శుక్ర అస్తమయం: ఈ నాలుగు రాశుల వారికి ఇక పట్టినల్లే.. ధన వర్షం ఖాయం!
జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం 2026 సెప్టెంబర్ 23న శుక్రుడు తులా రాశిలో అస్తమించి, అక్టోబర్ 30న తిరిగి ఉదయించనున్నాడు. ఈ శుక్ర అస్తమయ కాలం అన్ని రాశులపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. అయితే కర్కాటకం, సింహం, ధనుస్సు, మీనం రాశులకు ఈ కాలంలో సానుకూల ఫలితాలు ఉంటాయని పేర్కొంటున్నాయి.
జ్యోతిష్య శాస్త్రంలో ధనము, ఐశ్వర్యము, భోగభాగ్యాలకు కారకుడిగా భావించే శుక్ర గ్రహం త్వరలోనే తన స్థితిని మార్చుకోనుంది. సరిగ్గా రెండో రోజైన సెప్టెంబర్ 23, 2026, బుధవారం రోజున శుక్రుడు సూర్యునికి అతి సమీపంగా చేరి అస్తమించనున్నాడు. సూర్య గమనానికి దగ్గరగా రావడం వల్ల గ్రహాలు తమ ప్రభావాన్ని కోల్పోవడాన్ని 'అస్తం' అంటారు. ఈసారి శుక్రుడు తన స్వంత రాశి అయిన తులా రాశిలోనే అస్తమిస్తున్నాడు. దాదాపు 37 రోజుల పాటు ఇదే స్థితిలో కొనసాగి, అక్టోబర్ 30, 2026న తిరిగి ఉదయించనున్నాడు.

శుక్ర అస్తమయం.. ఈ నాలుగు రాశుల వారికి ఇక పట్టినల్లే
శుక్రుడి ఈ అస్తమయ ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. అయితే, కొన్ని ప్రత్యేక రాశుల వారికి మాత్రం ఇది ఎంతో శుభపరిణామాన్ని ఇస్తోంది. ముఖ్యంగా కర్కాటకం, సింహం, ధనుస్సు మరియు మీన రాశుల జాతకులకు ఈ కాలం అత్యంత లాభదాయకంగా మారుతుంది. సాధారణంగా ఈ రాశుల వారికి శుక్రుడి సంచారం కొంత ప్రతికూల ఫలితాలను ఇస్తుంటుంది.
ఉదాహరణకు ధనుస్సు రాశికి శుక్రుడు ఆరో అధిపతి కాగా, మీన రాశికి అష్టమాధిపతిగా ఉంటాడు. అలాగే కర్కాటక, సింహ రాశులపై కూడా ఇతని ప్రభావం కొన్నిసార్లు నెగటివ్‌గా మారుతుంది. అయితే ఇప్పుడు శుక్రుడు అస్తమించడం వల్ల ఆయా రాశులపై ఉన్న ఆ దుష్ప్రభావాలు తొలగిపోయి, ఊహించని సానుకూల ఫలితాలు వెల్లువెత్తుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు, వ్యాపారులకు భారీ లాభాలు, ప్రేమ జీవితంలో మధురమైన క్షణాలు సొంతమవుతాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ కాలం భౌతిక సుఖ-సంపదలను విపరీతంగా పెంచుతుంది. మీరు తలపెట్టిన పనుల్లో ఇళ్ల స్థలాలు, నూతన భవనాలు లేదా వాహనాలు కొనుగోలు చేసే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న శుభవార్తలు మీ ఇంటికి చేరుతాయి. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారస్తులకు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు దక్కుతాయి.
సింహ రాశి:
సింహ రాశి జాతకులకు అదృష్టం పూర్తిగా వెన్నంటి ఉంటుంది. అదృష్టం తోడు కావడంతో గతంలో ఆగిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. అకస్మాత్తుగా ధన లాభం కలిగే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వారికి భారీగా లాభం దక్కుతుంది. మీ సౌకర్యాలు పెరుగుతాయి. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలకు చక్కటి పరిష్కారం దొరకడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. కార్యాలయంలో మీ సత్తా చాటుకునే మంచి అవకాశాలు వస్తాయి.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి శుక్ర అస్తం వల్ల అనేక లాభదాయక పరిణామాలు ఎదురవుతాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది సరైన సమయం, విజయం తథ్యం. సమాజంలో మీ హోదా, పేరు ప్రఖ్యాతులు అమాంతం పెరుగుతాయి. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆర్థికంగా మీరు ఎంతో బలపడతారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు ఏర్పడటమే కాకుండా, పాత వనరుల నుంచి కూడా డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది.
మీన రాశి:
మీన రాశి వారికి ఈ సమయం ఎంతో ప్రశాంతంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. మీరు చేయి వేసిన ప్రతి పనిలోనూ విజయమే మీ సొంతం అవుతుంది. గతంలో ఉన్న దీర్ఘకాలిక రుణాల భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. మీ జీవిత భాగస్వామితో ఎంతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


