శారదీయ నవరాత్రులు: అమ్మవారికి ఇష్టమైన పూలు, పూజా విధానంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు!
శారదీయ నవరాత్రుల్లో దుర్గాదేవిని ఏ రోజు ఏ పూలతో పూజించాలి? అమ్మవారి అనుగ్రహం పొందడానికి పూజా సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
శారదీయ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. నవరాత్రుల సమయంలో అమ్మవారి తొమ్మిది రూపాలను తొమ్మిది రోజులు కూడా పూజించడం జరుగుతుంది. నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన కొన్నింటిని సమర్పించడం చాలా మంచి ఫలితాలను అందిస్తుంది.

అమ్మవారికి ఇష్టమైన పూలు గురించి రోజు తెలుసుకుందాం. అలాగే, అమ్మవారిని ఆరాధించేటప్పుడు తొమ్మిది రోజులు కూడా కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. వాటి వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
నవరాత్రులు 2026:
ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో శారదీయ నవరాత్రులు ప్రారంభమవుతాయి. శారదీయ నవరాత్రులు అమ్మవారి ఆరాధనకు చాలా ముఖ్యమైనవి. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు. పూలు, పండ్లు, నైవేద్యాలను అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారు. అక్టోబర్ 11, ఆదివారం నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 19 దాకా కొనసాగుతాయి. విజయదశమి పండుగ అక్టోబర్ 20న జరుపుకోవాలి.
అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పూలను నవరాత్రుల్లో కచ్చితంగా సమర్పించేలా చూసుకోండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు శారదీయ నవరాత్రులలో కచ్చితంగా ఈ పూలను సమర్పించేటట్టు చూసుకోండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్ర మందారాలు సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.
అలాగే, ఎరుపు రంగులో ఉండే పూలను కచ్చితంగా అమ్మవారికి సమర్పించేలా చూసుకోండి. ఎరుపు రంగు భక్తి, దైవిక శక్తికి ప్రత్యేకం. అలాగే, గులాబీ పూలు, మల్లెపూలు, మొగలిపూలు, పారిజాతం పూలు, సంపంగి పూలు, తామర పుష్పాలను సమర్పించండి. ఇవి కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి.
కొన్ని చోట్ల తొమ్మిది రోజులు కూడా ఒక్కో రోజు ఒక్కో పుష్పాన్ని సమర్పిస్తూ ఉంటారు. శైలపుత్రి దేవికి మల్లె, చంద్రఘంటకు తామర, కూష్మాండకు బంతిపూలు, కాత్యాయనీ దేవికి బంతి లేదా గులాబీ పూలను సమర్పిస్తారు. అలాగే, కాలరాత్రికి ఎర్ర మందారాలు, మహాగౌరీకి మల్లె లేదా మొగలిపూలను సమర్పిస్తారు.
పూలు సమర్పించేటప్పుడు ఈ నియమాలను కచ్చితంగా పాటించండి:
భక్తితో అమ్మవారికి పుష్పాలను సమర్పించేటప్పుడు కొన్ని నియమాలను కూడా పాటించాలి. పూలను సమర్పించేటప్పుడు తాజా పూలు, శుభ్రమైనవి సమర్పించాలి.
వాడిపోయిన పూలను అసలు సమర్పించకూడదు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. మంత్ర జపం చేయాలి. నైవేద్యాన్ని కూడా అమ్మవారికి సమర్పించండి.
తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ఎదుట దీపాలను వెలిగించండి.
ఇలా దీప, ధూప, నైవేద్యాలతో అమ్మవారిని తొమ్మిది రోజులు కూడా భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు. ఏ పుష్పాన్ని సమర్పించినా భక్తి, శ్రద్ధ చాలా ముఖ్యమైనవి. అలాగే, స్వచ్ఛమైన మనసుతో చేసే పూజకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని గుర్తుంచుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


