మార్చి 31 నుంచి ఈ రాశులకు బాగా కలిసి వస్తుంది.. సూర్య అనుగ్రహంతో డబ్బు, ఉద్యోగాలు!
మరి కొన్ని రోజుల్లో, అనగా మార్చి 31న, సూర్యుడు ప్రవేశిస్తాడు. సూర్యుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. రేవతి నక్షత్రంలోకి సూర్యుడు మార్చి 31, మంగళవారం రాత్రి 8:16కి అడుగు పెడతాడు. ఏప్రిల్ 14 వరకు ఈ నక్షత్రంలోనే సంచారం చేస్తాడు.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అందరి పై ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్యుడు గ్రహాలకు రారాజు. సూర్య సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. కాలనుగుణంగా సూర్యుడు తన నక్షత్రాలను, రాశులను మారుస్తూ ఉంటాడు.

మరి కొన్ని రోజుల్లో, అనగా మార్చి 31న, సూర్యుడు ప్రవేశిస్తాడు. సూర్యుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. రేవతి నక్షత్రంలోకి సూర్యుడు మార్చి 31, మంగళవారం రాత్రి 8:16కి అడుగు పెడతాడు. ఏప్రిల్ 14 వరకు ఈ నక్షత్రంలోనే సంచారం చేస్తాడు. సూర్య నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకురాబోతోంది. ఈ రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందబోతున్నారు. మరి అదృష్ట రాశులు ఎవరు తెలుసుకుందాం.
సూర్య నక్షత్ర సంచారంతో ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు
1.మేష రాశి
మేష రాశి వారికి సూర్య నక్షత్ర సంచారం అనేక విధాలుగా లాభాలను తీసుకు రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న టాస్కులను పూర్తిచేస్తారు.
అదృష్టం కూడా ఎక్కువ అవుతుంది. దూర ప్రయాణాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికపరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పెద్ద పెట్టుబడులు మంచి లాభాలను తీసుకొస్తాయి. రిలేషన్‌షిప్ కూడా బాగుంటుంది.
2.ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఇది శుభ సమయం. సూర్య నక్షత్ర సంచారం ఈ రాశి వారికి వివిధ లాభాలను అందిస్తుంది. అదృష్టం పెరుగుతుంది. కెరీర్‌లో అద్భుతమైన మార్పులను చూస్తారు. ఆర్థికపరంగా కలిసి వస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి.
3.మకర రాశి
మకర రాశి వారికి రేవతి నక్షత్రంలో సూర్యుడు అద్భుతమైన లాభాలను అందిస్తాడు. ఈ సమయంలో ఈ రాశి వారు కష్టానికి తగ్గ ఫలితాలను చూస్తారు. పురోగతి ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. ఉద్యోగస్తులకు ఇది శుభ సమయం. భవిష్యత్తు ప్రణాళికలపై పని చేస్తారు. ఆర్థికపరంగా కూడా బాగా కలిసి వస్తుంది.
4.సింహ రాశి
సింహ రాశి వారికి రేవతి నక్షత్రంలో సూర్యుడు అద్భుతమైన లాభాలను అందిస్తాడు. ఈ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది.
మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన ప్రాజెక్టులు మీ చేతికి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. తెలివితేటలతో బాగా రాణిస్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


