Karthika masam: కార్తీక మాసంలో వేటిని దానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది? ఇలా చేస్తే ధనవృద్ధి, సంతాన భాగ్యం!

కార్తీక మాసంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి, నది స్నానం చేసి ఈ దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా దీపారాధన చేసి శివ కేశవులను ఆరాధిస్తే, శివకేశవుల అనుగ్రహంతో సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. కార్తీక మాసంలో వేటిని దానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది?

Published on: Nov 1, 2025, 12:00:03 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక మాసంలో చేసే దీపారాధనకు, నది స్నానానికి ఎంతో విశిష్టత ఉంటుంది. అలాగే కార్తీక మాసంలో దానాలు చేస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది. కార్తీక మాసంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి, నది స్నానం చేసి ఈ దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా దీపారాధన చేసి శివ కేశవులను ఆరాధిస్తే, శివకేశవుల అనుగ్రహంతో సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు.

కార్తీక మాసంలో వేటిని దానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది? (pinterest)
కార్తీక మాసంలో వేటిని దానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది? (pinterest)

దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో చేసే దానాలకు ఎంతో ఎక్కువ రేట్ల ఫలితాన్ని పొందవచ్చు. కార్తీక మాసంలో దానాలు చేసేటప్పుడు వీటిని దానం చేస్తే మంచిది. వీటిని దానం చేయడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కార్తీక మాసంలో వేటిని దానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది?

  1. కార్తీక మాసంలో బియ్యాన్ని దానం చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. పాపాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు.
  2. వెండిని దానం చేయడం వలన మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి స్తొమత ఉన్నవారు కార్తీక మాసంలో వెండిని దానం చేయడం కూడా శుభప్రదం.
  3. కార్తీక మాసంలో బంగారాన్ని చేస్తే దోషాలన్నీ తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడపొచ్చు. ఇబ్బందులు కూడా ఉండవు.
  4. కార్తీక మాసంలో పెరుగును దానం చేయడం వలన ఇంద్రియ నిగ్రహాన్ని పొందవచ్చు.
  5. కార్తీక మాసంలో పండ్లను దానం చేయడం వలన కార్యసిద్ధి కలుగుతుంది. కాబట్టి వీలైతే కార్తీక మాసంలో బ్రాహ్మణులకు లేదా పేదలకు పండ్లను దానం చేయండి.
  6. కార్తీక మాసంలో నెయ్యిని దానం చేయడం వలన రోగాలు తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉండొచ్చు.
  7. కార్తీక మాసంలో పాలను దానం చేయడం వలన నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు.
  8. కార్తీక మాసంలో ఉసిరికాయలను దానం చేయడం వలన మతిమరుపు తొలగిపోతుంది, జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు.
  9. కార్తీక మాసంలో తేనెను దానం చేయడం వలన సంతానభాగ్యం కలుగుతుంది. సంతానం లేని వారు కార్తీక మాసంలో తేనెను దానం చేస్తే ఎంతో శుభఫలం పొందుతారు.
  10. కార్తీక మాసంలో టెంకాయను దానం చేయడం వలన కార్యం సిద్ధిస్తుంది. పనిలో అడ్డంకులు తొలగిపోయి అనుకున్నవన్నీ పూర్తి చేయొచ్చు.
  11. దీపాలను దానం చేయడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. గోదానం చేస్తే రుణవిముక్తులు అవ్వచ్చు, ఋషుల ఆశీస్సులు కూడా పొందవచ్చు. వస్త్రదానం చేస్తే ఆయుష్షు పెరుగుతుంది.
  12. కార్తీక మాసంలో అన్నదానం చేస్తే పేదరికం తొలగిపోతుంది, ధనవృద్ధి కలుగుతుంది. కార్తీక మాసంలో భూమిని దానం చేయడం వలన బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది.
  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More