పుట్టిన ప్రతి జీవికి మరణం తథ్యం. అయితే, మరణం తర్వాత ఈ సృష్టిలో మనిషి ఆత్మకు ఏం జరుగుతుంది? అనే ప్రశ్న మానవజాతి పుట్టినప్పటి నుంచి వేధిస్తూనే ఉంది. హిందూ సనాతన ధర్మంలో మరణం అనేది అంతం కాదు, కేవలం ఆత్మ చేసే మరో కొత్త ప్రయాణానికి తొలి అడుగు మాత్రమే. ఈ అంశంపై మన ప్రాచీన గ్రంథమైన గరుడ పురాణంలో అత్యంత స్పష్టంగా, వివరంగా ప్రస్తావించారు. మృత్యువు, ఆత్మ ప్రయాణం, కర్మ సిద్ధాంతం, యమలోక మార్గం వంటి అనేక రహస్యాలు ఇందులో దాగి ఉన్నాయి.

హిందూ సంప్రదాయాల ప్రకారం కుటుంబంలో ఎవరైనా మరణిస్తే, వారి ఆత్మశాంతి కోసం అనేక రకాల ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంత్యక్రియల నుంచి మొదలుకొని తర్పణాలు, పిండ ప్రధానం వరకు ప్రతీ ఆచారానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక నేపథ్యం ఉంటుంది. శరీరం నశించినప్పటికీ, ఆత్మ తన పాత బంధాలు, కుటుంబంపై ఉన్న మొహంతో కొంతకాలం ఇళ్ల చుట్టూ తిరుగుతుందనే నమ్మకం బలంగా ఉంది.
13 రోజుల ఆచారాల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి?
ఎవరైనా వ్యక్తి చనిపోయిన తర్వాత పదమూడు రోజుల పాటు ప్రత్యేక కర్మకాండలు జరిపించడం మన దేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. ఈ కాలంలో రోజువారీ పూజలు, దానధర్మాలు చేయడం వల్ల ఆత్మకు తృప్తి కలుగుతుందని నమ్ముతారు. చాలా మందిలో ఆత్మ 13 రోజుల పాటు కచ్చితంగా సొంత ఇంటిలోనే తిరుగుతుందనే నమ్మకం ఉంటుంది. అయితే, ఇది పూర్తిగా వ్యక్తి చేసిన కర్మల మీద, ఆత్మ స్థితి మీద ఆధారపడి ఉంటుందని ధార్మిక నిపుణులు వివరిస్తున్నారు. కుటుంబ సభ్యులు ప్రేమతో చేసే ఈ కార్యక్రమాలు మృతుడి ఆత్మకు ముందుకు సాగే శక్తిని ఇస్తాయని విశ్వసిస్తారు.
కర్మలే ఆత్మ గమ్యాన్ని నిర్ణయిస్తాయి
గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ ప్రయాణం పూర్తిగా మనిషి భూమిపై చేసిన మంచి చెడుల (కర్మల) మీదే ఆధారపడి ఉంటుంది. ఎవరైతే జీవితాకాలం ధర్మబద్ధంగా జీవిస్తారో, వారి ఆత్మ ప్రయాణం ప్రశాంతంగా ఉంటుందని, పాపాలు చేసిన వారు కష్టాలు ఎదుర్కొంటారని ఈ గ్రంథం హెచ్చరిస్తుంది. ఈ కథనాల ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని, ఇతరులకు సాయం చేయాలని గరుడ పురాణం సందేశం ఇస్తుంది.
శాస్త్రీయ దృక్పథం.. ధార్మిక విశ్వాసాలు
{{/usCountry}}గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ ప్రయాణం పూర్తిగా మనిషి భూమిపై చేసిన మంచి చెడుల (కర్మల) మీదే ఆధారపడి ఉంటుంది. ఎవరైతే జీవితాకాలం ధర్మబద్ధంగా జీవిస్తారో, వారి ఆత్మ ప్రయాణం ప్రశాంతంగా ఉంటుందని, పాపాలు చేసిన వారు కష్టాలు ఎదుర్కొంటారని ఈ గ్రంథం హెచ్చరిస్తుంది. ఈ కథనాల ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని, ఇతరులకు సాయం చేయాలని గరుడ పురాణం సందేశం ఇస్తుంది.
శాస్త్రీయ దృక్పథం.. ధార్మిక విశ్వాసాలు
{{/usCountry}}మరణించిన తర్వాత ఆత్మ నిజంగానే ఇళ్ల చుట్టూ తిరుగుతుందా లేదా అనే దానికి ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. సైన్స్ ఈ విషయాలను ధ్రువీకరించలేదు. అయినప్పటికీ, ఇవి తరతరాలుగా వస్తున్న హిందూ ధార్మిక విశ్వాసాలు. మరణించిన ప్రియమైన వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ చేసే ఈ ఆచారాలు మన సంస్కృతిలో అంతర్భాగంగా నిలిచాయి.