ఈ రాశుల వారికి శుక్ర, శని దృష్టి యోగం అనేక లాభాలను తెస్తుంది, వ్యాపారంతో చాలా డబ్బు వస్తుంది!

శుక్రుడు సంపద, డబ్బు, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. శని మనం చేసే పనులను, ఫలితాలను బట్టి ఫలితాలను ఇస్తాడు. ఈ రెండు గ్రహాలు 90 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఇది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు.

Published on: Dec 22, 2025, 12:00:39 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం, జనవరి 15న శుక్రుడు, శని 90 డిగ్రీల కోణంలో ఉంటారు. ఈ రెండు గ్రహాలు ఇలా ఉండడంతో లాభదృష్టి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఏ రాశుల వారికి మంచి ఫలితాలను తీసుకురాబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడే తెలుసుకుందాం.

లాభ దృష్టి యోగంతో ఈ రాశుల వారికి అనేక లాభాలు
లాభ దృష్టి యోగంతో ఈ రాశుల వారికి అనేక లాభాలు

లాభ దృష్టి యోగం

శుక్రుడు సంపద, డబ్బు, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. శని మనం చేసే పనులను, ఫలితాలను బట్టి ఫలితాలను ఇస్తాడు. ఈ రెండు గ్రహాలు 90 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఇది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారి కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ప్రమోషన్లు వస్తాయి, జీతం పెరుగుతుంది, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. లాభదృష్టి యోగంతో ఈ రాశుల వారికి అనేక లాభాలు కలుగుతాయి.

లాభ దృష్టి యోగంతో ఈ రాశుల వారికి అనేక లాభాలు

1.మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రెండు గ్రహాల కలయిక శుభ ఫలితాలను అందిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు. సక్సెస్‌ను అందుకుంటారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తులను పొందుతారు.

2.తులా రాశి

తులా రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ రెండు గ్రహాల కలయికతో ఏర్పడిన ఈ యోగం అద్భుతంగా మారుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పెద్ద వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తారు. వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి.

3.మకర రాశి

మకర రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. శుక్రుడు, శని కారణంగా ఏర్పడిన ఈ యోగం రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టులు వస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. భాగస్వామి సపోర్ట్ ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

4.కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ యోగం అనేక లాభాలను తీసుకొస్తుంది. ఈ రాజయోగంతో ఈ రాశి వారి జీవితం మారిపోతుంది. తెలివితేటలు పెరుగుతాయి. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. పాలిటిక్స్, సోషల్ వర్క్ చేస్తున్నవారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More