...
...
Next Story

ఈ ఏడాది హోలీతో ఈ రాశుల వారి తలరాత మారిపోతుంది.. వ్యాపారంలో భారీగా లాభాలు!

ఈ ఏడాది హోలీ పండుగ మార్చి 4న వచ్చింది. పైగా అదే రోజు శుక్రుడి సంచారంలో మార్పు జరగబోతోంది. శుక్రుడు సంపద, సంతోషం, విలాసాలు, డబ్బు మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. పైగా అదే సమయంలో శనితో సంయోగం చెందుతాడు. ఇది కొన్ని రాశుల వారికి వరం వంటిది. ఈ అనేక లాభాలను పొందుతారు.

Published on: Feb 20, 2026, 13:30:59 IST
Advertisement

ప్రతి ఏటా హోలీ పండుగను అందరూ సరదాగా జరుపుకుంటారు. హోలీని రంగులతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా జరుపుతారు. అయితే ఈ ఏడాది హోలీ పండుగ మార్చి 4న వచ్చింది. పైగా అదే రోజు శుక్రుడి సంచారంలో మార్పు జరగబోతోంది. శుక్రుడు సంపద, సంతోషం, విలాసాలు, డబ్బు మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. పైగా అదే సమయంలో శనితో సంయోగం చెందుతాడు. ఇది కొన్ని రాశుల వారికి వరం వంటిది.

ఈ ఏడాది హోలీతో ఈ రాశుల వారి తలరాత మారిపోతుంది (pinterest)
ఈ ఏడాది హోలీతో ఈ రాశుల వారి తలరాత మారిపోతుంది (pinterest)

రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు, పురోగతిని చూస్తారు. ప్రేమ జీవితంలో కూడా సంతోషం పెరుగుతుంది. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులను కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారికి హోలీ సందర్భంగా కలిసి రాబోతోంది? ఎవరు లాభాలను పొందబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఏడాది హోలీతో ఈ రాశుల వారి తలరాత మారిపోతుంది.. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి

1.మేష రాశి

మేష రాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు ఇది శుభ సమయం. గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆర్థికపరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి.

అలాగే బంధువులతో ఉన్న అపార్థాలన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కెరీర్‌లో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. ఈ సమయంలో ఈ రాశి వారికి జీతం పెరిగే అవకాశం ఉంది. ప్రమోషన్లు వస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.

2.సింహ రాశి

సింహ రాశి వారికి ఈ హోలీ శుభ ఫలితాలను తీసుకొస్తుంది. హోలీ సమయానికి ఈ రాశి వారి సమస్యలన్నీ తొలగిపోతాయి. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి.

ధనుస్సు రాశి వారికి ఈ హోలీ బాగా కలిసి వస్తుంది. పురోగతిని చూస్తారు. కొత్త బాధ్యతలను చేపడతారు. కెరీర్‌లో మంచి అవకాశాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి కూడా బాగుంటుంది.

బిజినెస్‌లో మంచి అవకాశాలు వస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఒంటరిగా ఉన్న వారు భాగస్వామిని పొందుతారు. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. విద్యార్థులకు కూడా బాగా కలిసి వస్తుంది. కాంపిటేటివ్ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks