ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి? అదృష్టాన్ని తెచ్చే రంగులు ఇవే!
జ్యోతిష్య శాస్త్రంలో రంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని నమ్ముతారు. 7 రోజులు ఒక్కో గ్రహంతో సంబంధం కలిగి ఉండటంతో, ఆ రోజుకు అనుగుణంగా శుభప్రదమైన రంగు దుస్తులు ధరించడం ద్వారా సానుకూల శక్తి పెరిగి, సంబంధిత గ్రహ అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.
జ్యోతిష్య శాస్త్రంలో రంగులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వారంలో ఏడు రోజులు ఒక్కో గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. ప్రతి గ్రహానికి ప్రత్యేకమైన రంగు ఉంటుంది. వారంలోని రోజుకి అనుగుణంగా శుభప్రదమైన దుస్తులు ధరించడం వలన సానుకూల శక్తి పెరుగుతుంది. గ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రోజు ఏ రంగు అదృష్టాన్ని తీసుకొస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రోజు ఏ దుస్తులు ధరించాలి? ఏ రంగు అదృష్టాన్ని తీసుకువస్తుంది?
ఆదివారం
వారంలోని రోజుకి అనుగుణంగా శుభప్రదమైన దుస్తులు ధరించడం చాలా మంచిది. ఆదివారం సూర్యుడికి అంకితం చేయబడిన రోజు. ఆ రోజు ఎరుపు, నారింజ లేదా గులాబీ రంగు దుస్తులు ధరించడం వలన శుభ ఫలితాలను చూడొచ్చు. సూర్యుడిని శక్తి, ఆత్మవిశ్వాసం, గౌరవం, నాయకత్వం మొదలైన వాటికి కారకుడిగా భావిస్తారు.
సోమవారం
సోమవారం చంద్రుడు, పరమశివుడికి అంకితం చేయబడిన రోజు. ఆ రోజు తెలుపు, లేత నీలం లేదా వెండి రంగు దుస్తులను ధరించడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు.
మంగళవారం
మంగళవారం కుజుడు, ఆంజనేయస్వామికి అంకితం చేయబడిన రోజు. ఆ రోజు ముదురు ఎరుపు, కాషాయం, నారింజ రంగు దుస్తులను ధరిస్తే మంచి ఫలితాలను చూడొచ్చు.
బుధవారం
బుధవారం వినాయకుడికి సంబంధించిన రోజు. ఆ రోజు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు.
గురువారం
గురువారం మహావిష్ణువుకి అంకితం చేయబడిన రోజు. ఆ రోజు పసుపు, బంగారు లేదా నారింజ రంగు దుస్తులను ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. పైగా గురువుని జ్ఞానం, విద్య, ధర్మం, ఐశ్వర్యం, అదృష్టానికి కారకుడిగా చెప్తారు.
శుక్రవారం
శుక్రవారం శుక్ర గ్రహానికి, మహాలక్ష్మీ దేవికి అంకితం చేయబడినది. ఆ రోజు గులాబీ, తెలుపు, లేత నీలం లేదా ప్రకాశవంతమైన రంగులను ధరిస్తే మంచి ఫలితాలను చూడొచ్చు.
శనివారం
శనివారం శని దేవుడికి సంబంధించిన రోజు. ఆ రోజు నలుపు, ముదురు నీలం, ఊదా రంగు దుస్తులను ధరించడం వలన అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి.
నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


