...
...
Next Story

July 2026 Festivals: జూలైలో వచ్చే పండుగలు ఏవి? పెళ్లి, గృహప్రవేశం ముహూర్తాల పూర్తి వివరాలు!

జూన్ నెల ముగియడంతో జూలై 2026 ప్రారంభం కానుంది. ఈ నెలలో హిందూ సంప్రదాయం ప్రకారం యోగినీ ఏకాదశి, ఆషాఢ అమావాస్య, గుప్త నవరాత్రులు, జగన్నాథ రథయాత్ర, కర్కాటక సంక్రాంతి, దేవశయని ఏకాదశి, గురు పౌర్ణమి వంటి ముఖ్యమైన పండుగలు, వ్రతాలు జరుపుకోనున్నారు.

Published on: Jun 30, 2026, 12:31:19 IST
Advertisement

జూన్ 2026 ఈరోజుతో పూర్తికాబోతోంది. రేపటి నుంచి జూలై నెల ప్రారంభం కానుంది. హిందూ సంప్రదాయంలో ప్రతి నెలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుంది. జూలై 2026లో కూడా ముఖ్యమైన వ్రతాలు, పండుగలు, పుణ్య తిథులు విశేషంగా నిలుస్తున్నాయి.

July 2026 Festivals: జూలైలో వచ్చే పండుగలు ఏవి? పెళ్లి, గృహప్రవేశం ముహూర్తాల పూర్తి వివరాలు! (pinterest)
July 2026 Festivals: జూలైలో వచ్చే పండుగలు ఏవి? పెళ్లి, గృహప్రవేశం ముహూర్తాల పూర్తి వివరాలు! (pinterest)

యోగినీ ఏకాదశి, ఆషాఢ అమావాస్య, గుప్త నవరాత్రులు, జగన్నాథ రథయాత్ర, కర్కాటక సంక్రాంతితో పాటు దేవశయని ఏకాదశి, గురు పౌర్ణమి కూడా జూలై నెలలో రానున్నాయి. ఈ పర్వదినాల్లో ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, దానధర్మాలు నిర్వహిస్తే దైవానుగ్రహం కలుగుతుందని విశ్వాసం. జూలై 2026లో ఏ తేదీన ఏ పండుగ వచ్చిందో ఇప్పుడు చూద్దాం.

జూలై 2026 ముఖ్యమైన పండుగలు, వ్రతాలు

జూలై 3 (శుక్రవారం): సంకటహర చతుర్థి

జూలై 10 (శుక్రవారం): యోగినీ ఏకాదశి

జూలై 11 (శనివారం): శని ప్రదోష వ్రతం

జూలై 13 లేదా 14: ప్రాంతాన్ని బట్టి ఆషాఢ అమావాస్య (జ్యేష్ఠ అమావాస్య)

జూలై 14: ఆషాఢ గుప్త నవరాత్రుల ప్రారంభం

జూలై 15: జగన్నాథ రథయాత్ర ప్రారంభం

జూలై 16 (గురువారం): కర్కాటక సంక్రాంతి

జూలై 24: దేవశయని ఏకాదశి

జూలై 26 (ఆదివారం): రవి ప్రదోష వ్రతం

జూలై 28, 29: గురు పౌర్ణమి

జూలై నెలలో పెళ్లి ముహూర్తాలు

జూలై 1,6,7

యోగినీ ఏకాదశి 2026

ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే పాపాలు తొలగి, సుఖ సంతోషాలు లభిస్తాయి. ఐశ్వర్యం, ఆరోగ్యం కలగడంతో పాటు విష్ణువు అనుగ్రహం కూడా ఉంటుంది.

దేవశయని ఏకాదశి 2026

పుట్టు వెంట్రుకల ముహూర్తాలు: జూలై 2, 3, 9, 15, 20

నామకరణం ముహూర్తాలు:

జూలై 1, 2, 3, 5, 6, 8, 9, 12, 15, 19, 20, 24, 29, 30, 31

గృహప్రవేశం ముహూర్తాలు:

జూలై 1, 2, 6

వాహన కొనుగోలు ముహూర్తాలు:

జూలై 2, 3, 5, 8, 12, 15, 19, 24, 29, 30

అన్నప్రాశన ముహూర్తాలు:

జూలై 15, 20, 24, 29

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe