దుర్గాదేవి అనుగ్రహం కోసం నవరాత్రుల్లో సాయంత్రం చేయాల్సిన 7 సులువైన పరిహారాలు!
దుర్గాదేవి అనుగ్రహం కోసం సాయంత్రం వేళ భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం హిందూ సంప్రదాయంలో విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ సందర్భంగా ఇంటి పూజా మందిరాన్ని శుభ్రం చేసి దీపారాధన చేయడం, అమ్మవారికి ఎర్రటి పూలు, కుంకుమ సమర్పించడం, “ఓం దుం దుర్గాయై నమః” మంత్రాన్ని జపించడం వంటి పూజా విధానాలను పాటించవచ్చు.
మన హిందూ సంప్రదాయాల్లో శరన్నవరాత్రులకే ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొమ్మిది రోజులు కూడా భక్తి శ్రద్ధలతో దుర్గాదేవిని పూజిస్తాము. సాయంత్రం పూట దీపారాధన చేసి, అమ్మవారికి పూలను సమర్పించి, మంత్రాలు జపిస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అయితే, నవరాత్రుల సమయంలో సాయంత్రం వేళ చేయాల్సిన కొన్ని పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నవరాత్రుల్లో సాయంత్రం అమ్మవారి అనుగ్రహం కలగడానికి ఈ ఏడు పరిహారాలను ట్రై చేయండి. వీటి వలన ఇంట్లో అద్భుతమైన మార్పులను చూడొచ్చు.

సాయంత్రం పూట నవరాత్రుల సమయంలో ఎలాంటి పరిహారాలను పాటించాలి?
సాయంత్రం వేళ దీపారాధన:
సూర్యాస్తమయం అయ్యాక మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని, అమ్మవారి ముందు నెయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగిస్తే మంచిది.
ఎర్రటి పూలు సమర్పించండి:
దుర్గాదేవి పూజలో ఎర్రటి మందారాలు, ఎర్రటి గులాబీలు సమర్పించడం మంచిది. ఇవి శుభప్రదమైనవి. పూలు సమర్పిస్తే కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, శ్రేయస్సు, సంతోషం కలగడానికి వీలవుతుంది.
ఈ మంత్రాన్ని జపించండి:
ఓం దుం దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని జపిస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. ఈ మంత్రాన్ని సాయంత్రం పూట స్నానం చేసి, ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని 11 లేదా 21 సార్లు జపించండి. దీని వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు.
కుంకుమను సమర్పించండి:
అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహాన్ని తీసుకుని కుంకుమ పూజ చేయండి. సుఖ సంతోషాలు, శుభాలు కలుగుతాయి.
పేదలకు సహాయం:
నవరాత్రుల్లో సాధ్యమైనంత వరకు పేదలకు సహాయం చేయండి. దానం చేయడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది. అమ్మవారి పూర్తి అనుగ్రహం ఉంటుంది.
నైవేద్యంగా పాలు లేదా పండ్లు:
అమ్మవారికి తాజా పండ్లు లేదా పాలను నైవేద్యంగా సమర్పించండి. వీటిని అమ్మవారికి సమర్పించి, ఈ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోండి.
అలాగే, అమ్మవారికి నైవేద్యం సమర్పించాక హారతి ఇవ్వండి. ఇలా దీప, ధూప, నైవేద్యాలతో అమ్మవారిని నవరాత్రుల సమయంలో ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి.
నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


