Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారం ఏ రంగులో ఉంటే అదృష్టం కలిసి వస్తుంది? ఇలా ఉంటే అహర్నిశలు ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది!
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ డోర్ ద్వారానే పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది. అందుకే దిశను బట్టి తలుపు రంగును ఎంచుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటి ప్రధాన ద్వారం ఈ రంగులో ఉంటే అదృష్టం కలిసి వస్తుంది.
చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. మనం ఉండే ఇంటికి ప్రధాన ద్వారం అనేది ప్రవేశ మార్గమే కాదు, వాస్తు ప్రకారం సానుకూల లేదా ప్రతికూల శక్తి ప్రవేశించే మార్గం కూడా. అయితే కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రధాన ద్వారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

ప్రధాన ద్వారం వాస్తు
ఒకవేళ వాస్తు దోషం ఉన్నట్లయితే, ఆ ఇంటి యజమాని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా విజయం రాకపోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతి, అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో వెంటాడుతూ ఉంటాయి. సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అడుగు పెట్టదని పండితులు కూడా హెచ్చరిస్తున్నారు. కేవలం ద్వారం దిశే కాదు, రంగు కూడా అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఇంటి ముఖద్వారం వాస్తును ఆధారంగా తీసుకుని ఏ రంగు వేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటి ప్రధాన ద్వారం ఏ రంగులో ఉంటే అదృష్టం కలిసి వస్తుంది
పడమర దిశ
వాస్తు ప్రకారం పడమర దిశలో ఉండే ఇల్లు అదృష్టాన్ని తీసుకొస్తుంది. పడమర దిశలో ఉన్న ఇంట్లో ఉండేవారు ఎదుగుదల విషయంలో ఆటంకాలు లేకుండా ఉంటారు. ఈ దిశపై శని ప్రభావం ఎక్కువ ఉండడంతో ఇంటి ప్రధాన ద్వారానికి ఆకాశ నీలం రంగు వేయించుకుంటే బాగా కలిసి వస్తుంది. శని దేవుని అనుగ్రహంతో ఏ ఇబ్బంది ఉండదు. కుటుంబ సభ్యులకు మంచిగా ఉంటుంది.
నైరుతి దిశ
మీ ఇల్లు నైరుతి వైపు ఉన్నట్లయితే ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఈ దిశలో ఉన్న తలుపులు వెండి రంగు లేదా గులాబీ రంగులో ఉంటే మంచి ఫలితాలను చూస్తారు. ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది. ఒకవేళ ఈ రంగులు వేయించలేకపోతే, కనీసం తలుపు హ్యాండిల్ అయినా సరే నీలం రంగులో ఉండేటట్టు చూడండి. ప్రతికూల ప్రభావం నుంచి బయటపడడానికి వీలవుతుంది.
ఉత్తర దిశ
ఇల్లు ఉత్తర దిశలో ఉంటే ముఖద్వారం లేత ఆకుపచ్చ రంగులో ఉంటే మంచిది. ఉత్తర దిశలో ఉన్న వారు ఇంటికి తగినంత వెలుతురు ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఉత్తర దిశలో వాటర్ ఫౌంటెన్ లేదా నీటి పాత్ర వంటివి పెడితే ఐశ్వర్యం పెరుగుతుంది.
తూర్పు దిశ
ఇల్లు తూర్పు వైపు ఉంటే ఎప్పుడూ కూడా తలుపు సహజంగా ఉండాలి. అంటే చెక్కతో చేసిన తలుపులు వంటివి వేయించుకోవచ్చు. నాచురల్ వుడ్ కలర్ బాగా కలిసి వస్తుంది. సుఖ శాంతులను తీసుకువస్తుంది. కృత్రిమ రంగుల కంటే సహజమైన రంగులు వాడడం మంచిది.
ఈశాన్య దిశ
ఇల్లు ఈశాన్యం వైపు ఉంటే పసుపు రంగు లేదా గ్రీన్ కలర్ అదృష్టాన్ని తీసుకువస్తాయి. వాస్తు దోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అనేక విధాలుగా కలిసివస్తుంది.
వాయువ్య దిశ
తెలుపు లేదా వెండి రంగులను ఈ దిశలో ఇల్లు ఉన్నవారు ఎంపిక చేసుకోవడం మంచిది. ఇంట్లో శక్తిని సమతుల్యం చేస్తుంది. సానుకూల వాతావరణాన్ని తీసుకువస్తుంది.
ఈ చిన్న వాస్తు నియమాన్ని పాటించడం వలన మీ ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది. ఆర్థికపరంగా ఏ విధమైన లోటు కూడా ఉండదు. అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


