దసరా నవరాత్రులు 2026: రోజుకో రూపంలో అమ్మవారి పూజ.. రోజుకో నైవేద్యం! విజయదశమి శుభ ముహూర్తం ఇదే

దేశవ్యాప్తంగా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే దసరా పండుగలో శారదీయ నవరాత్రులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. 2026లో నవరాత్రులు అక్టోబర్ 11 నుంచి ప్రారంభమై, అక్టోబర్ 20న విజయదశమి జరుపుకుంటారు. విజయదశమి రోజున మధ్యాహ్నం 1:59 నుంచి 2:45 వరకు విజయ ముహూర్తం ఉన్నట్లు ఈ వివరాల్లో పేర్కొన్నారు. 

Published on: Oct 7, 2026, 14:01:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా దసరా పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుతారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటారు. శారదీయ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో ఆరాధిస్తారు.

దసరా నవరాత్రులు 2026: రోజుకో రూపంలో అమ్మవారి పూజ.. రోజుకో నైవేద్యం! విజయదశమి శుభ ముహూర్తం ఇదే (AI)
దసరా నవరాత్రులు 2026: రోజుకో రూపంలో అమ్మవారి పూజ.. రోజుకో నైవేద్యం! విజయదశమి శుభ ముహూర్తం ఇదే (AI)

పదవ రోజు విజయ దశమి పండుగను జరుపుతారు. 2026లో దసరా నవరాత్రులు అక్టోబర్ 11 నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 19న నవమి వచ్చింది. అలాగే అక్టోబర్ 20న విజయదశమి జరుపుకుంటాము.

విజయదశమి 2026 తేదీ, శుభ ముహూర్తం

ఈ ఏడాది విజయదశమి అక్టోబర్ 20, మంగళవారం నాడు వచ్చింది. ముహూర్తం విషయానికి వస్తే, విజయదశమి విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:59 నుంచి 2:45 వరకు ఉంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడం మంచిది. అలాగే ఆయుధ పూజ, ప్రత్యేక పూజలను కూడా ఈరోజు నిర్వహించాలి.

దశమి తిథి అక్టోబర్ 20 మధ్యాహ్నం 12:50 గంటల నుంచి అక్టోబర్ 21 మధ్యాహ్నం 2:11 వరకు కొనసాగుతుంది. పంచాంగం ప్రకారం తిథి, ముహూర్తాల్లో ప్రాంతాలను బట్టి స్వల్ప మార్పులు ఉండొచ్చు.

తొమ్మిది రోజులు ఏ రూపాన్ని పూజించాలి? అమ్మవారికి సమర్పించే నైవేద్యాల వివరాలు తెలుసుకోండి

అక్టోబర్ 11: స్వర్ణ కవచం, పులగం

ఆ రోజు పులగం నైవేద్యంగా సమర్పించాలి.

అక్టోబర్ 12: బాలా త్రిపుర సుందరి

ఆ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం, పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి.

అక్టోబర్ 13: గాయత్రీ దేవి

ఆ రోజు గారెలను వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది.

అక్టోబర్ 14: అన్నపూర్ణాదేవి

ఆ రోజు క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారి అనుగ్రహం కలగడానికి అన్నపూర్ణాష్టకం చదువుకోండి.

అక్టోబర్ 15: లలితాదేవి

ఆ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన బొబ్బట్లను నైవేద్యంగా సమర్పిస్తే మంచిది.

అక్టోబర్ 16: మహాలక్ష్మి దేవి

అక్టోబర్ 16న మహాలక్ష్మి దేవి రూపం. ఆ రోజు పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మంచిది.

అక్టోబర్ 17: సరస్వతి దేవి

ఆ రోజు సరస్వతి దేవి రూపంలో అమ్మవారిని పెట్టి, దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి.

అక్టోబర్ 18: దుర్గాదేవి

ఆరోజు దుర్గాదేవి రూపం. ఆ రోజు గారెలను నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.

అక్టోబర్ 19: మహిషాసుర మర్దిని

ఆ రోజు మహిషాసుర మర్దిని రూపం. ఆరోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బూరెలను నైవేద్యంగా సమర్పించండి.

అక్టోబర్ 20: రాజరాజేశ్వరి దేవి

రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించండి.

విజయదశమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయండి. నైవేద్యాలు సమర్పించండి. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకోండి. విజయ దశమి నాడు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా ముఖ్యం.

అలాగే కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి కూడా విజయదశమి శుభప్రదమైన రోజు. విద్యార్థులు పుస్తకాలు, పరికరాలను పూజించడం, వాహనాలు, పనిముట్లను పూజించడం వలన అన్నీ బాగా కలిసి వస్తాయి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More