కార్తీకమాసం చాలా విశేషమైన మాసం. కార్తీక మాసంలో కొన్ని పరిహారాలను, కొన్ని పద్ధతులను పాటిస్తే శుభఫలితాలతో సంతోషంగా ఉండొచ్చు. శివ-కేశవుల అనుగ్రహం కూడా లభిస్తుంది. కార్తీక మాసంలో దీపదానం చాలా విశేషమైనది. కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
కార్తీక మాసం 2025

దీప దానం ఏ నెలలో అయినా చెయ్యొచ్చు, కానీ కార్తీకమాసంలో చేస్తే ఇంకా విశేషం. చక్కటి ప్రయోజనాలను పొందడానికి వీలవుతుంది. చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉన్న పౌర్ణమి అవడంతో “కార్తీకమాసం” అని ఈ నెలకు పేరు వచ్చింది. కృత్తిక అగ్ని సంబంధిత నక్షత్రం కనుక ఈ నెలలో దీపదానం చాలా మంచిది.
కార్తీక మాసంలో దీపదానం
కార్తీకమాసం నెల్లాళ్ళు కూడా ఇంట్లో తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు. అదే విధంగా ఆలయాల్లో ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం వలన మంచి జరుగుతుంది. సూర్యోదయం ముందు, సంధ్య సమయంలో దీపారాధన చేయడం వలన చక్కటి ఫలితాలను పొందవచ్చు. అయితే దీపాలను వెలిగించడమే కాదు, దీపదానం చేస్తే కూడా మంచిది. చాలామంది రకరకాల దానాలు కూడా కార్తీకమాసంలో చేస్తూ ఉంటారు.
కార్తీక మాసంలో దీప దానం ఎలా చేయాలి?
గోదానం, భూదానం, సువర్ణదానం ఇలా చాలా దానాలు ఉంటాయి. అయితే కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన ఎంతో మేలు జరుగుతుంది. ఇక దీపదానం ఎలా చేయాలనే విషయానికి వస్తే.. బియ్యం పిండి లేదా గోధుమ పిండిని ఆవుపాలతో కలపాలి. ఆ తర్వాత దానితో ప్రమిద చేయాలి. అందులో దీపం వెలిగించి దానం చేయాలి. ఒకవేళ బియ్యం పిండితో దీపం చేయలేని వారు మట్టి ప్రమిదలో కూడా అదే విధంగా దీపం వెలిగించి, స్వయంపాకం దక్షిణ పెట్టి దీపాన్ని దానంగా ఇవ్వచ్చు. దీపాన్ని వెలిగించాక పసుపు, కుంకుమ, పూలతో దీపాన్ని అలంకరించండి.
స్తోమత ఉన్నట్లయితే వెండి ప్రమిదలో, బంగారం భర్త వేసి దీపదానం చేస్తే ఇంకా ఎక్కువ రేట్ల ఫలితాన్ని పొందవచ్చు. ఈ ఐదు రోజులు దీప దానం చేస్తే ఇంకా మంచిది. కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి దాకా ఉండే ఈ ఐదు రోజులు కూడా దీప దానానికి చాలా మంచి రోజులు. ఈ ఐదు రోజులు దీప దానం చేయడం వలన ఇంకా ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు.
దీపదాన మహిమ
{{/usCountry}}స్తోమత ఉన్నట్లయితే వెండి ప్రమిదలో, బంగారం భర్త వేసి దీపదానం చేస్తే ఇంకా ఎక్కువ రేట్ల ఫలితాన్ని పొందవచ్చు. ఈ ఐదు రోజులు దీప దానం చేస్తే ఇంకా మంచిది. కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి దాకా ఉండే ఈ ఐదు రోజులు కూడా దీప దానానికి చాలా మంచి రోజులు. ఈ ఐదు రోజులు దీప దానం చేయడం వలన ఇంకా ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు.
దీపదాన మహిమ
{{/usCountry}}కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి కోట దగ్గర శివాలయంలో లేదా వైష్ణవాలయంలో దీపారాధన, దీపదానం చేయడం మంచిది. ఒక వత్తితో దీపదానం చేస్తే బుద్ధిశాలి అవుతారు. నాలుగు వత్తులతో దీపదానం చేస్తే రాజు అవుతారు. పది వత్తులతో దీపదానం చేస్తే విష్ణు సాహిత్యం పొందుతారు. వెయ్యి వత్తులతో దీపదానం చేస్తే విష్ణురూపుడు అవుతారు.
ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే జ్ఞానం, మోక్షం లభిస్తాయని వ్యాస మహర్షి చెప్పారు. అదే విధంగా నువ్వుల నూనెతో దీప దానం చేయడం వలన కీర్తి లభిస్తుంది. విప్ప నూనె, ఆముదం, అవిసె నూనె, బర్రె నెయ్యితో దీపారాధన తగదు. దీపారాధన చేసేటప్పుడు నూనెలో కాస్త ఆవు నెయ్యి కలిపితే దోషాలు ఉండవు. దీపదానం చేయడం వలన ఇంద్రుడు పదవులను పొందాడట.