2026 జనవరి నుంచి ఈ రాశుల వారి ఇంట కాసుల వర్షం.. శని మహా సంచారంతో కొత్త సంవత్సరం మొదలు!

శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. జనవరి 2026లో శని ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీంతో ద్వాదశ రాశులు వారి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించిన శని ఏ రాశుల వారికి శుభఫలితాలు తీసుకొస్తాడు? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? 

Published on: Nov 04, 2025 10:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో మంచి యోగాలు, చెడ్డ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలను, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలని అందిస్తాడు. న్యాయదేవుడు శని 2026 ప్రారంభంలోనే ఒక ముఖ్యమైన సంచారం చేయబోతున్నాడు.

2026 జనవరి నుంచి ఈ రాశుల వారి ఇంట కాసుల వర్షం (pinterest)
2026 జనవరి నుంచి ఈ రాశుల వారి ఇంట కాసుల వర్షం (pinterest)

శని నక్షత్ర సంచారం

జనవరి 2026లో శని ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీంతో ద్వాదశ రాశులు వారి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. జనవరి 2026లో ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని ప్రవేశించబోతున్నాడు. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి సొంత నక్షత్రంలోకి శని ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఎదురవబోతున్నాయి. అయితే శని మళ్లీ మే 17న రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించిన శని ఏ రాశుల వారికి శుభఫలితాలు తీసుకొస్తాడు? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి శని నక్షత్ర సంచారం అనేక విధాలుగా కలిసి వస్తుంది. జనవరి 2026లో ఈ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఎప్పటి నుంచో అనుకున్న కోరికలు నెరవేరుతాయి. పనిలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు వేసిన ప్రణాళికలన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం కూడా పెరుగుతుంది.

వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. కెరీర్‌లో మంచి సమయం ప్రారంభమవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు. కొత్త ఉద్యోగంలో సక్సెస్ అందుకుంటారు. మీ బాస్‌ నుంచి ప్రశంసలు పొందుతారు. పరీక్షలు, ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది శుభ సమయం.

2.మీన రాశి

మీన రాశి వారికి శని నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. 2026 జనవరిలో ఈ రాశి వారు శుభఫలితాలను పొందుతారు. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ప్రేమజీవితం ఆనందంగా ఉంటుంది, ప్రేమ పెళ్లికి దారి తీస్తుంది.

కొత్త వ్యాపారాలను మొదలుపెట్టడానికి ఇది మంచి సమయం. వ్యాపారులు ఎక్కువ లాభాలను పొందుతారు. విదేశీ ప్రయాణాలు చేయడానికి కూడా ఈ రాశి వారికి ఇది శుభ సమయము.

3.మిథున రాశి

మిథున రాశి వారికి శని నక్షత్ర సంచారం అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలను చేపడతారు. ఆదాయం పెరుగుతుంది.

ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మొత్తానికి, శని నక్షత్ర సంచారం ఈ రాశి వారికి ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More