ఏకాదశి వ్రతంతో పాటు ఈ మంత్రాలు పఠించండి.. విష్ణు అనుగ్రహం కోసం ప్రత్యేక శ్లోకాలు

ప్రతి నెలలో రెండు ఏకాదశులు, సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడం, ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం, దానధర్మాలు చేయడం శుభప్రదమని హిందూ సంప్రదాయంలో విశ్వాసం. 

Published on: Sep 21, 2026, 16:00:22 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి నెలలో రెండు ఏకాదశలు వస్తాయి. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ఏకాదశిలో విష్ణువును ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే, కొన్ని దానాలు చేయడం వలన కూడా అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు.

ఏకాదశి వ్రతంతో పాటు ఈ మంత్రాలు పఠించండి.. విష్ణు అనుగ్రహం కోసం ప్రత్యేక శ్లోకాలు (AI)
ఏకాదశి వ్రతంతో పాటు ఈ మంత్రాలు పఠించండి.. విష్ణు అనుగ్రహం కోసం ప్రత్యేక శ్లోకాలు (AI)

అంతేకాదు, ఏకాదశి రోజు ఉపవాసం ఉండి, ఏకాదశి వ్రతాన్ని భక్తితో నిర్వహించినట్లయితే అద్భుతమైన మార్పులను చూడొచ్చు. అలాగే, ఏకాదశి నాడు కొన్ని శ్లోకాలు, మంత్రాలను పఠిస్తే కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఏకాదశి రోజు చదువుకోవాల్సిన శ్లోకాలు, మంత్రాల గురించి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.

1. శ్రీమహావిష్ణు ధ్యాన శ్లోకం

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్

లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం

వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్..

2. ద్వాదశాక్షరి మంత్రం

ఓం నమో భగవతే వాసుదేవాయ

ఈ మంత్రాన్ని ఏకాదశి రోజున 108 సార్లు జపించడం వలన అద్భుతమైన మార్పులను చూడవచ్చు.

3. విష్ణు గాయత్రీ మంత్రం

ఓం నారాయణాయ విద్మహే

వాసుదేవాయ ధీమహి

తన్నో విష్ణుః ప్రచోదయాత్

4. విష్ణు నామ స్మరణ

ఓం నమో నారాయణాయ

సులభంగా జపించాలనుకునేవారు ఈ సులువైన, శక్తివంతమైన మంత్రాన్ని నిరంతరం స్మరిస్తే మంచిది. ఏకాదశి నాడు కూడా పఠించండి.

5. కృష్ణ మంత్రం

హరే రామ హరే రామ

రామ రామ హరే హరే

హరే కృష్ణ హరే కృష్ణ

కృష్ణ కృష్ణ హరే హరే

6. ఏకాదశి రోజున చెప్పే సంకల్ప ప్రార్థన

ఏకాదశీ వ్రతం పుణ్యం

విష్ణోః ప్రీత్యర్థమేవ చ

మమ సర్వాపరాధానాం

క్షమాం యాచే జనార్దన

7.శ్రీ విష్ణు శరణాగతి శ్లోకం

త్వమేవ మాతా చ పితా త్వమేవ

త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ

త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ

త్వమేవ సర్వం మమ దేవ దేవ

8. శ్రీహరి స్తుతి

కృష్ణాయ వాసుదేవాయ

హరయే పరమాత్మనే

ప్రణతక్లేశనాశాయ

గోవిందాయ నమో నమః

9. విష్ణు స్మరణ శ్లోకం

వసుదేవసుతం దేవం

కంసచాణూరమర్దనమ్

దేవకీ పరమానందం

కృష్ణం వందే జగద్గురుమ్

10. శ్రీకృష్ణ స్తోత్రం

హరిర్దాతా హరిర్భోక్తా

హరిరన్నం ప్రజాపతిః

హరిః సర్వం జగదిదం

హరిరేవ న సంశయః

11. శ్రీ విష్ణు ప్రార్థన

అనాథనాథం కరుణైకనాథం

నాథం నమామి ప్రణతార్తినాశమ్

శ్రీనాథమాద్యం జగతాం శరణ్యం

నారాయణం నిత్యమహం భజామి

12.గరుడధ్వజ స్తుతి

శంఖచక్రగదాపాణిం

ద్వారకానిలయాచ్యుతమ్

గోవిందం పుండరీకాక్షం

వందే విష్ణుం జనార్దనమ్

13. శ్రీహరి మంగళ శ్లోకం

మంగళం భగవాన్ విష్ణుః

మంగళం గరుడధ్వజః

మంగళం పుండరీకాక్షః

మంగళాయతనో హరిః

14. విష్ణు స్మరణ శ్లోకం

యస్య స్మరణమాత్రేణ

జన్మసంసారబంధనాత్

విముచ్యతే నమస్తస్మై

విష్ణవే ప్రభవిష్ణవే…

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More