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం గీతా జయంతి ఎప్పుడు?
గీతా జయంతి 2025: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో గీతా జయంతి కూడా ఒకటి. భగవద్గీత పుట్టిన రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా గీతా జయంతిని జరుపుకుంటారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి కృష్ణుడు గీతను ఉపదేశించడం జరిగింది. పంచాంగం ప్రకారం చూసినట్లయితే ప్రతి ఏడాది మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు గీతా జయంతిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం గీతా జయంతి ఎప్పుడు? గీతా జయంతి తేదీ, శుభ సమయం మరియు మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

గీతా జయంతి తేదీ, సమయం
మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి తిథి నవంబర్ 30 రాత్రి 9:29కు ప్రారంభమవుతుంది. డిసెంబర్ 1 సాయంత్రం 7 గంటలకు ముగుస్తుంది. ఈ ప్రకారం డిసెంబర్ 1న గీతా జయంతిని జరుపుకోవాలి. గీతా జయంతి రాముడు సీతా వివాహ ధర్మం, గౌరవం, శాశ్వత ప్రేమకు ప్రత్యేకంగా జరుపుకుంటారు. శ్రీమద్ భగవద్గీత జననానికి గీతా జయంతి ప్రతీక. కృష్ణుడిని పూజిస్తారు.
గీతా జయంతి చాలా పవిత్రమైన రోజు. ఆ రోజున శ్రీకృష్ణుని ప్రత్యేకించి ఆరాధిస్తారు. భగవద్గీత పారాయణం చేస్తే ఎంతో మంచి జరుగుతుందని చాలామంది నమ్మకం. అలాగే గీతా జయంతి నాడు చేసే దానధర్మాలకు కూడా విశేష ఫలితాలు లభిస్తాయి. ఓం కృష్ణాయ నమః, ఓం శ్రీ కృష్ణ శరణం మమ అనే మంత్రాలను జపిస్తే మంచిది.
గీతా జయంతి నాడు అద్భుత యోగాలు
ఈసారి గీతా జయంతి నాడు శివవాస యోగంతో పాటు అభిజిత్ ముహూర్తం కూడా ఉంది. ఈ యోగాల సమయంలో కృష్ణుడిని ఆరాధిస్తే, కృష్ణుడి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. కోరికలు కూడా నెరవేరుతాయి.
గీతా జయంతి నాడు ఈ ప్రత్యేక పరిహారాలను పాటించండి
- కృష్ణుడి ఫోటో లేదా విగ్రహం ముందు దీపారాధన చేసి ధూప, దీప, నైవేద్యాలను సమర్పించండి.
- గీతా జయంతి ఉపవాసం ఉంటే కూడా మంచిది. కృష్ణుడి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
- సాత్విక ఆహారాన్ని తీసుకోండి. సాత్విక ఆహారం తినడం వలన మనసు, శరీరం రెండు ఆరోగ్యంగా ఉంటాయి.
- పేదలకు వస్త్రాలు, డబ్బు, ఆహారం వంటివి దానం చేస్తే పుణ్యఫలితం లభిస్తుంది.
- తులసి పూజ చేస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు.
- శివ–పార్వతులను గీతా జయంతి నాడు ఆరాధించడం వలన సకల సంతోషాలు కలుగుతాయి.
- ఈ రోజు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపిస్తే కృష్ణుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


