Today Horoscope: చంద్ర-రాహువుల గ్రహణ యోగం ప్రభావం.. ఈరోజు 12 రాశులకు ఎలా ఉంటుంది? ప్రేమ, ఆర్థిక, ఉద్యోగ ఫలితాలు ఇవే

కుంభరాశిలో చంద్ర, రాహువుల కలయికతో ప్రమాదకరమైన గ్రహణ యోగం ఏర్పడింది. ఈ ప్రభావం ద్వాదశ రాశుల వారి ఆదాయం, మానసిక స్థితిపై ఎలా ఉంటుందో ప్రముఖ జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ఇక్కడ చదవండి.

Published on: Jun 7, 2026, 07:44:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నవగ్రహాల కదలికలు ఎప్పటికప్పుడు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ప్రస్తుత గ్రహాల సంచారం పరిశీలిస్తే.. మేషరాశిలో కుజుడు స్వగృహంలో ఉన్నాడు. వృషభరాశిలో సూర్యుడు, మిథునరాశిలో బుధ, శుక్రులు, కర్కాటకరాశిలో ఉచ్ఛ స్థితిలో గురువు సంచరిస్తున్నారు. సింహరాశిలో కేతువు ఉండగా, కుంభరాశిలో చంద్రుడు, రాహువు కలిసి 'గ్రహణ యోగం' సృష్టించారు. చంద్రుడు ప్రస్తుతం కుజుడి నక్షత్రమైన ధనిష్ఠలో ఉన్నాడు.

చంద్ర-రాహువులగ్రహణ యోగం ప్రభావం.. ఈరోజు 12 రాశులకు ఎలా ఉంటుంది? ప్రేమ, ఆర్థిక, ఉద్యోగ ఫలితాలు తెలుసుకోండి! (pinterest)
చంద్ర-రాహువులగ్రహణ యోగం ప్రభావం.. ఈరోజు 12 రాశులకు ఎలా ఉంటుంది? ప్రేమ, ఆర్థిక, ఉద్యోగ ఫలితాలు తెలుసుకోండి! (pinterest)

"శని, రాహువుల ప్రభావంతో ఏర్పడిన ఈ చంద్ర-రాహువుల కలయిక అస్సలు మంచిది కాదు," అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతినడమే కాకుండా ఆదాయంపై కూడా దెబ్బ పడుతుంది. ఇక శని దేవుడు మీనరాశిలో గోచరిస్తున్నాడు. ఈ గ్రహాల పరిస్థితి వల్ల ద్వాదశ రాశుల జాతకాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి

ఆదాయంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. మానసిక ఒత్తిడి మిమ్మల్ని కలవరపెడుతుంది. ప్రయాణాలు ఇబ్బందికరంగా సాగినా, చివరికి లాభాలనే అందిస్తాయి. శారీరక ఆరోగ్యం బాగున్నా, మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఈ సమయంలో కాస్త జాగ్రత్త అవసరం. కొన్ని అడ్డంకులు ఎదురైనా ఆదాయ మార్గాలు కొత్తగా తెరుచుకుంటాయి. మనసును కలచివేసే విషయాలు కొన్ని వినాల్సి రావచ్చు. పెట్టుబడులు పెట్టడానికి ఇది అస్సలు మంచి సమయం కాదు, కొన్నాళ్లు ఆగడం మంచిది. ప్రేమ, సంతాన విషయాలు సాధారణంగా ఉంటాయి. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల మేలు జరుగుతుంది.

వృషభ రాశి

ఆరోగ్యం సాధారణంగానే ఉన్నా, ఛాతికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కొంత ప్రతికూల వాతావరణం కనిపించినా, నష్టాలేమీ రావు. పరిస్థితి ఆందోళనకరంగా అనిపించినా, చివరకు అంతా సరుదుకుంటుంది. కోర్టు వ్యవహారాలు, వివాదాలకు దూరంగా ఉండాలి. ఆకుపచ్చని వస్తువును దగ్గర ఉంచుకోవడం శుభప్రదం.

మిథున రాశి

సమాజంలో అవమానాలు ఎదురయ్యే ముప్పు ఉంది, జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు కష్టతరంగా మారుతాయి. ఆధ్యాత్మిక విషయాల్లో అతివాదం పనికిరాదు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ, సంతాన జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. పసుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల దోషాలు తొలగుతాయి.

కర్కాటక రాశి

అష్టమ స్థానంలో గ్రహణ యోగం ఏర్పడటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఏదైనా సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ప్రేమ, సంతాన సంబంధాలు బాగుంటాయి. కొత్త ప్రేమ చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రయాణాలను పూర్తిగా వాయిదా వేయడమే మంచిది. వ్యాపార కోణంలో సమయం అనుకూలంగా ఉంది. అయితే, పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. సూర్యుడికి జల సమర్పణ చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

సింహ రాశి

మీ ఆరోగ్యంతో పాటు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కడుపునొప్పి, ఉదర సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ప్రేమికుల మధ్య విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రతి పరిస్థితిని ఓపికతో అధిగమించాలి. కొత్తగా ప్రేమ వ్యవహారాలు ప్రారంభించకపోవడం మంచిది, కొద్దిరోజులు ఆగి నిర్ణయం తీసుకోండి. పసుపు రంగు వస్తువును మీ దగ్గర ఉంచుకుంటే మంచిది.

కన్యా రాశి

జీవితంలో తీవ్రమైన ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యంపై కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. ప్రేమ, సంతాన సంబంధాలు బాగుంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఒడిదొడుకులు ఉన్నప్పటికీ జీవితం సాఫీగానే సాగుతుంది. కొత్తగా ప్రేమలో పడకండి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం, లాభాలు వస్తాయి. కాళికా దేవిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది.

తులా రాశి

ఆరోగ్యం మెరుగుపడుతున్నప్పటికీ, మానసిక ప్రశాంతత కరువవుతుంది. పిల్లల ఆరోగ్యం విషయంలో మనసు ఆందోళన చెందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. కొత్త ప్రేమ ప్రయత్నాలు విఫలమవడమే కాకుండా నిరాశను మిగులుస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి సమయం బాగుంది. ఈ సమయంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకండి. చిన్నపాటి పెట్టుబడులు పెట్టవచ్చు కానీ, భారీగా డబ్బు పెట్టడం రిస్క్‌తో కూడుకున్న పని. ఆలోచించి అడుగు వేయండి. ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం శుభప్రదం.

వృశ్చిక రాశి

గృహంలో కలహాలు, ఆస్తి, ఇల్లు కొనుగోలు చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. తల్లి ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంది. ఛాతిలో అసౌకర్యం, రక్తపోటు హెచ్చుతగ్గులు ఇబ్బంది పెడతాయి. ప్రేమ, సంతాన సంబంధాలు చాలా బాగుంటాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం. గృహ సంతోషం కాస్త తగ్గినా, మిగిలిన విషయాలు సాధారణంగానే ఉంటాయి. ఎరుపు రంగు వస్తువును దగ్గర ఉంచుకోవడం వల్ల మంచి జరుగుతుంది.

ధనుస్సు రాశి

ముక్కు, చెవి, గొంతు సమస్యల వల్ల అసౌకర్యానికి గురవుతారు. వ్యాపారంలో ఒడిదొడుకులు ఎదురవుతాయి కాబట్టి వ్యాపార నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ప్రేమ, సంతాన విషయాలు సానుకూలంగా ఉండి జీవితంలో ఆనందాన్ని నింపుతాయి. కొత్త ప్రేమ చిగురిస్తుంది, ఈ దిశగా అడుగులు వేయవచ్చు. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది, వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. జీవిత భాగస్వామితో బంధం బలంగా ఉంటుంది, దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుంది. ఆరోగ్యం మినహా మిగిలినవన్నీ బాగున్నాయి. నల్లటి వస్తువులను దానం చేయడం వల్ల దోషాలు తొలగుతాయి.

మకర రాశి

పెట్టుబడులు పెట్టడానికి ఇది అస్సలు అనుకూలమైన సమయం కాదు, ధన నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నోటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రేమ, సంతాన సంబంధాలు చాలా బాగుంటాయి. వ్యాపార కోణంలో చూస్తే ఈ సమయం ఎంతో శుభప్రదం, ప్రగతి కనిపిస్తుంది. ఈ కాలంలో కాళికా దేవిని దర్శించుకుని నమస్కరించడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి.

కుంభ రాశి

మనసులో ఆందోళన, నిలకడలేకపోవడం, మానసిక అశాంతి వంటి సమస్యలు వేధిస్తాయి. ప్రతికూల ఆలోచనల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆర్థిక పరమైన పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు, డబ్బు విషయంలో కొన్నాళ్లు ఆగడం ఉత్తమం. ఈ ఇబ్బందుల మధ్య ప్రేమ, సంతాన సంబంధాలు అండగా నిలిచి మానసిక ధైర్యాన్ని ఇస్తాయి. కష్టాల నుంచి విముక్తి పొందడానికి వినాయకుడిని ఆరాధించడం మంచిది.

మీన రాశి

తలనొప్పి, కళ్లనొప్పి, ఆందోళన, తెలియని భయం మిమ్మల్ని వేధిస్తాయి. ప్రేమ, సంతాన విషయాలకు ఇది సరైన సమయం కాదు. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారి మధ్య కూడా దూరం పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుబడులు పెట్టవచ్చు, ఎందుకంటే ధనలాభం కలిగే యోగాలు బలంగా ఉన్నాయి. వ్యాపారం సాధారణంగా సాగిపోతుంది. సమస్యల నుంచి బయటపడటానికి వినాయకుడిని పూజించడం శుభప్రదం.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More