Jagannath Rath Yatra 2026 : జగన్నాథ రథయాత్ర.. మీరు తెలుసుకోవాల్సిన 10 ఆసక్తికర విషయాలు

Jagannath Rath Yatra 2026 : ఒడిశా పూరీ జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధమైంది. జులై 16 నుంచి ప్రారంభం అవుతుంది. జగన్నాథుడి రథయాత్ర గురించి 10 ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.

Published on: Jul 15, 2026, 11:30:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జగన్నాథ రథయాత్ర జులై 16వ తేదీ గురువారం నాడు ప్రారంభమై జులై 24వ తేదీ శుక్రవారం వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో జగన్నాథ స్వామి తన సోదరి సుభద్ర, సోదరుడు బలరాముడు మూడు వేర్వేరు రథాలపై గుండిచా ఆలయానికి ప్రయాణిస్తారు. నలుమూలల నుండి భక్తులు ఈ రథయాత్రలో పాల్గొంటారు. ఈ రథయాత్ర గురించి మీరు తెలుసుకోవలసిన అనేక ప్రత్యేక విషయాలు ఉన్నాయి. వాటిని భక్తులు తప్పక తెలుసుకోవాలి. జగన్నాథ రథయాత్రలోని ప్రత్యేక విషయాలను 10 పాయింట్లలో వివరంగా తెలుసుకోండి.

జగన్నాథ రథయాత్ర
జగన్నాథ రథయాత్ర

1. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం ద్వితీయ తిథి నాడు జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ ఊరేగింపు ఒడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయం నుండి మొదలవుతుంది. జగన్నాథుడు, బలరాముడు, వారి సోదరి సుభద్ర కోసం మూడు వేర్వేరు రథాలను సిద్ధం చేస్తారు. ఈ రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

2. రథాలను తయారు చేయడానికి చాలా ప్రత్యేకమైన కలపను ఉపయోగిస్తారు. సాల్, వేప, సింబల్, మరియు ధౌరా చెట్ల కలపను ఉపయోగిస్తారు. ఈ రథయాత్ర కోసం శుభప్రదమైన చెట్లను ఎంపిక చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు, వాటితో రథాలను తయారు చేస్తారు. ఈ కలపలను దారు అని పిలుస్తారు.

3. రథయాత్రలోని మూడు రథాలు వేర్వేరు పేర్లతో పిలుస్తారు. జగన్నాథుని రథాన్ని నందిఘోష లేదా గరుడధ్వజ అని పిలుస్తారు. బలరాముని రథాన్ని తలధ్వజ అని, సుభద్ర దేవి రథాన్ని దర్పదాలన్.. దీనినే పద్మ రథం అని పిలుస్తారు.

4. రథ నిర్మాణంలో మేకుల వంటి పదునైన వస్తువులను ఉపయోగించరని అంటారు. వసంత పంచమి నాడు కలప ఎంపిక మొదలవుతుంది. దీని తర్వాత అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలవుతుంది.

5. రథయాత్ర ఐదో రోజున లేదా హేరా పంచమి నాడు లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై గుండిచా ఆలయానికి వస్తుంది. అక్కడ ఆమె జగన్నాథుని నందిఘోష రథచక్రాన్ని విరగ్గొడుతుంది. స్వామి చాలా కాలం పాటు ఆమెను విడిచిపెట్టి, తన మేనత్త ఇంటికి వెళ్లినందున ఇలా చేస్తుందని నమ్మకం.

6. ఈ రథయాత్ర సమయంలో జగన్నాథ స్వామి ఒక వారం పాటు తన మేనత్త ఇంట్లో ఉండి, ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం దశమ రోజున గుండిచా ఆలయానికి తిరిగి వస్తారు. దీనిని బహుదా యాత్ర అని అంటారు. మూడు రోజుల పాటు స్వామివారు ఆలయం వెలుపల తన భక్తులకు దర్శనమిచ్చి, ఆ తర్వాత తన ఆలయ గర్భగుడిలోకి తిరిగి వెళ్తారు.

7. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా జగన్నాథ స్వామి లక్ష్మీదేవి ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి వచ్చిందని నమ్ముతారు. గర్భగుడిలోకి ప్రవేశం లభించడానికి ముందు స్వామి ఆగ్రహించిన లక్ష్మీదేవిని శాంతింపజేయవలసి వచ్చింది. దీనినే నీలాద్రి విజయం అని అంటారు.

8. ఈ రథయాత్ర సమయంలో జగన్నాథుని రథం సాల్‌బేగ్ అనే ముస్లిం భక్తుని సమాధి వద్ద కూడా ఆగుతుందని చెబుతారు. ఈ భక్తుని తల్లి హిందువు, తండ్రి మొఘల్ సైనికుడు.

9. ఒడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయం నుండి ప్రారంభమయ్యే రథయాత్ర సమయంలో రథం పూర్తి 3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గుండిచా ఆలయానికి చేరుకోవడానికి ఉదయం నుండి సాయంత్రం వరకు సమయం పట్టవచ్చు. కొన్నిసార్లు, రథం మరుసటి రోజు ఆలయానికి చేరుకుంటుంది.

10. రథయాత్రకు సంబంధించి ఒక నమ్మకం ఉంది. అదేంటంటే ఈ రథం తాడులను లాగిన వారు పాపాల నుండి విముక్తి పొంది హరిలోకంలో స్థానం పొందుతారు. అందుకే రథయాత్ర సమయంలో రథాన్ని లాగడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More