గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకొస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం, ఫిబ్రవరి 13, 2026న సూర్యుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రాశిలోనే నీడ గ్రహమైన రాహువు కూడా ఉండటంతో, ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దీంతో గ్రహణ యోగం ఏర్పడుతుంది.

ఇది కొంత ప్రమాదకరమైన యోగంగా భావించబడుతుంది. ఈ గ్రహణ యోగం కారణంగా కొన్ని రాశుల వారు 2026 ఫిబ్రవరిలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఏ రాశుల వారికి సమస్యలు ఎదురవుతాయి? ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్య, రాహువుల ప్రమాదకర సంయోగం, ఈ రాశుల వారికి ఆర్థిక నష్టంతో పాటు పలు సమస్యలు
1.మేష రాశి
మేష రాశి వారికి ఈ గ్రహణ యోగం వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఒత్తిడి ఎక్కువవుతుంది. తోటి ఉద్యోగస్తులతో సమస్యలు వస్తాయి. పేరు ప్రతిష్ఠలకు భంగం కలగవచ్చు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరంగా కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
2.మిథున రాశి
మిథున రాశి వారు ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్త తీసుకోవాలి. రాహువు, సూర్యుల కలయిక ఈ రాశి వారికి ఇబ్బందులను కలిగిస్తుంది. రిలేషన్‌షిప్‌లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పనిలో మొదట అడ్డంకులు ఎక్కువవుతాయి. మానసికంగా కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. కాబట్టి ఈ రాశి వారు అప్రమత్తంగా ఉండాలి.
3.సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రెండు గ్రహాల కలయిక అశుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు చిన్నపాటి సమస్యలను ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావచ్చు. వ్యాపారంలో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది.
4.వృశ్చిక రాశి
{{/usCountry}}సింహ రాశి వారికి ఈ రెండు గ్రహాల కలయిక అశుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు చిన్నపాటి సమస్యలను ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావచ్చు. వ్యాపారంలో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది.
4.వృశ్చిక రాశి
{{/usCountry}}వృశ్చిక రాశి వారికి చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. కెరీర్‌లో సమస్యలు రావచ్చు. ఇంట్లో టెన్షన్ పెరిగే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసే సమయంలో ఈ రాశి వారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
5.కుంభ రాశి
కుంభ రాశి వారికి కూడా ఈ సమయం సమస్యలతో కూడినదిగా ఉంటుంది. సూర్య, రాహువుల సంయోగం ఈ రాశి వారికి నష్టాలను తీసుకొస్తుంది. కోపం పెరుగుతుంది, ఇరిటేషన్ వస్తుంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.