హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కార్తీక మాసంలో శివకేశవులను పూజిస్తారు. కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. తులసి కోట దగ్గర, దేవుడి మందిరంలో, దేవాలయాల్లో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అలాగే ఆకాశ దీపాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అసలు ఆకాశ దీపం అంటే ఏంటి? కార్తీక మాసంలో ఎందుకు ఆకాశ దీపాన్ని వెలిగించాలి? ఆకాశ దీపం వెలిగించడం వెనుక ఉన్న పురాణ విశేషాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
ఆకాశ దీపం అంటే ఏంటి?

కార్తీక మాసంలో ఎత్తైన ప్రదేశంలో లేదా పొడవైన కర్రకు దీపాన్ని వేలాడదీస్తారు. ఆ దీపాన్ని వెలిగిస్తారు. సాధారణంగా ఈ దీపాన్ని సాయంత్రం పూట వెలిగించడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంటి ప్రాంగణంలో, ఆలయ ధ్వజస్తంభం సమీపంలో, ఎత్తైన ప్రదేశాల్లో ఈ ఆకాశ దీపాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఆకాశ దీపాన్ని వెలిగిస్తే సర్వలోకాలకు వెలుగును ప్రసరింపజేసినట్లు భక్తులు భావిస్తారు. దీపం వెలిగించడం వలన అంధకారం తొలగి వెలుగు వ్యాపిస్తుంది. దీపం జ్ఞానానికి, పవిత్రతకు ప్రతీక.
కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగించాలి?
కార్తీక మాసం శివుడికి, విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసం. దీపాన్ని వెలిగించడం వలన దైవానుగ్రహం పొందవచ్చు. ఆకాశ దీపాన్ని వెలిగిస్తే పితృదేవతలకు మార్గదర్శకత్వం లభిస్తుందని కొన్ని సంప్రదాయాల్లో ఉంది. పూర్వీకులను స్మరించుకుని దీపదానం చేయడం వలన పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది.
కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తే పితృదేవతలకు మార్గదర్శకత్వం లభిస్తుందని నమ్మకం. కార్తీక మాసంలో ప్రతిరోజూ సాయంత్రం పూట ఆకాశ దీపాన్ని వెలిగిస్తే శాంతి కలుగుతుంది.
పురాణ విశేషాలు
కార్తీక మాసంలో ఆకాశ దీపం వెలిగించడం వెనుక పురాణ కారణాలు కూడా ఉన్నాయి. కొన్ని పురాణాల్లో, ధర్మశాస్త్రాల్లో ఆకాశ దీపం గురించి ప్రస్తావించబడింది. విష్ణుమూర్తిని దామోదరుడిగా ఆరాధిస్తూ ఆకాశ దీపాన్ని సమర్పించే ఆచారం వైష్ణవ సంప్రదాయంలో ఉంది.
మరికొన్ని సంప్రదాయాల ప్రకారం, శివకేశవుల దివ్య దర్శనం కోసం ప్రత్యేకంగా ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఆకాశ దీపం అంటే కేవలం ఒక దీపం కాదు. దీని వెనుక పైన చెప్పినట్లుగా వివిధ కారణాలు ఉన్నాయి. ఈ ఆచారానికి ప్రాంతాలను బట్టి భిన్నమైన కారణాలు ఉన్నాయి.
కార్తీక మాసంలో ఆకాశ దీపం ఎలా వెలిగించాలి?
{{/usCountry}}మరికొన్ని సంప్రదాయాల ప్రకారం, శివకేశవుల దివ్య దర్శనం కోసం ప్రత్యేకంగా ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఆకాశ దీపం అంటే కేవలం ఒక దీపం కాదు. దీని వెనుక పైన చెప్పినట్లుగా వివిధ కారణాలు ఉన్నాయి. ఈ ఆచారానికి ప్రాంతాలను బట్టి భిన్నమైన కారణాలు ఉన్నాయి.
కార్తీక మాసంలో ఆకాశ దీపం ఎలా వెలిగించాలి?
{{/usCountry}}ఇంటి ప్రాంగణంలో లేదా మేడపై ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి.
పొడవైన వెదురు కర్రకు లేదా స్తంభానికి దీపాన్ని ఏర్పాటు చేయాలి.
మట్టి ప్రమిద లేదా లోహ దీపాన్ని ఎంచుకోవచ్చు.
నువ్వుల నూనె లేదా నెయ్యితో ఈ దీపాన్ని వెలిగించాలి.
సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ దీపారాధన చేయాలి.
ఆకాశ దీపం సమర్పించేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకోండి
దామోదరాయ నభసి తులాయాందోలయా సహ
ప్రదీపం తే ప్రయచ్ఛామి నమో నంతాయ వేదసే