వైదిక జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాశి మార్పులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా జ్ఞానం, అదృష్టం, సంపదకుకారకుడైన దేవగురు బృహస్పతి సంచార మార్పు మానవ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు, రాబోయే అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు సింహ రాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ రాశి మార్పు కారణంగా మొత్తం ఐదు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి.

సూర్యుని సంచార శక్తికి, గురుని శుభ దృష్టి తోడవ్వడంతో ఈ రాశుల వారిలో నాయకత్వ లక్షణాలు (లీడర్‌షిప్ క్వాలిటీస్) మరింత పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడంతో పాటు వృత్తి, వ్యాపార రంగాల్లో తిరుగులేని గుర్తింపు, విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆ ప్రత్యేక రాశుల వివరాలు చూద్దాం.
మేష రాశి:
గురుని ఈ సంచారం మేష రాశి వారికి అనేక రంగాల్లో ఊరటనిస్తుంది. కెరీర్‌లో ముందుకు సాగేందుకు సరికొత్త మార్గాలు సుగమం అవుతాయి. మీ పనితీరుకు తగిన గుర్తింపు లభించడంతో పాటు, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కీలక బాధ్యతలు మీ చేతికి వస్తాయి. కొత్త ప్రాజెక్టులు లేదా ఒప్పందాలు కుదురుతాయి. గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ వేగంగా పూర్తవుతాయి. వ్యక్తిగత జీవితంలోనూ సానుకూల మార్పులు వచ్చి మనశ్శాంతిని ఇస్తాయి.
కర్కాటక రాశి:
ధన పరమైన విషయాల్లో ఈ కాలం మీకు ఎంతో అనుకూలంగా మారుతుంది. సంపాదనకు కొత్త మార్గాలు తెరుచుకోవడంతో పాటు పాత ఆర్థిక సమస్యలన్నీ తొలగి పోతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. పై అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల పనితీరు మెరుగవుతుంది. మొత్తం మీద మీ జీవితం మళ్లీ సరైన ట్రాక్‌లోకి వస్తుంది.
సింహ రాశి:
గురుడు నేరుగా మీ సొంత రాశిలోకి ప్రవేశిస్తుండటంతో ఈ రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీ మాట తీరు, నిర్ణయాలు ఇతరులపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి. నాయకత్వ లక్షణాలు మరింత బలపడతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరగడంతో పాటు దానికి తగిన వృద్ధి కనిపిస్తుంది. వ్యాపారస్తులు భారీ లాభాలను ఆర్జిస్తారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మునుపటికంటే మరింత పటిష్టంగా మారుతుంది.
వృశ్చిక రాశి:
{{/usCountry}}గురుడు నేరుగా మీ సొంత రాశిలోకి ప్రవేశిస్తుండటంతో ఈ రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీ మాట తీరు, నిర్ణయాలు ఇతరులపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి. నాయకత్వ లక్షణాలు మరింత బలపడతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరగడంతో పాటు దానికి తగిన వృద్ధి కనిపిస్తుంది. వ్యాపారస్తులు భారీ లాభాలను ఆర్జిస్తారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మునుపటికంటే మరింత పటిష్టంగా మారుతుంది.
వృశ్చిక రాశి:
{{/usCountry}}ఈ గోచార ప్రభావంతో వృశ్చిక రాశి వారికి కెరీర్‌లో సరికొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగంలో రాణించడానికి మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి, భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడతాయి. మీరు పడే కష్టానికి పూర్తి ఫలితం దక్కుతుంది. ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయి.
ధనుస్సు రాశి:
సింహ రాశిలోకి గురు ప్రవేశం జరగగానే ధనుస్సు రాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ల రూపంలో గుడ్ న్యూస్ అందుతుంది. ఒకవేళ ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే ఇది సరైన సమయం. వ్యాపారంలో ఊహించని లాభాలు వచ్చి మనసును ఆనందపరుస్తాయి. ఈ కాలంలో విహారయాత్రలు లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.