స్వాతి నక్షత్రంలోకి శుక్రుడి సంచారం - ఈ 4 రాశుల వారికి ధనయోగం, కీలక మార్పులు
శుక్రుడు స్వాతి నక్షత్రంలోకి అడుగుపెట్టడంతో వృషభం, కర్కాటకం, తులా, కుంభ రాశుల వారికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. ఉద్యోగం, వ్యాపారంలో కీలక మార్పులు రానున్నాయి.
జ్యోతిష్య శాస్త్రంలో విలాసాలు, ఐశ్వర్యం, భోగభాగ్యాలకు కారకుడైన శుక్ర గ్రహం తన నక్షత్ర సంచారాన్ని మార్చింది. శుక్రుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించాడు. స్వాతి నక్షత్రానికి అధిపతి నీడ గ్రహమైన రాహువు. శుక్ర, రాహువుల ఈ ప్రభావం కారణంగా మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారిపై ఎదో ఒక రకమైన ప్రభావం పడుతుంది.

అయితే ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నక్షత్ర మార్పు వల్ల ప్రధానంగా నాలుగు రాశుల వారికి విశేషమైన ధన యోగం పడుతోంది. వీరి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడటమే కాకుండా, పెండింగ్‌లో ఉన్న పనులు వేగవంతం కానున్నాయి. ఆ నాలుగు రాశుల జాతకులకు కలగబోయే ప్రయోజనాలు ఇవే…
వృషభ రాశి
వృషభ రాశి వారికి శుక్ర-రాహువుల ప్రభావం అత్యంత సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని, అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. వ్యాపారంలో ఉన్నవారికి నూతన అవకాశాలు తలుపు తడతాయి. ముఖ్యంగా భాగస్వామ్య (పార్ట్‌నర్‌షిప్) వ్యాపారాలు చేసేవారికి లాభాలు మెండుగా ఉంటాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఆర్థిక స్థితి మునుపటి కంటే చాలా బలపడుతుంది. రావలసిన పాత బాకీలు, చేతికి అందాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు సుగమమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి, ఆస్తులు కొనాలనుకునే వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఇంట్లో సౌకర్యాలు, విలాసవంతమైన వస్తువుల కొనుగోలు పెరుగుతుంది. భాగస్వామితో అనుబంధం బలపడి, ప్రశాంతమైన సమయాన్ని గడుపుతారు. జీవితంలో ప్రతీదీ మళ్లీ సరైన దారిలోకి వస్తుంది.
తులారాశి
తులా రాశి అధిపతి శుక్రుడే కావడం, ఆ శుక్రుడి సంచారం స్వాతి నక్షత్రంలో జరగడంతో తులారాశి వారికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉద్యోగంలో మెరుగైన ఆఫర్లు, కొత్త బాధ్యతలు లభించే సూచనలు ఉన్నాయి. ధన సంబంధిత సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత మధురంగా మారతాయి. మనస్సుకు ఎంతో సంతోషాన్నిచ్చే ఒక శుభవార్తను ఈ కాలంలో వింటారు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి రాబోయే రోజుల్లో ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. హఠాత్తుగా ధనలాభం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదనపు ఆదాయ వనరులు ఏర్పడి, బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. నిలిచిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన ప్రగతి కనిపిస్తుంది. కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపే అవకాశాలు లభిస్తాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

