నవంబర్ 5 ఎందుకు అంత ప్రత్యేకం? ఆ రోజు శివ కేశవుల అనుగ్రహం కలగాలంటే, మీ రాశి ప్రకారం వేటిని దానం చెయ్యాలో తెలుసుకోండి!
నవంబర్ 5 ఎందుకు అంత ప్రత్యేకం? ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు కార్తీక పౌర్ణమిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 5న వచ్చింది. మరి కార్తీక పౌర్ణమి నాడు ఏ రాశి వారు వేటిని దానం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. మీ రాశి ప్రకారం వేటిని దానం చేయాలో తెలుసుకోండి.
కార్తీక మాసంలో శివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. శివకేశవుల అనుగ్రహం కలగడానికి నదీ స్నానం, దీపారాధన, ఉసిరి దీపాలు ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వారు పరమేశ్వరుడిని ఆరాధిస్తారు. అయితే నవంబర్ 5 ఎందుకు అంత ప్రత్యేకం? నవంబర్ 5 కార్తీక పౌర్ణమి. ఆ రోజున చేసిన దానం ఎంతో శుభప్రదం. ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నవంబర్ 5న కార్తీక పౌర్ణమి
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు కార్తీక పౌర్ణమిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 5న వచ్చింది. ఆ రోజు పవిత్ర నదిలో స్నానం చేసి కొన్ని వస్తువులను దానం చేయడం వలన శుభఫలితాలను పొందవచ్చు. మరి కార్తీక పౌర్ణమి నాడు ఏ రాశి వారు వేటిని దానం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. మీ రాశి ప్రకారం వేటిని దానం చేయాలో తెలుసుకోండి.
నవంబర్ 5న ఎంతో విశిష్టమైన కార్తీక పౌర్ణమి.. ఆ రోజు రాశుల ఆధారంగా వీటిని దానం చేస్తే మంచిది:
మేష రాశి: మేష రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు బెల్లం, ఎర్రటి వస్త్రాలు, పప్పులు, తేనే లేదా ఎర్రటి పండ్లను దానం చేస్తే శుభఫలితాలు ఎదురవుతాయి. శివకేశవుల అనుగ్రహాన్ని పొందవచ్చు.
వృషభ రాశి: వృషభ రాశి వారు దుప్పట్లు, పాలతో చేసిన స్వీట్లు, బియ్యం, నెయ్యి వంటివి కార్తీక పౌర్ణమి నాడు దానం చేస్తే చాలా మంచిది.
మిథున రాశి: మిథున రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు పెసలు, ఆకుపచ్చని కూరగాయలు, ఉసిరికాయలు, ఆకుపచ్చని వస్త్రాలు దానం చేస్తే మంచిది. పేదవారికి చదువుకు సంబంధించిన వస్తువులను దానం చేస్తే కూడా మంచిది.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారు పాలు, బియ్యం, పంచదార, స్వీట్లు వంటి వాటిని దానం చేస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. ధనం, సంతోషం పెరుగుతాయి.
సింహ రాశి: సింహ రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు గోధుమలు, రాగి వస్తువులు, బెల్లం, బట్టలు వంటి వాటిని దానం చేస్తే బాగా కలిసి వస్తుంది.
కన్యా రాశి: కన్యా రాశి వారు ఆకుపచ్చని వస్త్రాలు, పెసలు, కూరగాయలు, నెయ్యి వంటి వాటిని దానం చేస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. బట్టలు, బియ్యం, పంచదార వంటి వాటిని కార్తీక పౌర్ణమి నాడు దానం చేస్తే చాలా మంచిది. ఆర్థికంగా బాగా కలిసివస్తుంది.
వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారు బెల్లం, ఎర్రటి వస్త్రాలు, పప్పులు, ఎర్రటి పండ్లు వంటి వాటిని కార్తీక పౌర్ణమి నాడు దానం చేయడం మంచిది.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు అరటిపండ్లు, పసుపు రంగులో ఉండే వస్త్రాలు, కుంకుమపువ్వు, పసుపు వంటి వాటిని దానం చేయడం మంచిది.
మకర రాశి: మకర రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు నల్ల నువ్వులు, ఆవాల నూనె, మినప్పప్పు, దుప్పట్లు, స్టీల్ సామాన్లు వంటి వాటిని దానం చేయడం వలన మంచి ఫలితాలు కనబడుతాయి.
కుంభ రాశి: కుంభ రాశి వారు దుప్పట్లు, షూస్, దుస్తులు, నువ్వులు వంటి వాటిని కార్తీక పౌర్ణమి నాడు దానం చేయడం మంచిది.
మీన రాశి: మీన రాశి వారు పసుపు రంగులో ఉండే వస్త్రాలు, శనగపిండితో చేసిన లడ్డూలు, పసుపు వంటి వాటిని కార్తీక పౌర్ణమి నాడు దానం చేయడం చాలా మంచిది. విశేష ఫలితాలను పొందవచ్చు, సంతోషంగా ఉండొచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


