జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతిని (గురువు) జ్ఞానం, సంపద, అదృష్టానికి కారకుడిగా భావిస్తారు. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న గురువు, జూన్ నెలలో కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు అత్యంత శక్తిమంతమైన 'గజకేసరి యోగం' ఉద్భవిస్తుంది. ఏనుగు (గజం), సింహం (కేసరి) కలిస్తే ఎంతటి శక్తి వస్తుందో.. ఈ యోగం వల్ల జాతకులకు అంతటి ధైర్యం, రాజభోగాలు లభిస్తాయని పండితులు చెబుతుంటారు. గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉంటాడు కాబట్టి, ఈ ప్రభావం మరింత బలంగా ఉండనుంది.
లీడర్‌షిప్ నుంచి ఆర్థిక లాభాల వరకు

ఈ యోగం పట్టడం వల్ల కేవలం డబ్బు మాత్రమే కాదు, సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. భావోద్వేగపరంగా మీరు మరింత దృఢంగా మారుతారు. కెరీర్ పరంగా నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత వస్తుంది. ఆర్థికంగా చూస్తే.. ఖర్చులు తగ్గుముఖం పట్టి, పొదుపు చేసే అవకాశం దక్కుతుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయి.
ఈ నాలుగు రాశుల వారికి రాజయోగం
1.మేష రాశి: ఇల్లు, వాహన యోగం
మేష రాశి వారికి ఈ సంచారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ ఆర్థిక స్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. చాలా కాలంగా సొంత ఇల్లు లేదా కొత్త వాహనం కొనాలనుకునే వారి కల ఈ కాలంలో నెరవేరుతుంది.
2.వృషభ రాశి: పెళ్లి గడియలు దగ్గరపడ్డాయి
వృషభ రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి అనుకూల ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ గజకేసరి యోగం మంచి సంబంధాలను తీసుకు వస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
3.కర్కాటక రాశి: ఆత్మవిశ్వాసమే మీ బలం
గురువు మీ రాశిలోనే సంచరిస్తుండటంతో అత్యధిక ప్రయోజనం మీకే లభిస్తుంది. ఆర్థికంగా లాభపడటమే కాకుండా, మానసిక ప్రశాంతతను పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏ పని మొదలుపెట్టినా విజయం మీ వరిస్తుంది. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది.
4.మకర రాశి: వృత్తిలో పురోగతి
{{/usCountry}}గురువు మీ రాశిలోనే సంచరిస్తుండటంతో అత్యధిక ప్రయోజనం మీకే లభిస్తుంది. ఆర్థికంగా లాభపడటమే కాకుండా, మానసిక ప్రశాంతతను పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏ పని మొదలుపెట్టినా విజయం మీ వరిస్తుంది. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది.
4.మకర రాశి: వృత్తిలో పురోగతి
{{/usCountry}}మకర రాశి వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ మధ్య సమతుల్యత సాధిస్తారు. కార్యాలయాల్లో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. మీ ఆర్థిక ప్రణాళికలు సక్సెస్ అయి, భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది.