జ్యోతిష్య శాస్త్రంలో దేవగురువు బృహస్పతిని సర్వశుభకారకుడిగా భావిస్తారు. జ్ఞానం, సంపద, సంతానం, వివాహం, అదృష్టానికి కారకుడైన గురుభగవానుడు తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు.

ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్న గురువు, రాబోయే అక్టోబర్ 31వ తేదీన సింహ రాశిలోకి అడుగుపెట్టనున్నారు. దాదాపు మూడు నెలల పాటు ఇదే రాశిలో సంచరించనున్న గురుని ఈ మార్పు ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ కాలం స్వర్ణయుగంగా మారనుందని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మేష రాశి వారికి విజయాలు
గురుని ఈ రాశి మార్పు మేష రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉండనుంది. విద్యారంగంలో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. తాము పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.
వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లేందుకు ఇది సరైన సమయం. ప్రేమ జీవితం సంతోషభరితంగా సాగుతుంది. జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. దైవ కార్యాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈ సమయం వారికి ఒక వరమనే చెప్పాలి.
కర్కాటక రాశి వారికి ఆర్థిక ప్రగతి
కర్కాటక రాశి జాతకులకు గురు గోచరం జీవితంలో పెద్ద మార్పులను తీసుకొస్తుంది. ఈ కాలంలో కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది.
కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సరికొత్త పనులకు శ్రీకారం చుట్టేందుకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది.
ధనుస్సు రాశి వారికి ధనలాభం, అదృష్ట వరం
ధనుస్సు రాశి వారికి గురుని సింహ రాశి ప్రవేశం ద్వారా భారీగా ధనలాభం కలుగుతుంది. అదృష్టం పూర్తిగా వెన్నంటి ఉంటుంది. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.
ఉద్యోగం మారాలనుకునే వారికి సరికొత్త అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
{{/usCountry}}ఉద్యోగం మారాలనుకునే వారికి సరికొత్త అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
{{/usCountry}}