కార్తీక మాసంలో దీపదానం చేస్తే ఎన్ని లాభాలో తెలుసా? దీపదానం ఎలా చేయాలి, ఎన్ని వత్తుల దీపాన్ని దానం చెయ్యాలో తెలుసుకోండి!
కార్తీక మాసంలో కొన్ని పరిహారాలను, పద్ధతులను పాటిస్తే శుభఫలితాలతో సంతోషంగా ఉండొచ్చు. శివ-కేశవుల అనుగ్రహం కూడా లభిస్తుంది. కార్తీక మాసంలో దీపదానం చాలా విశేషమైనది. సూర్యోదయం ముందు, సంధ్య సమయంలో దీపారాధన చేయడం వలన చక్కటి ఫలితాలను పొందవచ్చు. అయితే దీపాలను వెలిగించడమే కాదు, దీపదానం చేస్తే కూడా మంచిది.
కార్తీకమాసం చాలా విశేషమైన మాసం. కార్తీక మాసంలో కొన్ని పరిహారాలను, కొన్ని పద్ధతులను పాటిస్తే శుభఫలితాలతో సంతోషంగా ఉండొచ్చు. శివ-కేశవుల అనుగ్రహం కూడా లభిస్తుంది. కార్తీక మాసంలో దీపదానం చాలా విశేషమైనది. కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

కార్తీక మాసం 2025
దీప దానం ఏ నెలలో అయినా చెయ్యొచ్చు, కానీ కార్తీకమాసంలో చేస్తే ఇంకా విశేషం. చక్కటి ప్రయోజనాలను పొందడానికి వీలవుతుంది. చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉన్న పౌర్ణమి అవడంతో “కార్తీకమాసం” అని ఈ నెలకు పేరు వచ్చింది. కృత్తిక అగ్ని సంబంధిత నక్షత్రం కనుక ఈ నెలలో దీపదానం చాలా మంచిది.
కార్తీక మాసంలో దీపదానం
కార్తీకమాసం నెల్లాళ్ళు కూడా ఇంట్లో తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు. అదే విధంగా ఆలయాల్లో ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం వలన మంచి జరుగుతుంది. సూర్యోదయం ముందు, సంధ్య సమయంలో దీపారాధన చేయడం వలన చక్కటి ఫలితాలను పొందవచ్చు. అయితే దీపాలను వెలిగించడమే కాదు, దీపదానం చేస్తే కూడా మంచిది. చాలామంది రకరకాల దానాలు కూడా కార్తీకమాసంలో చేస్తూ ఉంటారు.
కార్తీక మాసంలో దీప దానం ఎలా చేయాలి?
గోదానం, భూదానం, సువర్ణదానం ఇలా చాలా దానాలు ఉంటాయి. అయితే కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన ఎంతో మేలు జరుగుతుంది. ఇక దీపదానం ఎలా చేయాలనే విషయానికి వస్తే.. బియ్యం పిండి లేదా గోధుమ పిండిని ఆవుపాలతో కలపాలి. ఆ తర్వాత దానితో ప్రమిద చేయాలి. అందులో దీపం వెలిగించి దానం చేయాలి. ఒకవేళ బియ్యం పిండితో దీపం చేయలేని వారు మట్టి ప్రమిదలో కూడా అదే విధంగా దీపం వెలిగించి, స్వయంపాకం దక్షిణ పెట్టి దీపాన్ని దానంగా ఇవ్వచ్చు. దీపాన్ని వెలిగించాక పసుపు, కుంకుమ, పూలతో దీపాన్ని అలంకరించండి.
స్తోమత ఉన్నట్లయితే వెండి ప్రమిదలో, బంగారం భర్త వేసి దీపదానం చేస్తే ఇంకా ఎక్కువ రేట్ల ఫలితాన్ని పొందవచ్చు. ఈ ఐదు రోజులు దీప దానం చేస్తే ఇంకా మంచిది. కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి దాకా ఉండే ఈ ఐదు రోజులు కూడా దీప దానానికి చాలా మంచి రోజులు. ఈ ఐదు రోజులు దీప దానం చేయడం వలన ఇంకా ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు.
దీపదాన మహిమ
కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి కోట దగ్గర శివాలయంలో లేదా వైష్ణవాలయంలో దీపారాధన, దీపదానం చేయడం మంచిది. ఒక వత్తితో దీపదానం చేస్తే బుద్ధిశాలి అవుతారు. నాలుగు వత్తులతో దీపదానం చేస్తే రాజు అవుతారు. పది వత్తులతో దీపదానం చేస్తే విష్ణు సాహిత్యం పొందుతారు. వెయ్యి వత్తులతో దీపదానం చేస్తే విష్ణురూపుడు అవుతారు.
ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే జ్ఞానం, మోక్షం లభిస్తాయని వ్యాస మహర్షి చెప్పారు. అదే విధంగా నువ్వుల నూనెతో దీప దానం చేయడం వలన కీర్తి లభిస్తుంది. విప్ప నూనె, ఆముదం, అవిసె నూనె, బర్రె నెయ్యితో దీపారాధన తగదు. దీపారాధన చేసేటప్పుడు నూనెలో కాస్త ఆవు నెయ్యి కలిపితే దోషాలు ఉండవు. దీపదానం చేయడం వలన ఇంద్రుడు పదవులను పొందాడట.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


